Sunrisers Hyderabad Lost Match Against Rajasthan Royals: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయం చవిచూసింది. రాయల్స్ జట్టు కుదిర్చిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ చేధించలేకపోయింది. 131 పరుగులకే సన్‌రైజర్స్ చేతులు ఎత్తేయడంతో.. రాయల్స్ టీమ్ 73 పరుగులతో ఘనవిజయం సాధించింది. రాయల్స్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ వేయడంతో.. ఆది నుంచే సన్‌రైజర్స్ బ్యాటర్లు డీలా పడిపోయారు. ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్ బాట పట్టారు. ఏ ఒక్కరు కూడా కనీస పోరాట పటిమ కనబర్చలేకపోయారు. అబ్దుల్ సమద్ ఒక్కడే 32 పరుగులతో హయ్యస్ట్ స్కోరర్‌గా నిలిచాడంటే.. ఇతర బ్యాటర్ల పరిస్థితి ఏంటో మీరే అర్థం చేసుకోండి. భారీ అంచనాలు పెట్టుకున్న 13 కోట్ల ప్లేయర్ హ్యారీ బ్రూక్ అయిన దారుణంగా విఫలమయ్యాడు. 21 బంతుల్లో కేవలం 13 పరుగులే చేయడంతో.. అతనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Virat Kohli Tattoo: కోహ్లీ కొత్త టాటూ వెనుక.. ఇంత కథ దాగి ఉందా?
తొలుత టాస్ గెలిచి సన్‌రైజర్స్ ఫీల్డింగ్ ఎంపిక చేసుకోగా.. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. మొదట రాయల్స్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన యశస్వీ జైస్వాల్ (54), జాస్ బట్లర్ (54).. తమ జట్టుకి గొప్ప శుభారంభాన్ని ఇచ్చారు. మైదానంలో అడుగుపెట్టినప్పటి నుంచే విధ్వంసకర షాట్లు కొట్టారు. ఒకరి తర్వాత మరొకరు బౌండరీల మీద బౌండరీలు బాదుతూ.. సన్‌రైజర్స్ బౌలర్స్, ఫీల్డర్స్‌కి ముచ్చెమటలు పట్టించారు. కేవలం 5.5 ఓవర్లలోనే వీళ్లిద్దరు 85 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారంటే, ఏ రేంజ్‌లో విజృంభించారో అర్థం చేసుకోవచ్చు. బట్లర్ ఔటయ్యాక వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్ కూడా సన్‌రైజర్స్ బౌలర్లపై తాండవం చేశాడు. అతడు కూడా అర్థశతకం (55) పూర్తి చేసుకున్నాడు. చివర్లో హెట్‌మేయర్ (22) రాణించడంతో.. రాజస్థాన్ రాయల్స్ డబుల్ సెంచరీని దాటేసి.. సన్‌రైజర్స్‌కి 204 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
Devi Sri Prasad: మ్యూజిక్ డైరెక్టర్ డీఎస్పీ పెళ్లి.. అంత చిన్న అమ్మాయితోనా..?
ఇంత భారీ లక్ష్యాన్ని చూసినప్పుడే.. సన్‌రైజర్స్ దాన్ని ఛేధించడం కష్టమని ముందే అందరూ అంచనా వేశారు. ఆ అంచనాలకి తగినట్టుగానే.. సన్‌రైజర్స్ చేతులెత్తేసింది. టాపార్డర్ ఘోరంగా విఫలమైంది. మయాంక్ అగర్వాల్ క్రీజులో కుదురుకోవడానికి ప్రయత్నించాడు కానీ, అతడు కూడా తన 27 వ్యక్తిగత పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇతర బ్యాటర్లలో ఏ ఒక్కరూ కూడా.. తమ జట్టు స్కోర్ బోర్డుని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. మైదానంలో అడుగుపెట్టినట్టే పెట్టి.. పెవిలియన్ బాట పట్టారు. చివర్లో ఉమ్రాన్, అబ్దుల్ సమద్ కలిసి కాస్త మెరుపులు మెరిపించడంతో.. సన్‌రైజర్స్ స్కోరు 131కి చేరింది. లేకపోతే.. 100 పరుగుల తేడాతో హైదరాబాద్ జట్టు ఓటమి పాలయ్యేది. రాయల్స్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ తిప్పేశాడు. అతడు ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి.. రాజస్థాన్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.