How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
How To Grow Moringa: ఇంట్లోనే ఆరోగ్యాన్ని పంచే మునగ చెట్టును పెంచడం ఇప్పుడు చాలా సులువు. కేవలం పూల కుండీలకే పరిమితం కాకుండా, మీ వంటింటికి ఉపయోగపడేలా ఏదైనా మొక్కను పెంచాలని ఆలోచిస్తుంటే మునుగ (డ్రమ్స్టిక్) సరైన ఎంపిక. దీని ఆకుల నుంచి కాయల వరకు అన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పెద్దగా స్థలం లేకపోయినా, అపార్ట్మెంట్ల బాల్కనీలో లేదా మేడ మీద ఈ మొక్కను సులభంగా పెంచుకోవచ్చు. అయితే, మొక్క బాగా పెరిగి గుత్తులుగా కాయలు కాయాలంటే మాత్రం సరైన కుండీ, మట్టి, ఎండ, తగిన జాగ్రత్తలు చాలా ముఖ్యం.
మొదటగా మునుగ మొక్క నాటడానికి తగిన కుండీని ఎంచుకోవడం చాలా ముఖ్యం. దీని వేర్లు బాగా విస్తరించడానికి కనీసం 12 అంగుళాల లోతు ఉండే పెద్ద కుండీని తీసుకోవాలి. కుండీ కింద నీరు బయటకు పోవడానికి రంధ్రం ఉండేలా చూసుకోవాలి, లేదంటే నీరు నిలిచి వేర్లు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఈ మొక్క ఆరోగ్యంగా ఎదగడానికి సూర్యరశ్మి చాలా అవసరం. రోజుకు కనీసం 6 నుంచి 8 గంటల పాటు నేరుగా ఎండ తగిలే ప్రదేశంలో అంటే ఎండ బాగా వచ్చే బాల్కనీ లేదా మేడ మీద ఈ కుండీని ఉంచాలి. ఒకవేళ సరిపడా ఎండ రాకపోతే గ్రో లైట్ల సాయం తీసుకోవచ్చు. మట్టిని ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధారణ మట్టిలో కొద్దిగా ఇసుక లేదా పెర్లైట్ కలిపితే నీరు నిలవకుండా సులభంగా బయటకు వెళ్తుంది. మట్టి పీహెచ్ విలువ 6 నుంచి 7 మధ్య ఉండేలా చూసుకోవాలి. పై మట్టి ఎండిపోయిన తర్వాత మాత్రమే నీరు పోయాలి, అతిగా నీరు పొయ్యడం మొక్కకు మంచిది కాదు. మొక్క ఏపుగా, గుబురుగా పెరిగేందుకు అప్పుడప్పుడు కత్తిరింపులు చేయడం అవసరం. బలహీనంగా లేదా అనవసరంగా పొడవుగా పెరిగిన కొమ్మలను ఎప్పటికప్పుడు కట్ చేస్తుంటే కొత్త చిగుర్లు వేగంగా వస్తాయి. కత్తిరించేటప్పుడు శుభ్రమైన పరికరాలను మాత్రమే వాడాలి.
Also Read
- How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
- Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
- Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
అలాగే మొక్కను కీటకాల బారి నుంచి రక్షించడం కూడా ముఖ్యం. ఆకులపై చిన్న పురుగులు లేదా పేనుబాధ కనిపిస్తే వాటిని తొలగించి, అవసరమైతే సేంద్రీయ క్రిమిసంహారక మందులను వాడాలి. మొక్క ఎదుగుదల కోసం ప్రతి నాలుగు వారాలకు ఒకసారి తగిన పాళ్లలో సహజమైన ఎరువులను అందించాలి. సూచనలు పాటించకుండా మోతాదుకు మించి ఎరువులు వేస్తే మొక్క దెబ్బతినే అవకాశం ఉంది. ఇలా ఇంట్లోనే మునుగ చెట్టును పెంచడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. దీని ఆకులు, కాయలు రెండూ వంటకాల్లో వాడటానికి ఎంతో ఉపయోగపడతాయి. మునుగ ఆకులు పోషకాల ఖజానం కాగా, కాయలతో రుచికరమైన కూరలు తయారు చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
Yuvraj Singh: ఇప్పుడు కాదు.. 25 ఏళ్లుగా అయనకు అసిస్టెంట్నే!
-
Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
-
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!