NTR30: ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ఎన్టీఆర్ 30. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రేపు.. అనగా మే 19 న ఎన్టీఆర్ పుట్టినరోజు అన్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా ఎన్టీఆర్ 30 నుంచి ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక బర్త్ డే వచ్చేహ్వరకు రోజుకో పోస్టర్ తో అభిమానులకు సర్ ప్రైజ్ పోస్టర్స్ తో పిచ్చెక్కిస్తున్నారు మేకర్స్. ముఖ్యంగా పోస్టర్ లు ఏమో కానీ వాటికి పెట్టె క్యాప్షన్స్ అయితే.. అభిమానులు హైప్ తోనే చచ్చిపోయేలా ఉన్నారు.
Sriram Adithya: రేపు పెళ్లి పెట్టుకొని.. పవన్ సినిమాకు వెళ్ళా…
నిన్నటికి నిన్న.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ.. ” సముద్రం నిండా అతని కథలే.. రక్తంతో రాసినవి” అనే క్యాప్షన్ తో సముద్రపు ఒడ్డున రక్తంతో తడిచిన కత్తులను చూపించారు. ఇక ఇప్పుడు.. ఆ కత్తులతో.. సముద్ర వీరుడు విలన్ల గుండెలను చీల్చి చెండాడిన శవాల మధ్య వారి రక్తంతో తడిచిన కత్తిని చూపించారు. అంతే కాకుండా దానికి తగ్గ క్యాప్షన్ కూడా పెట్టుకొచ్చారు. ” అతని కంటే భయపెట్టే ఏకైక విషయం అతని కథ” అంటూ రాసుకొచ్చారు. పోస్టర్స్, క్యాప్షన్స్ తోనే అభిమానులను భయపెడుతున్నారు. అసలు ఎన్టీఆర్ ను కొరటాల ఏ రేంజ్ లో చూపించబోతున్నాడు అనేది ఇది చిన్న శాంపిల్ మాత్రమే అని చెప్పొచ్చు.. ఇక ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ రేపు రాత్రి 7 గంటలకు రిలీజ్ కానుంది. మరి ఆ సముద్ర వీరుడు ఎలా ఉండబోతున్నాడో చూడాలంటే రేపటివరకు ఆగాల్సిందే.