ఖమ్మం నగరంలోని 49 వ డివిజన్ మామిల్లగూడెం లో రోడ్లు, డ్రైనేజ్ లకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ… కమీషనర్ అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చినప్పటికీ పాత పద్ధతిలో కాకుండా భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని నాణ్యత ప్రమాణాల ప్రకారం నిర్మాణాలు చేపట్టండి అని కోరారు. నిర్మాణం చేసేప్పుడు కార్పొరేటర్లు, డివిజన్ పెద్దలు వాటి నిర్మాణంలో నాణ్యత లేకపోతే కమీషనర్ కు సమాచారం ఇవ్వండని సూచించారు.
Also Read:Buggamatham Lands: కాసేపట్లో తిరుపతి బుగ్గమఠం భూముల సర్వే..
నిర్మాణం సరిగ్గా జరగకపోతే పందులు, ఈగలు, దోమలు వ్యాపించి రోగాలు దరి చేరతాయని అన్నారు. ఖాళీ స్థలాలు ఎవరైనా శుభ్రం చేయించుకోవాలి, లేనిచో నగర పాలక సంస్థ నుంచి నోటీసులు జారీ చేయండని ఆదేశించారు. రెండు మూడు నోటీసులకు స్పందించకపోతే ఆ స్థలం నగర పాలక సంస్థ పరిధిలోకి వెళ్తుంది ఆ తర్వాత మీరు ఏమి చేయలేరన్నారు. కమీషనర్ ఎక్కడ రాజీ పడకుండా ఖమ్మం నగరం ఆనందమైన నగరంగా తీర్చిదిద్దాలి అని ఆదేశించారు. రోడ్లపై గుడులు, మసీదులు, చర్చ్ లు నిర్మిస్తే వాటి పై మొదటిలోనే చర్యలు తీసుకోవాలన్నారు.
Also Read:Nani: ది ప్యారడైజ్‌లోకి అడుగు పెట్టేది అప్పుడే!
ప్రధాన రహదారులు నేను చేయగలుగుతా కానీ, డివిజన్ లలో మీరే చూసుకోవాలి.. అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదు, మీరు నాకు ఓటు వేయకపోయినా ఫర్వాలేదు.. నచ్చితే ఓటు వేసి గెలిపించండి, లేదా ఓడించండి. మీ మనసు గెలుచుకుంటే మమ్మల్ని గెలవకుండా ఎవరు ఆపలేరని అన్నారు. నేను గెలిచిన నాటి నుంచి ఎవరి గురించి కూడా నేను పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేయలేదు, చేయను కూడ.. ఆర్డీఓ, కమీషనర్ లు మాస్టర్ ప్లాన్ ప్రకారం పని చేసుకుంటూ వెళ్ళండి.. రోడ్లను ఆక్రమించి ఉండేవారిని ఇబ్బంది పెట్టొద్దు, వారికి ఊరి బయట ఇళ్ల స్థలాలు ఇవ్వండి, వారికి ఇల్లు ఇవ్వండి.. రైల్వే స్టేషన్ రోడ్, పొట్టి శ్రీరాములు రోడ్డు చాలా ఇరుకుగా ఉంది వాటిని వెడల్పు చేయాలి.. ఓట్లు వేపించుకునే వారు కానీ, ఓట్లు వేయాలి అనుకునేవారు కానీ సక్రమంగా పని చేస్తే మీకే ఓటు వేస్తారు ప్రజలు అని మంత్రి తుమ్మల వెల్లడించారు.