Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Small Kitchen Ideas: మనలో చాలామంది ఇళ్లను ఎంతో మోడ్రన్‌గా, స్టైలిష్‌గా డిజైన్ చేసుకుంటున్నారు. కొన్నిసార్లు ఓపెన్ కిచెన్లను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే, మన ఇళ్లలో కిచెన్ ఎంత అందంగా ఉన్నప్పటికీ.. సింక్ దగ్గర గిన్నెలు ఆరబెట్టుకోవడానికి లేదా పెట్టుకోవడానికి సరైన స్థలం లేకపోతే మాత్రం ప్రతిరోజూ ఇబ్బంది తప్పదు. గిన్నెలు కడిగిన తర్వాత వాటిని తుడుచుకోవడానికి కౌంటర్‌పై స్థలం వెతకాలి. ఆ తర్వాత వాటిని భద్రపర్చడానికి మరో చోటుకి వెళ్లాల్సి వస్తుంది. కిచెన్‌లో ఎక్కువగా జరిగే పనే గిన్నెలు కడగడం. ఒకవేళ వాటిని ఆరబెట్టడానికి సరైన ఏర్పాట్లు లేకపోతే, గిన్నెల నుంచి కారే నీటిని పదే పదే శుభ్రం చేయాల్సి వస్తుంది. దీనివల్ల కిచెన్ ఎప్పుడూ చిందరవందరగా, తడిగా కనిపిస్తుంది. అందుకే, కిచెన్ డిజైన్ చేసుకునేటప్పుడు కేవలం సింక్ ఏర్పాటు చేయడంతో సరిపోదు. గిన్నెలు కడగడం నుంచి, వాటిని ఆరబెట్టడం, మళ్లీ సర్దే వరకు పూర్తి ప్లానింగ్ ముందే ఉండాలి.
ఇల్లు కట్టేటప్పుడు లేదా రెనోవేట్ చేసేటప్పుడు చాలామంది సింక్ చుట్టూ కేవలం వాషింగ్ ఏరియా మాత్రమే ఉండేలా చూస్తారు గానీ, కడిగిన గిన్నెలను ఎక్కడ పెట్టాలనే దానిపై పెద్దగా దృష్టి పెట్టరు. అందుకే రోజూ గిన్నెలు కడిగాక కౌంటర్ నిండా నీరు నిలబడిపోతుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి సింక్‌ను ఆనుకుని ఒక చిన్న డ్రైయింగ్ జోన్ ఉండటం చాలా అవసరం. స్థలం తక్కువగా ఉన్న చిన్న కిచెన్లలో సింక్‌కు సరిగ్గా పక్కనే ఒక చిన్న డ్రైయింగ్ రాక్ అమర్చుకోవచ్చు. ఇందులో రోజూ వాడే ప్లేట్లు, గిన్నెలు, గ్లాసులు సులభంగా సర్దుకోవచ్చు. దీనివల్ల గిన్నెలు కడిగాక వాటిని దూరంగా ఎక్కడికీ తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. అలాగే కిచెన్ కౌంటర్ కూడా శుభ్రంగా ఉంటుంది.
Also Read
- How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
- How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
- Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
- Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
చిన్న కిచెన్లలో కౌంటర్ దగ్గర స్పేస్ తక్కువగా ఉంటుంది. అలాంటి వారు పై క్యాబినెట్ లోపల డిష్ రాక్, డ్రిప్ ట్రే ఏర్పాటు చేసుకోవడం మంచిది. గిన్నెలు కడిగిన వెంటనే నేరుగా ఆ రాక్‌లో పెట్టేయవచ్చు. అప్పుడు కింద ఉన్న ట్రే నీటిని పూర్తిగా పీల్చుకుంటుంది. దీనివల్ల కౌంటర్‌పై నీరు కారే సమస్య పూర్తిగా తప్పుతుంది. ప్రతిసారీ ప్లేట్లు, గిన్నెలు లేదా స్పూన్లు కావాలంటే కిచెన్ మరో మూలకు వెళ్లడం, వాడాక తిరిగి తీసుకెళ్లడం వల్ల అనవసరమైన తిప్పలు తప్పవు. అందుకే రోజూవారీగా వాడే గిన్నెలను సింక్ చుట్టూ ఉండేలా స్టోరేజ్ ప్లాన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వాష్ చేశాక వాటిని ఆరబెట్టి, వెంటనే స్టోర్ చేయడం చాలా సులభమవుతుంది. గిన్నెలు కడిగాక వాటిని ఆరబెట్టే స్థలం సింక్‌కు చాలా దూరంగా ఉంటే, కౌంటర్ అంతా నీరు కారిపోతుంది. మన దగ్గర ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, పెద్ద ఇళ్లలో రోజూ గిన్నెలు కూడా ఎక్కువే కడగాల్సి వస్తుంది. అందుకే ఈ చిన్న ప్లానింగ్ మీ రోజూవారీ పని భారాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. సింక్ పక్కనే డ్రైయింగ్ ఏరియా ఉంటే తడి గిన్నెలను ఎక్కువ దూరం మోసుకెళ్లాల్సిన శ్రమ ఉండదు.
కిచెన్ డిజైన్ చూడటానికి బాగుండటమే కాకుండా, రోజువారీ పనులు ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగేలా ఉండాలి. అందుకే సింక్ చుట్టూ స్థలాన్ని ఎంచుకునే ముందే.. గిన్నెలు ఎక్కడ కడగాలి, ఎక్కడ ఆరబెట్టాలి, ఆరిన తర్వాత ఎక్కడ సర్దాలి అనే విషయాలపై స్పష్టత ఉండాలి. ఈ మూడు పనులు కిచెన్‌లో సరిగ్గా అమరిపోతే వంటగది ఎప్పుడూ గందరగోళంగా మారకుండా చాలా నీట్‌గా కనిపిస్తుంది. కాబట్టి, నెక్స్ట్ టైమ్ మీ కిచెన్ కట్టుకునేటప్పుడు లేదా మార్పులు చేసేటప్పుడు కేవలం సింక్ గురించే కాకుండా.. డ్రైయింగ్ స్పేస్, డిష్ రాక్, రోజూ వాడే గిన్నెల స్టోరేజ్ గురించి ముందే ఆలోచించి ప్లాన్ చేసుకోండి.
తాజావార్తలు
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం జాడేది?
-
Sai Durgha Tej: పవన్ కల్యాణ్‌తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Jasprit Bumrah: వన్డేలకు దూరంగా జస్పీత్ బుమ్రా.. టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇదే..
-
Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
ట్రెండింగ్
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!