Shubman Gill: అంపైర్తో శుభ్‌మన్ గిల్ గొడవ.. అసలు ముచ్చట ఏమిటంటే..?
- అంపైర్తో గొడవకు దిగిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్..
- రనౌట్ వివాదంపై తీవ్రంగా మండిపడిన శుభ్‌మన్ గిల్..
- తాను చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గదే లేదు: శుభ్‌మన్ గిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shubman Gill: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రనౌట్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్ 76 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. దీంతో అంపైర్లపై తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. మ్యాచ్ తర్వాత ఈ విషయంపై మాట్లాడుతూ.. తాను చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గనని తేల్చి చెప్పాడు.
Read Also: Tejashwi Yadav: కుల గణనపై ప్రధాని మోడీకి తేజస్వి యాదవ్ లేఖ
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
అయితే, నాకు, అంపైర్‌కు మధ్య చాలా డిస్కషన్ కొనసాగింది అని గుజరాత్ సారథి గిల్ పేర్కొన్నాడు. జట్టు విజయం కోసం 100 శాతం కృషి చేస్తున్నప్పుడు ఇలాంటివి జరగడం సహజం.. నేను నా వైఖరి నుంచి వెనక్కి తగ్గడం లేదు.. అక్కడ నా ఉద్దేశం ఏంటో క్లియర్ గా చెప్పాను.. ఎస్‌ఆర్‌హెచ్‌పై గెలిచి ప్లేఆఫ్స్‌కు చేరువ కావడం సంతోషంగా ఉంది.. కానీ, స్కోరు బోర్డును ఎలా ముందుకు తీసుకెళ్లాలో మాకు తెలుసు అన్నాడు. ఈ గ్రౌండ్ లో సిక్స్‌లు కొట్టడం చాలా కష్టం.. టాప్ – 3 బ్యాటర్లు రాణించడం ఆనందంగా ఉంది. మున్ముందు మా జట్టు అత్యుత్తమ ఆట తీరు ప్రదర్శించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని శుభ్‌మన్ గిల్ వ్యాఖ్యానించాడు.
Read Also: Tummala Nageswara Rao: అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదు..
ఇక, శుభ్‌మన్ గిల్ 38 బంతుల్లో 76 రన్స్ చేసి సెంచరీ దూసుకుపోతున్న వెళ్తోన్న అతడిని రనౌట్ నిర్ణయం డగౌట్ బాట పట్టాల్సి వచ్చింది. హర్షల్ పటేల్ విసిరిన త్రోను క్లాసెన్ అందుకునే ప్రయత్నం చేయగా.. బంతి గ్లవ్స్‌ను తాకి స్టంప్ పక్క నుంచి వెళ్లింది.. ఆ సమయంలో అతడి గ్లవ్ స్టంప్‌ను తాకడంతో బెయిల్స్ పైకి లేచాయి. చాలాసేపు రీప్లేను పరిశీలించిన థర్డ్ అంపైర్ గిల్ ఔట్ అని ప్రకటించాడు. రివ్యూలో బంతి స్టంప్‌ను తాకినట్లు కానీ, బంతి క్లాసెన్ చేతిలో ఉండగా గ్లవ్ స్టంప్‌ను కొట్టినట్లు క్లియర్ గా లేకపోయినా.. అంపైర్ ఔటివ్వడం ఆశ్చర్యపరిచింది.. దీంతో గుజరాత్ కెప్టెన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. మైదానం నుంచి బయటికి వస్తూ అక్కడున్న అంపైర్‌తో గొడవకు దిగాడు. అంపైర్‌తో వాగ్వాదం చేసినందుకు గిల్‌పై భారీగా జరిమానా పడే ఛాన్స్ ఉందని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
What's your take? 👇✍🏻#ShubmanGill seen having a word with the umpire after being given out by the third umpire on a tight call! 👀
Watch the LIVE action ➡ https://t.co/RucOdyBVUf#IPLonJioStar 👉 #GTvSRH | LIVE NOW on SS-1, SS- 1 Hindi & JioHotstar! pic.twitter.com/TPiALXJu8O
— Star Sports (@StarSportsIndia) May 2, 2025
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్‌పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్‌నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?