Yashasvi Jaiswal History: యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yashasvi Jaiswal Creates History: టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్టు క్రికెట్లో మరో అరుదైన ఘనత సాధించాడు. టెస్టు అరంగేట్రం చేసినప్పటి నుంచి వరుసగా తొలి 33 టెస్టు మ్యాచ్‌లను 33 వేర్వేరు మైదానాల్లో ఆడిన రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో మైదానంలోకి అడుగుపెట్టడంతో జైస్వాల్ ఈ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడు కూడా భారతీయుడే కావడం విశేషం. మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కూడా తన తొలి 33 టెస్టులను వేర్వేరు వేదికల్లో ఆడాడు. ఇప్పుడు జైస్వాల్ అతడి రికార్డును సమం చేశాడు.
మంజ్రేకర్ సరసన జైస్వాల్:
సంజయ్ మంజ్రేకర్ 1994 డిసెంబర్లో మొహాలీ వేదికగా వెస్టిండీస్‌తో తన 33వ టెస్టు మ్యాచ్ ఆడాడు. మొత్తం 37 టెస్టులు ఆడిన మంజ్రేకర్.. తొలి 33 మ్యాచ్‌లు వేర్వేరు మైదానాల్లో ఆడాడు. యశస్వి జైస్వాల్ 2023 జూలై 12న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్టు అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆడిన 33 టెస్టులను వేర్వేరు వేదికల్లో ఆడటంతో మంజ్రేకర్ సరసన నిలిచాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును జైస్వాల్ అధిగమించాడు. సచిన్ తన తొలి 32 టెస్టులను వేర్వేరు మైదానాల్లో ఆడాడు. ఈ జాబితాలో భారత మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్, వెస్టిండీస్ ఆటగాడు దినేశ్ రామ్‌దిన్ సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉన్నారు. వీరిద్దరూ తమ తొలి 24 టెస్టులను వేర్వేరు వేదికల్లో ఆడారు.
Also Read
- Vedant Sehwag: పెద్దోడు డేంజర్.. చిన్నోడు మహా డేంజర్.. 7 వికెట్లతో చెలరేగిన సెహ్వాగ్ చిన్న కుమారుడు..
- Mohammed Shami: పట్టించుకోవడం ఎప్పుడో మానేశా.. చేయాల్సింది చాలా ఉంది.. షమీ కీలక వ్యాఖ్యలు!
- Sineth Jayawardena: కోచ్ మాటలతో టీమిండియాపై చెలరేగిపోయా.. శ్రీలంక సెంచరీ హీరో సంచలన వ్యాఖ్యలు!
- Tilak Varma: మాకు ఏదీ కలిసి రాలేదు.. ఆ ఇద్దరే మమ్మల్ని ముంచారు.. మనోళ్లు కూడా..!
మంజ్రేకర్ రికార్డుకు ఎసరు:
ఇక న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్ 85 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఈ ప్రదర్శనతో తాజాగా విడుదలైన ఐసీసీ టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు వచ్చే ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోని తొలి టెస్టులో ఆడితే.. మంజ్రేకర్ రికార్డును కూడా అధిగమించనున్నాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2027 జనవరి 21 నుంచి ప్రారంభం కానుంది. చెన్నై, గువాహటి, రాంచీ, అహ్మదాబాద్ నగరాలు కూడా ఈ సిరీస్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. మరోవైపు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే భారత్‌కు ప్రస్తుత క్రైస్ట్‌చర్చ్ టెస్టుతో పాటు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే ఐదు టెస్టుల్లోనూ విజయం సాధించడం కీలకంగా మారింది.
వేర్వేరు వేదికల్లో తొలి టెస్టులు ఆడిన ఆటగాళ్లు:
సంజయ్ మంజ్రేకర్ (భారత్) – 33
యశస్వి జైస్వాల్ (భారత్) – 33
సచిన్ టెండూల్కర్ (భారత్) – 32
జవగళ్ శ్రీనాథ్ (భారత్) – 24
దినేశ్ రామ్‌దిన్ (వెస్టిండీస్) – 24
తాజావార్తలు
-
Yashasvi Jaiswal History: యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు!
-
Vedant Sehwag: పెద్దోడు డేంజర్.. చిన్నోడు మహా డేంజర్.. 7 వికెట్లతో చెలరేగిన సెహ్వాగ్ చిన్న కుమారుడు..
-
Drought: కరువు భారతం.. తెలుగురాష్ట్రాల్లో మరింత ఘోరం!
-
DMK MLA: తమిళనాడులో మరో ఎమ్మెల్యేపై మహిళా అధికారిణి వేధింపుల ఆరోపణలు.. ఎఫ్ఐఆర్ నమోదు!
-
Mohammed Shami: పట్టించుకోవడం ఎప్పుడో మానేశా.. చేయాల్సింది చాలా ఉంది.. షమీ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Viral Video: ఏంటి స్వామి ఈ పని..? రైలులో ఏదైనా జరగరానిది జరిగితే ఎలా..
-
25 రోజుల బ్యాటరీ బ్యాకప్, 100+ స్పోర్ట్స్ మోడ్స్ తో Vivo WATCH GT 2 స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Sineth Jayawardena: కోచ్ మాటలతో టీమిండియాపై చెలరేగిపోయా.. శ్రీలంక సెంచరీ హీరో సంచలన వ్యాఖ్యలు!
-
BSNL సంచలనం.. రూ.51కే 56GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్..!
-
IND vs NZ 2nd Test: అరంగేట్రంలోనే వికెట్ తీసిన గుర్నూర్.. లాథమ్ హాఫ్ సెంచరీతో దూకుడుగా..!