IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2027: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే చెన్నై సూపర్ కింగ్స్ (CSK), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య కీలక ట్రేడ్ డీల్ కుదిరింది. సీఎస్కేకు చెందిన ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్‌లను సన్‌రైజర్స్‌కు బదిలీ చేయగా.. వారి స్థానంలో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్, ఆస్ట్రేలియా యువ ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ చెన్నై జట్టులోకి రానున్నారు.
గత వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ లియామ్ లివింగ్‌స్టోన్‌ను రూ.13 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే తాజా ట్రేడ్‌లో అతడు రూ.6 కోట్ల తగ్గింపు ధరతో సీఎస్కేకు మారనున్నాడు. మరోవైపు ఆస్ట్రేలియా యువ సీమర్ ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ తన ప్రస్తుత ధర అయిన రూ.3 కోట్లకే చెన్నై జట్టులో చేరనున్నాడు. అలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ఖలీల్ అహ్మద్‌ను రూ.4.8 కోట్లకు, నాథన్ ఎల్లిస్‌ను రూ.2 కోట్లకు సొంతం చేసుకుంది.
Also Read
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
2026 వేలంలో జాక్ ఎడ్వర్డ్స్ కోసం సీఎస్కే, సన్‌రైజర్స్ మధ్య పోటీ నెలకొంది. చివరకు హైదరాబాద్ ఫ్రాంచైజీ అతడిని దక్కించుకుంది. అయితే పాదానికి గాయం కావడంతో గత సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఆ వేలంలో కాంట్రాక్ట్ పొందిన అన్క్యాప్డ్ విదేశీ ఆటగాళ్లలో ఎడ్వర్డ్స్ ఒక్కరే కావడం విశేషం. ఈ ఏడాది ఆస్ట్రేలియా తరఫున వన్డే, టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. దక్షిణాఫ్రికాతో జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన తన రెండో వన్డేలోనే ఐదు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్‌కు కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అమెరికాలోని మేజర్ లీగ్ క్రికెట్లో వాషింగ్టన్ ఫ్రీడమ్ తరఫున కూడా ఆడాడు.
మరోవైపు ఖలీల్ అహ్మద్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త జట్టు కాదు. 2018 నుంచి 2021 వరకు ఆ జట్టు తరఫున ఆడాడు. 2026 ఐపీఎల్లో సీఎస్కే తరఫున ఐదు మ్యాచ్‌లు ఆడిన అతడు, తొడ కండరాల గాయంతో సీజన్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు మళ్లీ హైదరాబాద్ జట్టులోకి చేరనున్నాడు. ఇప్పటికే ట్రేడ్ ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి వచ్చిన మరో ఎడమచేతి వాటం పేసర్ నటరాజన్‌తో కలిసి బౌలింగ్ చేయనున్నాడు. మరోవైపు నాథన్ ఎల్లిస్ కూడా సన్‌రైజర్స్‌లో చేరనున్నాడు. గత సీజన్లో గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమైన అతడు, సీఎస్కే తరఫున రెండు సీజన్లలో కలిపి కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు.
లియామ్ లివింగ్‌స్టోన్ రాకతో సీఎస్కే బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ మరో బలమైన ప్రత్యామ్నాయం లభించనుంది. అతడు ఇప్పటివరకు 370 టీ20 మ్యాచ్‌ల్లో 8,595 పరుగులు చేశాడు. అంతేకాకుండా ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్‌తో కలిపి 171 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో గ్లాస్గో కాస్మిక్ తరఫున పది ఇన్నింగ్స్‌ల్లో 219 పరుగులు సాధించాడు. ఐపీఎల్ 2027 వేలానికి ముందు ఆటగాళ్ల రిటెన్షన్, విడుదల జాబితాలను ఖరారు చేసేందుకు జట్లకు ఇచ్చిన గడువును రెండు రోజులు పొడిగించారు. తొలుత నవంబర్ 15గా నిర్ణయించిన గడువును నవంబర్ 17కు మార్చారు. ఇక ఐపీఎల్ 2027 మినీ వేలం డిసెంబర్ 16న గోవాలో జరగనుంది.
తాజావార్తలు
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Shadman Islam: బంగ్లాదేశ్‌కు భారీ షాక్.. గాయంతో స్ట్రెచర్‌పై మైదానం వీడిన ఓపెనర్..!
-
UP Farmers Relief: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన యోగి సర్కార్.. అన్నదాతకు భారీ ఊరట
-
IND vs NZ: రెండో వన్డే మ్యాచ్ రద్దు కానుందా..?
-
Gollabuddharam Murder: ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చిన భార్య.. మృతదేహాన్ని ఎడ్లబండిపై తరలించి..!
ట్రెండింగ్
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!
-
200MP పెరిస్కోప్ కెమెరా, ఏడేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7000mAh బ్యాటరీతో Motorola Signature 27 లాంచ్..!