BSNL సంచలనం.. రూ.51కే 56GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BSNL: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) వినియోగదారుల కోసం సరికొత్త చౌకైన రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం రూ.51 ధరతో లభించే ఈ ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకు 2GB డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు పొందవచ్చు. అయితే ఈ ప్లాన్ పాత వినియోగదారులకు అందుబాటులో ఉండదు. కొత్తగా BSNL కనెక్షన్ తీసుకునే వారు మాత్రమే ఈ ఫస్ట్ రీఛార్జ్ కూపన్ (FRC)ను ఉపయోగించుకోవచ్చు.
రూ.51 ప్లాన్ ప్రయోజనాలు
ఈ ప్లాన్ ద్వారా మొత్తం 56GB డేటా లభిస్తుంది. రోజుకు 2GB హైస్పీడ్ డేటా వినియోగించుకోవచ్చు. అలాగే 28 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSల ప్రయోజనాలు ఉంటాయి. అంటే రోజుకు సగటున కేవలం రూ.1.82 ఖర్చుతో ఈ సేవలను పొందవచ్చు. ఈ ఆఫర్ అన్ని టెలికాం సర్కిళ్లలో కొత్త వినియోగదారులకు అందుబాటులో ఉంది.
Also Read
- Hisense Smart TV: భారత్‌లోకి 55, 65 ఇంచెస్ కొత్త 4K MiniLED టీవీలు.. 120Hz మోడ్, Dolby Atmos ఫీచర్లు.. ధర ఎంతంటే?
- IBM: H-1B వీసాదారులకు IBM షాక్.. అమెరికా వదిలి వెళ్లండి లేదా ఉద్యోగం మానేయండి!
- కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
- Vivo X500 Series: వివో X500 సిరీస్ భారత్‌లో లాంచ్.. 200MP కెమెరా, 7800mAh బ్యాటరీ, ధర, ఫీచర్స్ ఇవే!
రూ.1కే ప్లాన్
BSNL కొత్త వినియోగదారుల కోసం రూ.1 ధరతో మరో ఫస్ట్ రీఛార్జ్ ప్లాన్‌ను కూడా అందిస్తోంది. ఈ ప్లాన్‌లో 24 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 1GB డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. మొత్తంగా 24GB డేటా పొందవచ్చు. రోజుకు సగటున దాదాపు 4 పైసల ఖర్చుతో ఈ ప్రయోజనాలు అందుతాయి.
రూ.107 ప్లాన్
ఇక BSNL అందిస్తున్న మరో ప్లాన్ రూ.107తో అందుబాటులో ఉంది. ఇందులో 20 రోజుల సర్వీస్ వ్యాలిడిటీతో పాటు 3GB డేటా, 200 నిమిషాల వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు లభిస్తాయి.
తక్కువ ధరలోనే రీఛార్జ్ ప్లాన్లను అందించడం ద్వారా ఎక్కువ మంది వినియోగదారులను తన 4G నెట్వర్క్ వైపు ఆకర్షించాలని BSNL లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా కొత్తగా BSNLకు మారాలనుకునే వారికి రూ.51, రూ.1 ఫస్ట్ రీఛార్జ్ ప్లాన్లు తక్కువ ఖర్చుతో సేవలను పరీక్షించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
తాజావార్తలు
-
BSNL సంచలనం.. రూ.51కే 56GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్..!
-
Tilak Varma: మాకు ఏదీ కలిసి రాలేదు.. ఆ ఇద్దరే మమ్మల్ని ముంచారు.. మనోళ్లు కూడా..!
-
Women’s Reservation Bill 2026: మహిళా రిజర్వేషన్ బిల్లుపై మోడీ సర్కార్ కీలక నిర్ణయం?.. నేడు కేంద్ర కేబినెట్ భేటీ
-
India A vs Sri Lanka A: చేతులెత్తేసిన బౌలర్లు.. భారత్ ఘోర పరాజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన శ్రీలంక
-
Sri Lanka Captain: వారి వల్లే విజయం సాధ్యమైంది.. శ్రీలంక కెప్టెన్ కీలక వ్యాఖ్యలు..!
ట్రెండింగ్
-
IND vs NZ 2nd Test: అరంగేట్రంలోనే వికెట్ తీసిన గుర్నూర్.. లాథమ్ హాఫ్ సెంచరీతో దూకుడుగా..!
-
Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?