Viral Video: ఏంటి స్వామి ఈ పని..? రైలులో ఏదైనా జరగరానిది జరిగితే ఎలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: భారతదేశంలోని రైల్వే వ్యవస్ధత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంలేదు. ఇకపోతే రైలు ప్రయాణంలో ప్రయాణికులు రకరకాల పనులు చేస్తూ అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. అయితే కొన్నిసార్లు కొందరి చర్యలు ఇతర ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేయడంతో పాటు భద్రతాపరమైన ఆందోళనలను కూడా కలిగిస్తుంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో ఇంకా తెలియరాలేదు.
అయ్యప్ప స్వామి మాల వేసుకున్న ఓ ప్రయాణికుడు కదులుతున్న ఏసీ రైలులో దీపం వెలిగించి పూజలు చేస్తూ, గట్టిగా శంఖం ఊదుతున్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. ఈ వీడియో బయటకు రావడంతో రైలులో ఇలాంటి పనులకు అనుమతి ఉందా? అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. వైరల్ అవుతున్న వీడియోలో ఓ ప్రయాణికుడు తన సీటు సమీపంలో పూజలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. మతపరమైన విశ్వాసాలు, పూజలు వ్యక్తిగతమైనవే అయినప్పటికీ.. కదులుతున్న రైలులో ఇలా నిప్పు లేదా దీపం వెలిగించడం మాత్రం భద్రతాపరమైన సమస్యలకు దారితీయవచ్చు.
Also Read
- Hyderabad: ఖైరతాబాద్ GHMC జోనల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. కీలక ఫైళ్లు దగ్ధం!
- 25 రోజుల బ్యాటరీ బ్యాకప్, 100+ స్పోర్ట్స్ మోడ్స్ తో Vivo WATCH GT 2 స్మార్ట్‌వాచ్ లాంచ్..!
- AP Cabinet Meeting Today: రూ.88,392 కోట్ల పెట్టుబడులు.. 54 వేల మందికి ఉద్యోగాలు!
- December 2026 Updates: కొత్త నెల, కొత్త రూల్స్.. డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రాబోతున్న పెద్ద మార్పులివే!
ముఖ్యంగా ఏసీ రైలు బోగీలు మూసి ఉన్న ప్రదేశాలు కావడంతో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా అగ్నిప్రమాదానికి కారణమయ్యే ప్రమాదం ఉంది. మంటలు వ్యాపిస్తే ప్రయాణికుల ప్రాణాలకు, ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. రైల్వేలో అగ్నిప్రమాదాలను నివారించడం, ప్రయాణికుల ప్రాణాలు, ఆస్తులను రక్షించడం ఫైర్ సేఫ్టీ నిబంధనల ప్రధాన ఉద్దేశం. పెట్రోల్, కిరోసిన్, గ్యాస్ సిలిండర్లు వంటి మండే స్వభావం కలిగిన ప్రమాదకర వస్తువులను రైలులో తీసుకెళ్లడంపై నిషేధం ఉంది. అలాగే అగ్నికి కారణమయ్యే వస్తువులను ఉపయోగించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని రైల్వే అధికారులు సూచిస్తుంటారు. అయితే రైలులో దీపం వెలిగించడం వంటి ఘటనల్లో ఏ చర్య తీసుకోవాలనేది ఉపయోగించిన వస్తువు స్వభావం, దాని వల్ల ఏర్పడిన ప్రమాదం, అప్పటి పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ వీడియో ఆధారంగా మాత్రమే నిర్దిష్ట చట్టపరమైన చర్యలు తీసుకుంటారని చెప్పలేం.
రైలు ప్రయాణ సమయంలో ఎక్కడైనా అగ్నిప్రమాదం జరిగే అవకాశం ఉందని భావించినా, ఇతర ప్రయాణికుల భద్రతకు ముప్పు కలిగించే చర్యలు కనిపించినా వెంటనే రైలులోని రైల్వే సిబ్బందికి సమాచారం అందించాలి. అంతేకాకుండా భారతీయ రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ప్రయాణికులందరి భద్రత దృష్ట్యా రైలులో అగ్నికి కారణమయ్యే వస్తువులను ఉపయోగించకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. ఈ వీడియోపై నెటిజన్స్ కాస్త సీరియస్ గానే స్పందిస్తున్నారు.
🚨 INDIAN RAILWAYS IN CONTROVERSY OVER AARTI INSIDE MOVING TRAIN! 🚆🔥
A video of an Ayyappa devotee lighting a diya and performing puja inside an AC train coach has gone viral. https://t.co/TAjzOBtioL
— Viral clips (@Viralkps) November 26, 2026
తాజావార్తలు
-
Viral Video: ఏంటి స్వామి ఈ పని..? రైలులో ఏదైనా జరగరానిది జరిగితే ఎలా..
-
Fake Doctor Racket Busted: 11వ తరగతి చదివి డాక్టర్‌గా అవతారం.. నకిలీ MBBS డిగ్రీలతో ఢిల్లీలో వైద్యం!
-
HP OmniBook Ultra 16: డెవలపర్లు, క్రియేటర్ల కోసం.. HP పవర్ఫుల్ AI ల్యాప్‌టాప్ లాంచ్.. 128GB RAM, NVIDIA AI చిప్
-
Hyderabad: ఖైరతాబాద్ GHMC జోనల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. కీలక ఫైళ్లు దగ్ధం!
-
25 రోజుల బ్యాటరీ బ్యాకప్, 100+ స్పోర్ట్స్ మోడ్స్ తో Vivo WATCH GT 2 స్మార్ట్‌వాచ్ లాంచ్..!
ట్రెండింగ్
-
Sineth Jayawardena: కోచ్ మాటలతో టీమిండియాపై చెలరేగిపోయా.. శ్రీలంక సెంచరీ హీరో సంచలన వ్యాఖ్యలు!
-
BSNL సంచలనం.. రూ.51కే 56GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్..!
-
IND vs NZ 2nd Test: అరంగేట్రంలోనే వికెట్ తీసిన గుర్నూర్.. లాథమ్ హాఫ్ సెంచరీతో దూకుడుగా..!
-
Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..