IPL 2027 Auction: వేలం బరిలో 1,220 మంది ఆటగాళ్లు.. రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌లో దిగ్గజ ఆటగాళ్లు.. పూర్తి లిస్ట్ ఇదిగో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2027 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2027 మినీ వేలానికి రంగం సిద్ధమైంది. డిసెంబర్ 16న గోవా వేదికగా జరగనున్న ఈ వేలం కోసం ఇప్పటివరకు మొత్తం 1,220 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు ప్రధాన నివేదికలు వెల్లడించాయి. ఫ్రాంచైజీల వద్ద ఉన్న మొత్తం 66 ఖాళీ స్థానాల (ఇందులో 25 విదేశీ ఆటగాళ్ల స్థానాలు) కోసం వీరంతా పోటీ పడనున్నారు.
ఆటగాళ్ల విభాగాల వారీ లెక్కలు ఇవే..
వేలానికి రిజిస్టర్ చేసుకున్న మొత్తం 1,220 మంది ఆటగాళ్లలో 939 మంది భారతీయులు కాగా, 281 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. వీరిలో కేవలం 14 మంది మాత్రమే క్యాప్డ్ భారతీయులు (Capped Indians) ఉండగా, క్యాప్డ్ విదేశీ ఆటగాళ్లు 170 మంది ఉన్నారు. అలాగే అసోసియేట్ దేశాల నుంచి 42 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అన్క్యాప్డ్ విభాగంలో గతంలో ఐపీఎల్ ఆడిన భారతీయులు 127 మంది, కొత్తగా పోటీపడుతున్న భారత ఆటగాళ్లు 798 మంది ఉండగా, అన్క్యాప్డ్ విదేశీ ఆటగాళ్ల సంఖ్య 69గా ఉంది.
Also Read
- 200MP + 200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీ, ARRI సినిమాటిక్ ఫీచర్లతో HONOR Magic9 Pro Max లాంచ్..!
- UAE Captain Basil Hameed: వైభవ్‌ను ఆపడం చాలా కష్టం.. ఓటమి షాక్ నుంచి కోలుకోవడానికి టైమ్ పడుతుంది.!
- Violence Against Women: హింసకు కొత్త రూపం.. డిజిటల్ ప్రపంచంలో మహిళలకు భద్రత ఏది.?
- Tilak Varma: ఎలాంటి మాటల్లేవ్.. నేను చూసిన 'ది బెస్ట్ ఇన్నింగ్స్ ఇదే'..! వైభవ్ పై కెప్టెన్ ప్రశంసలు..
రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌లో ఇద్దరే భారత ఆటగాళ్లు
అత్యధిక కనీస ధర అయిన రూ. 2 కోట్ల జాబితాలో మొత్తం 29 మంది స్టార్ క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు. భారత్ నుంచి కేవలం ఇద్దరు పేసర్లు అవేశ్ ఖాన్, దీపక్ చాహర్ మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు. విదేశీ స్టార్లలో ఆస్ట్రేలియా నుంచి డేవిడ్ వార్నర్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, జై రిచర్డ్సన్, మహలీ బియర్డ్‌మన్, స్పెన్సర్ జాన్సన్ లు ఈ రేసులో ఉన్నారు. అలాగే ఇంగ్లాండ్ నుంచి బెన్ స్టోక్స్, జానీ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, సోనీ బేకర్, టామ్ కరన్ రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌తో బరిలోకి దిగుతున్నారు. ఇంకా న్యూజిలాండ్ నుంచి ఆడమ్ మిల్నే, బెన్ సియర్స్, బెవాన్ జాకబ్స్, డారిల్ మిచెల్, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, ట్రెంట్ బౌల్ట్, విలియం ఓరూర్క్ ఈ జాబితాలో నిలిచారు. వీరితో పాటు ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఫజల్హక్ ఫారూఖీ, ముజీబ్ ఉర్ రెహమాన్, రహ్మానుల్లా గుర్బాజ్ లు ఉండగా.. దక్షిణాఫ్రికా పేసర్లు అన్రిచ్ నోర్ట్జే, గెరాల్డ్ కోయెట్జీ లు కూడా ఉన్నారు. అలాగే శ్రీలంక స్టార్లు మతీషా పతిరానా, వనిందు హసరంగా.. వెస్టిండీస్ ఆటగాళ్లు షాయ్ హోప్, షిమ్రాన్ హెట్మెయర్ కూడా రూ. 2 కోట్ల విభాగంలో ఉన్నారు.
రూ. 1 కోటి, రూ. 75 లక్షల జాబితా
రూ. 1 కోటి బేస్ ప్రైస్ విభాగంలో నలుగురు ప్రధాన భారత బౌలర్లు ఆకాశ్ దీప్, జయదేవ్ ఉనద్కత్, తుషార్ దేశ్‌పాండే, ఉమేష్ యాదవ్ తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇక రూ. 75 లక్షల కనీస ధర జాబితాలో 8 మంది భారత ఆటగాళ్లు దీపక్ హుడా, కరుణ్ నాయర్, కుల్దీప్ సేన్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, సారాంశ్ జైన్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్ ఉన్నారు. మరోవైపు బంగ్లాదేశ్‌కు చెందిన 11 మంది ఆటగాళ్లు హసన్ మహ్మద్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, రిపన్ మొండల్, రిషాద్ హసన్, సైఫ్ హసన్, షేక్ మహేదీ హసన్, షమీమ్ హుస్సేన్, షోరిఫుల్ ఇస్లామ్, తంజీమ్ హసన్ సాకిబ్, తౌహిద్ హృదయ్, ఎండీ రుబెల్ బేస్ ప్రైస్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది.
తుది జాబితాపై బీసీసీఐ కసరత్తు
ప్రస్తుతం 1,220 మందితో ఉన్న ఈ ప్రాథమిక జాబితాను ఫ్రాంచైజీల అవసరాలకు అనుగుణంగా కుదించనున్నారు. డిసెంబర్ 1వ తేదీ లోపు ఆయా జట్లు తమకు కావాల్సిన ఆటగాళ్ల షార్ట్‌లిస్ట్‌ను బీసీసీఐకి సమర్పిస్తాయి. ఆ తర్వాత వేలానికి వారం ముందు తుది జాబితా విడుదల కానుంది. బెన్ స్టోక్స్, డేవిడ్ వార్నర్, ట్రెంట్ బౌల్ట్, మతీషా పతిరానా వంటి స్టార్ క్రికెటర్లు రూ. 2 కోట్ల విభాగంలో ఉండటంతో ఈసారి వేలంలో భారీ ధరలు పలికే అవకాశం ఉంది.

తాజావార్తలు
-
IPL 2027 Auction: వేలం బరిలో 1,220 మంది ఆటగాళ్లు.. రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌లో దిగ్గజ ఆటగాళ్లు.. పూర్తి లిస్ట్ ఇదిగో..
-
Sharwanand: నన్ను కూడా సీఎంను చేస్తారా?.. హీరో శర్వానంద్ కీలక వ్యాఖ్యలు!
-
Bangladesh Measles Outbreak: బంగ్లాదేశ్‌లో మీజిల్స్ కలకలం.. 1,361 మంది మృతి.. భారత్‌కు కూడా ముప్పు ఉందా?
-
Vaibhav Sooryavanshi: 53 బంతుల్లో 204 పరుగులు.. లిస్ట్-ఏ క్రికెట్లో విధ్వంసకర రికార్డులు!
-
200MP + 200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీ, ARRI సినిమాటిక్ ఫీచర్లతో HONOR Magic9 Pro Max లాంచ్..!
ట్రెండింగ్
-
UAE Captain Basil Hameed: వైభవ్‌ను ఆపడం చాలా కష్టం.. ఓటమి షాక్ నుంచి కోలుకోవడానికి టైమ్ పడుతుంది.!
-
Violence Against Women: హింసకు కొత్త రూపం.. డిజిటల్ ప్రపంచంలో మహిళలకు భద్రత ఏది.?
-
Tilak Varma: ఎలాంటి మాటల్లేవ్.. నేను చూసిన ‘ది బెస్ట్ ఇన్నింగ్స్ ఇదే’..! వైభవ్ పై కెప్టెన్ ప్రశంసలు..
-
Vaibhav Sooryavanshi: రికార్డ్స్ గురించే ఆలోచించలేదు.. అలా ఉండడంతో స్వేచ్ఛగా ఆడేసా..!
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!