DMK MLA: తమిళనాడులో మరో ఎమ్మెల్యేపై మహిళా అధికారిణి వేధింపుల ఆరోపణలు.. ఎఫ్ఐఆర్ నమోదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DMK MLA Vasantham K Karthikeyan: తమిళనాడులో ప్రజాప్రతినిధులపై మహిళా అధికారిణుల వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే టీవీకే ఎమ్మెల్యేపై కేసు నమోదైన ఘటన మరువకముందే.. తాజాగా డీఎంకే ఎమ్మెల్యేపై కూడా పోలీసులకు ఫిర్యాదు అందింది. కల్లకురిచ్చి జిల్లాలో వారం రోజుల వ్యవధిలోనే ఎమ్మెల్యేలకు సంబంధించిన ఇలాంటి రెండో ఘటన వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. రిషివందియం నియోజకవర్గానికి చెందిన డీఎంకే ఎమ్మెల్యే వసంతం కె. కార్తికేయన్‌పై ఓ మహిళా అధికారిణి వేధింపుల ఆరోపణలు చేశారు. తమిళనాడు రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్ (TNSRLM)లో పనిచేస్తున్న బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తియాగదురుగం పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.
అక్టోబర్ 18న వీరచోళపురంలోని జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయంలో ఈ ఘటన జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 79, సెక్షన్ 132, సెక్షన్ 351(2)తో పాటు తమిళనాడు మహిళల వేధింపుల నిషేధ చట్టంలోని సెక్షన్ 4 కింద కేసు నమోదైంది. ఈ సెక్షన్లకు సంబంధించిన ఆరోపణలు మహిళ గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించడం, ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించేలా దాడి లేదా బలప్రయోగం చేయడం, క్రిమినల్ బెదిరింపులకు పాల్పడటం వంటి అంశాలకు సంబంధించినవి.
Also Read
- Viral Video: ఏంటి స్వామి ఈ పని..? రైలులో ఏదైనా జరగరానిది జరిగితే ఎలా..
- Fake Doctor Racket Busted: 11వ తరగతి చదివి డాక్టర్‌గా అవతారం.. నకిలీ MBBS డిగ్రీలతో ఢిల్లీలో వైద్యం!
- December 2026 Updates: కొత్త నెల, కొత్త రూల్స్.. డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రాబోతున్న పెద్ద మార్పులివే!
- Women's Reservation Bill 2026: మహిళా రిజర్వేషన్ బిల్లుపై మోడీ సర్కార్ కీలక నిర్ణయం?.. నేడు కేంద్ర కేబినెట్ భేటీ
కల్లకురిచ్చి జిల్లాలో వారం రోజుల వ్యవధిలోనే మరో ఎమ్మెల్యేపై ఇలాంటి ఆరోపణలతో కేసు నమోదవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల కల్లకురిచ్చి టీవీకే ఎమ్మెల్యే సి. అరుణ్ విఘ్నేష్‌పై కూడా కేసు నమోదైంది. జిల్లాకు చెందిన ఓ సీనియర్ మహిళా అధికారిణి ఫిర్యాదు మేరకు మహిళా పోలీస్ స్టేషన్లో ఆయనపై లైంగిక వేధింపులకు సంబంధించిన మరో కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
DMK MLA: తమిళనాడులో మరో ఎమ్మెల్యేపై మహిళా అధికారిణి వేధింపుల ఆరోపణలు.. ఎఫ్ఐఆర్ నమోదు!
-
Mohammed Shami: పట్టించుకోవడం ఎప్పుడో మానేశా.. చేయాల్సింది చాలా ఉంది.. షమీ కీలక వ్యాఖ్యలు!
-
Viral Video: ఏంటి స్వామి ఈ పని..? రైలులో ఏదైనా జరగరానిది జరిగితే ఎలా..
-
Fake Doctor Racket Busted: 11వ తరగతి చదివి డాక్టర్‌గా అవతారం.. నకిలీ MBBS డిగ్రీలతో ఢిల్లీలో వైద్యం!
-
HP OmniBook Ultra 16: డెవలపర్లు, క్రియేటర్ల కోసం.. HP పవర్ఫుల్ AI ల్యాప్‌టాప్ లాంచ్.. 128GB RAM, NVIDIA AI చిప్
ట్రెండింగ్
-
25 రోజుల బ్యాటరీ బ్యాకప్, 100+ స్పోర్ట్స్ మోడ్స్ తో Vivo WATCH GT 2 స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Sineth Jayawardena: కోచ్ మాటలతో టీమిండియాపై చెలరేగిపోయా.. శ్రీలంక సెంచరీ హీరో సంచలన వ్యాఖ్యలు!
-
BSNL సంచలనం.. రూ.51కే 56GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్..!
-
IND vs NZ 2nd Test: అరంగేట్రంలోనే వికెట్ తీసిన గుర్నూర్.. లాథమ్ హాఫ్ సెంచరీతో దూకుడుగా..!
-
Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..