IPL 2026-BCCI: ఐపీఎల్‌లో సంచలనం.. క్రికెటర్ గర్ల్‌ఫ్రెండ్‌పై అనుమానాలు.. సమాచార లీక్‌పై బీసీసీఐ సీరియస్!
- ఐపీఎల్ 2026 సీజన్‌లో వెలుగులోకి సంచలన విషయం
- క్రికెటర్ గర్ల్‌ఫ్రెండ్‌పై అనుమానాలు
- సమాచార లీక్‌పై బీసీసీఐ సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026Cricketer’s Girlfriend Allegedly Leaks Team Information: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఓ ఐపీఎల్ క్రికెటర్ గర్ల్‌ఫ్రెండ్ జట్టుకు సంబంధించిన కీలక సమాచారాన్ని బయటి వ్యక్తులకు చేరవేస్తూ.. రెండుసార్లు పట్టుబడినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ షాకింగ్ ఘటనతో అప్రమత్తమైన ఫ్రాంచైజీ యజమాని వెంటనే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని సంప్రదించినట్లు సమాచారం. ఆ తర్వాతే ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ కఠిన మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హనీట్రాప్ ఉచ్చులో పడకుండా ఆటగాళ్లను అప్రమత్తం చేస్తూ ప్రత్యేక అడ్వైజరీ విడుదల చేసింది.
బీసీసీఐ అమలు చేసిన కొత్త నిబంధనల ప్రకారం.. ఐపీఎల్‌లో పాల్గొనే ఆటగాళ్లు అనుమతి లేకుండా ఎక్కడికీ వెళ్లకూడదు. అలాగే జట్టు బస చేసే హోటల్‌లోనే ఉండాల్సి ఉంటుంది. బీసీసీఐ ఈ నిర్ణయానికి కారణం కొన్ని జట్లలోని అవకతవకలేనని నివేదికలు పేర్కొంటున్నాయి. కొందరు ప్లేయర్స్, జట్టు అధికారులు అనధికార వ్యక్తులతో నాన్-డిజిగ్నేటెడ్ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ గుర్థించినట్లు తేలింది. ఇది లీగ్ సమగ్రతకు ముప్పుగా మారే అవకాశం ఉందని బోర్డు భావిస్తోంది. ముఖ్యంగా ఓ క్రికెటర్ గర్ల్‌ఫ్రెండ్ జట్టు వ్యూహాలకు సంబంధించిన సమాచారం బయటకు చేరవేసిన ఘటన ఫ్రాంచైజీ యాజమాన్యాన్ని కలవరపరిచిందని సమాచారం.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఐపీఎల్ 2026లో కొన్ని ఫ్రాంచైజీలు, ఆటగాళ్ల ప్రవర్తనలో అసాధారణ పరిస్థితులు గమనించాం. జట్టు సభ్యులతో పాటు అనధికార వ్యక్తులు తిరుగుతున్నారు. కొందరు హోటళ్లకు, ఆటగాళ్ల గదులకు కూడా వస్తున్నారు. ఇది పూర్తిగా యాంటీ కరప్షన్ నిబంధనలకు విరుద్ధం’ అని తెలిపారు. అంతేకాకుండా కొన్ని జట్టు యజమానులు, అధికారులు కూడా అనుమతి లేని ప్రాంతాల్లో ఆటగాళ్లతో కలుస్తున్నారని బీసీసీఐ గుర్తించినట్లు చెప్పారు. ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నామని, ఇకపై నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తామని హెచ్చరించారు.
ఎవరైనా సరే నిబంధనలు ఉల్లంఘిస్తే.. బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలి కఠిన చర్యలు తీసుకుంటుంది అని దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన ఆటగాడు లేదా సిబ్బందిపై షోకాజ్ నోటీసులు, భారీ జరిమానాలు, సస్పెన్షన్ లేదా డిస్‌క్వాలిఫికేషన్ వంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిషేధిత పదార్థాల వినియోగం, భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తే.. చట్టపరంగా పోలీసు కేసులు కూడా నమోదయ్యే అవకాశముందని దేవజిత్ సైకియా హెచ్చరించారు. క్రికెటర్ గర్ల్‌ఫ్రెండ్‌పై అనుమానాల నేపథ్యంలో ఐపీఎల్ 2026 సీజన్‌లో భద్రత, గోప్యత, యాంటీ కరప్షన్ నిబంధనల అమలుపై బీసీసీఐ మరింత కఠినంగా వ్యవహరించనుందనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తాజావార్తలు
-
Rajesh Sharma : ఫౌజీ షూటింగ్లో రాజేష్ శర్మకు విషపురుగు కాటు?.. అసలు నిజం బయటపెట్టిన పీఏ!
-
Viral Video: ‘గ్రౌండ్లో పరుగెత్తలేను.. నేను ముసలివాడిని అయిపోయాను’: ఎంఎస్ ధోనీ
-
Jofra Archer: “ఇది ఐపీఎల్ కాదు”.. టీమిండియా ఘోర పతనంపై జోఫ్రా ఆర్చర్ సంచలన వ్యాఖ్యలు!
-
Fake Condoms: “కండోమ్”లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..
-
Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్‌తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్‌లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్‌బడ్స్ లాంచ్..