Shubman Gill: గ్రీన్ బ్యాటింగ్‌తో కంగారు పడ్డా.. ఆ ఇద్దరినీ అడిగి మరీ బంతినిచ్చా!
- గుజరాత్ టైటాన్స్ ఖాతాలో మరో విజయం
- శుభ్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్
- కామెరాన్ గ్రీన్ బ్యాటింగ్‌తో కంగారు పడ్డా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ జట్టు ఐపీఎల్ 2026లో మరో విజయంను ఖాతాలో వేసుకుంది. శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌ను గుజరాత్ మట్టికరింపింది. గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ (86; 50 బంతుల్లో 8×4, 4×6) ఆడగా.. కాగిసో రబాడ (3/29), మహమ్మద్ సిరాజ్ (2/23) అద్భుతమైన స్పెల్‌తో గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ అనంతరం గిల్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న గిల్.. తన ఆట కంటే జట్టు గెలుపే ముఖ్యమని స్పష్టం చేశాడు. ఫైనల్ ఆడి కప్ గెలవడం తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నాడు. కామెరాన్ గ్రీన్ (79; 55 బంతుల్లో 7×4, 4×6) బ్యాటింగ్‌తో కంగారు పడ్డానని గిల్ చెప్పుకొచ్చాడు.
‘నిజం చెప్పాలంటే నేను 2023లా బ్యాటింగ్ చేస్తున్నానా లేదా అనేది అంత ముఖ్యం కాదు. జట్టు గెలుపు నాకు ముఖ్యం. ఈసారి ఫైనల్ ఆడి కప్ గెలవడమే నా టార్గెట్. మేము ఇంకో ఓవర్ లేదా రెండు ఓవర్ల ముందుగానే మ్యాచ్ ముగించాలని అనుకున్నాం. నేను ఔటైన విధానంతో కాస్త నిరాశ చెందాను. చివరి వరకు ఉండి మ్యాచ్‌ను ఫినిష్ చేయాలనుకున్నాను. వచ్చే మ్యాచులలో తప్పక చివరి వరకు క్రీజులో ఉంటా. సిరాజ్, రబడాలు బాగా బౌలింగ్ చేశారు. వాళ్లు బౌలింగ్ చేస్తున్న తీరు చూస్తే ప్రతి బంతికి వికెట్ వచ్చేలా అనిపించింది. చివర్లో కూడా వారికి ఇంకో ఓవర్ ఇవ్వాలని అనిపించింది. బంతి కొంచెం స్వింగ్ అవుతూ ఉంది. కాబట్టి ఇంకా ఒక ఓవర్ బౌలింగ్ చేయగలరా? అని అడిగాను. ఇద్దరితో వరుసగా మూడు ఓవర్లు వేయించా. ఈ వేడిలో వరుసగా మూడు ఓవర్లు వేయడం అంత సులభం కాదు. అని గిల్ చెప్పాడు.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read: KKR Unwanted Record: కేకేఆర్ ఖాతాలో చెత్త రికార్డు.. కోల్‌కతా చరిత్రలోనే..!
గ్రీన్ బ్యాటింగ్‌తో కంగారు పడ్డా. మధ్య ఓవర్లలో కోల్‌కతా మ్యాచ్‌ను మా చేతుల నుంచి లాక్కుంది. అయినప్పటికీ వికెట్లు తీసే ప్రయత్నం చేశాం. కేకేఆర్ బ్యాటింగ్ లైన్అప్ చాలా లోతుగా ఉంది. సునీల్ కూడా నంబర్ 9లో వచ్చాడు. ప్రతి బంతిని బౌండరీకి పంపాలని చూస్తారని మాకు తెలుసు. అందుకే అటాకింగ్ ఆప్షన్‌తో వికెట్లు తీసే దిశగా ఆలోచించాము. ఫలితం దక్కింది. నా బ్యాటింగ్ పట్ల సంతోషంగా ఉన్నా. ఈ సీజన్‌కు ముందు కొన్ని నెలల సమయం దొరికింది. ఆ సమయంలో ఫిట్‌నెస్‌పై ఎక్కువగా పని చేశాను. అలాగే మానసికంగా కూడా మెరుగుపడేందుకు ప్రయత్నించాను. టెక్నికల్‌గా మాత్రమే కాకుండా టాక్టికల్‌గా కూడా నా ఆటను అభివృద్ధి చేసుకోవాలని చూశాను. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా.. ప్రస్తుత క్షణంలో ఉండటం చాలా ముఖ్యం. ఓటముల నుంచి నేర్చుకోవాలి కానీ అందులోనే ఉండిపోకూడదు’ అని గిల్ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్‌లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
-
Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఫైర్
-
School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!