MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni CSK Stake: మిస్టర్ కూల్, టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పినా.. ఐపీఎల్లో కొనసాగుతున్నారు.. అయితే, ఐపీఎల్ 2026లో ఒక్క మ్యాచ్ కూడా ఆడింది లేదు.. అయితే, ధోనీ అంటే చెన్నై సూపర్ కింగ్స్.. CSK అంటే ఎంఎస్ ధోనీ.. అన్నట్టుగా.. ధోనీ ఫ్యాన్స్ మొత్తం.. సీఎస్కే ఫ్యాన్సే అనేదాంట్లో అతిశయోక్తి మాత్రం ఏ మాత్రం లేదు.. ధోనీ వల్లే.. ఆ జట్టుకు అంత ఫేమ్ వచ్చింది.. అయితే, ఎంఎస్ ధోనీ.. CSK జట్టులో 25 శాతం వాటా కోరారని, ఆ తర్వాత దాన్ని 20 శాతానికి తగ్గించారని ఇటీవల ఓ వార్త ప్రచారం జరిగింది. అనంతరం ధోనీకి ఫ్రాంచైజీ 5.5 శాతం వాటా ఆఫర్ చేసిందనే ప్రచారం కూడా సాగింది. తాజాగా ఈ వ్యవహారంపై సీఎస్కే స్పందిస్తూ.. క్లారిటీ ఇచ్చింది..
ధోనీ వాటాపై మౌనం వీడిన సీఎస్కే..
సీఎస్కేకు చెందిన ఓ సీనియర్ అధికారి ఈ వార్తలను ఖండించారు. ధోనీ ఎప్పుడూ వాటా గురించి తమను సంప్రదించలేదని, ఈ అంశంపై ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్‌తో ధోనీ ఈ విషయంపై మాట్లాడినట్లు కూడా తమకు సమాచారం లేదని పేర్కొన్నారు. ధోనీ ప్రస్తుతం కూడా సీఎస్కేతో కొనసాగుతున్నారు. కెప్టెన్‌గా జట్టును ఐదు ఐపీఎల్ టైటిళ్లకు నడిపించిన ఆయన.. ఫ్రాంచైజీతో ప్రత్యేక అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
సీఎస్కేలో ధోనీకి ఇప్పటికే షేర్లు..?
ధోనీకి సీఎస్కే ఫ్రాంచైజీలో కొన్ని షేర్లు ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. సీఎస్కే స్టాక్ మార్కెట్లో లిస్టైన సంస్థ కాకపోవడంతో, దాని షేర్లను ప్రైవేట్‌గా ఆఫ్-మార్కెట్ లావాదేవీల ద్వారా కొనుగోలు చేసే అవకాశం ఉందని సమాచారం. ధోనీ వద్ద లక్షకు పైగా షేర్లు ఉన్నట్లు కూడా ఆ నివేదికలో పేర్కొన్నారు. అయితే ఫ్రాంచైజీలో 30 కోట్లకు పైగా షేర్లు ప్రజల వద్ద ఉండగా, అవి మొత్తం షేర్ క్యాపిటల్‌లో దాదాపు 40 శాతంగా ఉన్నట్లు సమాచారం. ఎన్. శ్రీనివాసన్ కుటుంబం 55 శాతానికి పైగా వాటాతో నియంత్రణ హక్కులు కలిగి ఉంది.
ధోనీ వాటా విలువ ఎంత?
ప్రస్తుత ఐపీఎల్ ఫ్రాంచైజీల మార్కెట్ విలువ ఆధారంగా ధోనీకి ఉన్న వాటా విలువ సుమారు రూ.2.6 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ఉండొచ్చని అంచనాలు వెలువడ్డాయి. ధోనీ మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.1,200 కోట్లుగా ఉంటుందని అంచనా.
ధోనీ 25 శాతం వాటా అడిగారన్న ప్రచారంపై ఆకాష్ చోప్రా
మాజీ భారత క్రికెటర్ ఆకాష్ చోప్రా కూడా ధోనీ 25 శాతం వాటా కోరారన్న ప్రచారంపై సందేహాలు వ్యక్తం చేశారు. ఈ కథనం వాస్తవంగా కనిపించడం లేదని, బహుశా ప్రచారం కోసం సృష్టించిన కథనం కావచ్చని వ్యాఖ్యానించారు. ఆర్సీబీ ఇటీవల సుమారు 1.7 నుంచి 1.8 బిలియన్ డాలర్ల విలువకు విక్రయించబడిన విషయాన్ని ప్రస్తావించిన చోప్రా.. ఐదు ఐపీఎల్ టైటిళ్లు, భారీ బ్రాండ్ విలువ, అంతర్జాతీయ స్థాయిలో ఫ్రాంచైజీలను కలిగి ఉన్న సీఎస్కే విలువ కూడా భారీగా ఉంటుందని అన్నారు. అలాంటి ఫ్రాంచైజీలో 25 శాతం వాటా అంటే వందల మిలియన్ డాలర్ల విలువ ఉంటుందని, అంత పెద్ద వాటాను ఎవరైనా ఉచితంగా ఇవ్వడం అసాధ్యమని చోప్రా అభిప్రాయపడ్డారు. సీఎస్కే వంటి ఐపీఎల్ జట్టులో 25 శాతం వాటా పొందాలంటే అంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
ODI Double Centuries: వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదిన భారత బ్యాటర్లు వీరే.. రోహిత్, గిల్ మాత్రం ఎంతో ప్రత్యేకం!
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం.. విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు
-
Ayushmann Khurrana : మళ్లీ గాడి తప్పుతోన్న ఆయుష్మాన్ ఖురానా సక్సెస్
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
ట్రెండింగ్
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?