Dutee Chand: భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీచంద్ డోపింగ్ టెస్టులో దొరికిపోయింది. ఆమెకు నిర్వహించిన శాంపిల్-ఎ టెస్టు పాజిటివ్‌గా రావడంతో వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ తాత్కాలికంగా నిషేధం విధించింది. అండరైన్, ఓస్టారిన్, లిగాండ్రోల్ వంటి స్టెరాయిడ్లను ద్యుతీ తీసుకున్నట్లు స్పష్టమైంది. దీంతో క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ సూచించింది. అయితే ఈ విషయంపై ద్యుతీ చంద్ స్పందించింది. డోపింగ్ పరీక్షలో పాజిటివ్‌గా తేలినట్లు తనకు తెలియదని వెల్లడించింది.
Read Also: Vijay Zol: అండర్-19 టీమిండియా మాజీ కెప్టెన్ అరెస్ట్
కాగా గత ఏడాది సెప్టెంబర్-అక్టోబర్‌లో జరిగిన జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న ద్యుతి చంద్ 200 మీటర్ల ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. ఇక 100 మీటర్ల ఫైనల్స్‌లో ఆరో స్థానంలో సరిపెట్టుకుంది. అంతకు ముందు 2018లో జరిగిన ఆసియా గేమ్స్‌లో 100, 200 మీటర్ల విభాగాల్లో రజత పతకాలు సొంతం చేసుకుంది. 2013, 2017, 2019 ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకాలు సాధించింది. 2019లో యునివర్సైడ్ ఛాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల విభాగంలో స్వర్ణం సాధించిన తొలి మహిళా స్ప్రింటర్‌గా ద్యుతీ చంద్ రికార్డులకెక్కింది.