Drought: కరువు భారతం.. తెలుగురాష్ట్రాల్లో మరింత ఘోరం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drought: ఒకప్పుడు వాన చినుకు పడితే చాలు.. నేల పరవశించేది. రైతు ముఖంలో ఆనందం కనిపించేది. పొలం నిండా పచ్చదనం పరుచుకునేది. కానీ ఇప్పుడు అదే నేల ఆకాశం వైపు దీనంగా చూస్తోంది. విత్తనం మొలకెత్తడానికి కావాల్సిన తడి లేదు. పంట నిలబడటానికి కావాల్సిన నీరు లేదు. పంట వేస్తే చేతికొస్తుందో లేదో తెలియని అనిశ్చితి. దేశంలో దాదాపు సగం భూభాగాన్ని కరువు పరిస్థితులు చుట్టుముడుతున్నాయి. ఆ ప్రభావం తెలుగు రాష్ట్రాల రైతులనూ తీవ్రంగా కలవరపెడుతోంది. ఐఐటీ గాంధీనగర్ అభివృద్ధి చేసిన ఇండియా డ్రాట్ మానిటర్ తాజా అంచనా ప్రకారం.. దేశ భౌగోళిక విస్తీర్ణంలో 47.2 శాతం ప్రాంతం పొడి వాతావరణం, వివిధ స్థాయిల కరువు పరిస్థితులను ఎదుర్కొంటోంది. అంతకుముందు వారంతో పోలిస్తే ఈ విస్తీర్ణం మరింత పెరిగింది. మరోవైపు ఐఐటీ బాంబే అంచనాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ ప్రాంతాల్లోనూ వ్యవసాయ కరువు పరిస్థితులు కొనసాగవచ్చని హెచ్చరిస్తున్నాయి.
తెలంగాణలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ముఖ్యంగా జోగులాంబ గద్వాల, నారాయణపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో నేలలో తేమ సాధారణ స్థాయుల కంటే గణనీయంగా పడిపోయింది. నవంబర్ మొదటి వారానికి సంబంధించిన ఐఐటీ బాంబే అంచనాల్లో రాష్ట్రంలోని 13 జిల్లాలు తీవ్రమైన వ్యవసాయ కరువు పరిస్థితుల్లో ఉన్నట్లు వెల్లడైంది. ఇటీవల అక్కడక్కడా వర్షాలు కురిసినా.. నెలల తరబడి పేరుకుపోయిన తేమ లోటును అవి భర్తీ చేయలేకపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ కరువు ప్రభావం రైతుల సాగు ప్రణాళికలను దెబ్బతీస్తోంది. 2026 ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం 21 జిల్లాల్లోని 388 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించింది.
Also Read
- Explainer: మనిషి అహంకారాన్ని కూల్చిన సిద్ధాంతం.. 167ఏళ్ల క్రితం విడుదలైన ఈ పుస్తకం ప్రపంచాన్ని ఎలా కుదిపేసింది?
- Iran: హిజాబ్ లేకుండా పాట..74 కొరడా దెబ్బల శిక్ష.. మహిళ గొంతుపై మతాధికారుల మానవ హక్కుల హననం!
- Explainer: మేనరికాలతో పిల్లలకు శాపం! దక్షిణాది మారేది ఎప్పుడు?
- Gold Loan Recovery: గోల్డ్ లోన్ తీసుకున్న వారికి షాక్.. గండం ముంచుకొస్తోంది!
మరోవైపు నెల్లూరు జిల్లాలో సోమశిల జలాశయం నీటిమట్టం రైతులకు కొత్త ఆందోళనను తీసుకొచ్చింది. ప్రస్తుతం అక్కడ 19.754 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉండగా.. సాధారణంగా వ్యవసాయ అవసరాలకు కనీసం 45 టీఎంసీలు అవసరమని అంచనా. దీంతో రబీ సీజన్లో వరి సాగు విస్తీర్ణం తగ్గే ప్రమాదం కనిపిస్తోంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు కూడా రైతులకు ఆశించిన స్థాయిలో అండగా నిలవలేదు. దేశవ్యాప్తంగా సాధారణం కంటే 13 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. తెలంగాణలో 17 శాతం, ఆంధ్రప్రదేశ్‌లోనూ పలు ప్రాంతాల్లో వర్షాల కొరత వ్యవసాయంపై ప్రభావం చూపింది. ముఖ్యంగా వర్షాధార ప్రాంతాల్లో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది.
దీని ప్రభావం ఇప్పుడు రబీ సాగుపై పడుతోంది. గత ఏడాదితో పోలిస్తే దేశంలో రబీ పంటల విత్తన విస్తీర్ణం 11.3 శాతం తగ్గింది. విత్తనం చేతిలో ఉన్నా.. పొలంలో తేమ లేకపోతే రైతు మాత్రం ఏం చేయగలడు? బోరు వేస్తే నీళ్లు పడతాయన్న నమ్మకం లేదు. చెరువులో నీరు ఉంటుందన్న భరోసా లేదు. అప్పు చేసి సాగు మొదలుపెట్టాలా? లేక ఈ ఏడాది పొలాన్ని ఖాళీగా వదిలేయాలా? అన్న ప్రశ్నలు రైతులను వెంటాడుతున్నాయి.
తాజావార్తలు
-
Drought: కరువు భారతం.. తెలుగురాష్ట్రాల్లో మరింత ఘోరం!
-
DMK MLA: తమిళనాడులో మరో ఎమ్మెల్యేపై మహిళా అధికారిణి వేధింపుల ఆరోపణలు.. ఎఫ్ఐఆర్ నమోదు!
-
Mohammed Shami: పట్టించుకోవడం ఎప్పుడో మానేశా.. చేయాల్సింది చాలా ఉంది.. షమీ కీలక వ్యాఖ్యలు!
-
Viral Video: ఏంటి స్వామి ఈ పని..? రైలులో ఏదైనా జరగరానిది జరిగితే ఎలా..
-
Fake Doctor Racket Busted: 11వ తరగతి చదివి డాక్టర్‌గా అవతారం.. నకిలీ MBBS డిగ్రీలతో ఢిల్లీలో వైద్యం!
ట్రెండింగ్
-
25 రోజుల బ్యాటరీ బ్యాకప్, 100+ స్పోర్ట్స్ మోడ్స్ తో Vivo WATCH GT 2 స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Sineth Jayawardena: కోచ్ మాటలతో టీమిండియాపై చెలరేగిపోయా.. శ్రీలంక సెంచరీ హీరో సంచలన వ్యాఖ్యలు!
-
BSNL సంచలనం.. రూ.51కే 56GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్..!
-
IND vs NZ 2nd Test: అరంగేట్రంలోనే వికెట్ తీసిన గుర్నూర్.. లాథమ్ హాఫ్ సెంచరీతో దూకుడుగా..!
-
Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..