KKR Unwanted Record: కేకేఆర్ ఖాతాలో చెత్త రికార్డు.. కోల్‌కతా చరిత్రలోనే..!
- విజయం లేని ఏకైక జట్టు కోల్‌కతానే
- ఐపీఎల్ 2026లో కోల్‌కతాకు వరుస ఓటములు
- కేకేఆర్ ఖాతాలో చెత్త రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు నిరీక్షణ ఇంకా తప్పడం లేదు. లీగ్ దశలో దాదాపుగా సగం మ్యాచ్‌లు పూర్తికావొచ్చినా.. ఇప్పటివరకు గెలుపు రుచి చూడలేదు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడినా.. విజయం లేని ఏకైక జట్టు కోల్‌కతానే కావడం గమనార్హం. కేకేఆర్ జట్టుకు ఐపీఎల్ 2026లో వరుస ఓటములు పెద్ద సమస్యగా మారాయి. ఈ నేథ్యంలోనే అత్యంత చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్‌లో కోల్‌కతా సుదీర్ఘ ఓటమి పరంపరను మరోసారి కొనసాగిస్తోంది.
ప్రస్తుత సీజన్ (2025-26)లో కేకేఆర్ ఇప్పటికే వరుసగా 7 మ్యాచ్‌లు ఓడిపోయి.. కోల్‌కతా చరిత్రలో రెండో అతిపెద్ద లూజింగ్ స్ట్రీక్‌ను నమోదు చేసింది. గతంలో 2009 సీజన్‌లో కేకేఆర్ 9 వరుస ఓటములతో అత్యంత చెత్త రికార్డును సొంతం చేసుకుంది. 2019లో 6 మ్యాచ్‌లు, 2022లో 5 మ్యాచ్‌లు వరుసగా ఓడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుత ఫామ్‌ను పరిశీలిస్తే.. జట్టు ప్రదర్శన అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. కీలక సమయంలో మ్యాచ్‌లను గెలవలేకపోవడం, బ్యాటింగ్-బౌలింగ్ విభాగాల్లో నిలకడ లేకపోవడం ఈ పరిస్థితికి కారణం.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
మరోవైపు గుజరాత్ టైటాన్స్ (జీటీ)తో జరిగిన హెడ్-టు-హెడ్ రికార్డులో కూడా కేకేఆర్ పూర్తిగా వెనుకబడి ఉంది. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లలో గుజరాత్ 4 మ్యాచ్‌లు గెలిచి ఆధిపత్యం చాటింది. ఇది కేకేఆర్‌కు మరో ప్రతికూల అంశంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో కేకేఆర్ త్వరగా గాడిన పడాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ లూజింగ్ స్ట్రీక్ మరింత పెరిగే ప్రమాదం ఉంది. అంతేకాదు లీగ్ దశ నుంచి ఇంటిదారి కూడా పట్టనుంది. కోల్‌కతా ఇప్పటికైనా గెలుపు బాట పడుతుందా? లేదా ఓటముల పరంపరను కొనసాగిస్తుందా అన్నది చూడాలి.
తాజావార్తలు
-
Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
-
Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
-
UP Election 2027: ‘‘5 తరాల వరకు ప్రధాని కాలేరు’’.. గాంధీ కుటుంబంపై ఎస్పీ నేత సెటైర్లు..
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!