న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ విజయంలో తన వంతు సహకారం అందించడం చాలా సంతోషంగా ఉందని టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చెప్పాడు. లక్ష్య ఛేదనలో పరుగులు చేయడమే కాదు, మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆడటమే అత్యంత ముఖ్యమని అన్నాడు. గతం గురించి ఆలోచించకుండా, భవిష్యత్తు టెన్షన్‌కు పోకుండా.. ప్రస్తుతంపై పూర్తిగా దృష్టి పెడుతా అని గిల్ తెలిపాడు. ప్రస్తుతం గురించి ఆలోచించినపుడే విజయాల ఆనందాన్ని, అపజయాల నిరాశను సమతూకంగా ఎదుర్కొనగలమని గిల్ తెలిపాడు.…
శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం భారత జట్టుకు టెస్ట్, వన్డే ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉన్నాడు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అక్టోబర్ 4న గిల్‌ను వన్డే కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే రోహిత్‌ను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించడంపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. హిట్‌మ్యాన్ ఫాన్స్ అయితే బీసీసీఐపై మండిపడ్డారు. తాజాగా రోహిత్ తన వన్డే కెప్టెన్సీ వేటుపై స్పందించాడు. ఇక వెస్టిండీస్‌తో రెండో టెస్ట్ నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు…