వన్ నేషన్-వన్ ఎలక్షన్‌కు బీఎస్పీ అధినేత మాయావతి జై కొట్టారు. మోడీ 3.0 సర్కార్ హయాంలోనే జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. ఇప్పటికే కేంద్రమంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. జమిలి ఎన్నికలు నిర్వహించి తీరుతామని ప్రకటించారు. ఇక బుధవారం కేంద్ర కేబినెట్ కూడా ఆమోదముద్ర వేసింది. శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్ ఉభయసభల్లో బిల్లు తీసుకురానున్నారు.
రెండేళ్లకు ముందు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మరి ఇప్పుడు కొత్త వేరియంట్ లతో భయపెడుతుంది. పలు రకాల వేరియంట్లతో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. మొదటగా కేరళలలో మొదలైన కొత్త వేరియంట్ జేఎన్ 1.. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు వ్యాపిస్తుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయ్యాయి. తప్పనిసరిగా కొవిడ్ ఆంక్షలు పాటించాలని ప్రభుత్వాలు పేర్కొంటున్నాయి. కొత్త వేరియంట్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తు్న్నాయి.
దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. కేద్రం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కరోనా బారిన పడ్డారు. స్వల్ప అస్వస్థత కారణంగా పరీక్షలు చేయగా.. రాజ్ నాథ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు.
Dutee Chand: భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీచంద్ డోపింగ్ టెస్టులో దొరికిపోయింది. ఆమెకు నిర్వహించిన శాంపిల్-ఎ టెస్టు పాజిటివ్‌గా రావడంతో వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ తాత్కాలికంగా నిషేధం విధించింది. అండరైన్, ఓస్టారిన్, లిగాండ్రోల్ వంటి స్టెరాయిడ్లను ద్యుతీ తీసుకున్నట్లు స్పష్టమైంది. దీంతో క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ సూచించింది. అయితే ఈ విషయంపై ద్యుతీ చంద్ స్పందించింది. డోపింగ్ పరీక్షలో పాజిటివ్‌గా తేలినట్లు తనకు తెలియదని వెల్లడించింది. Read Also: Vijay…
కరోనా తగ్గుముఖం పడుతోందని ఊపిరి పీల్చుకుంటున్న నగరవాసులకు మళ్లీ కరోనా కలవరపెడుతోంది. భారీ వానలకు మళ్లీ కరోనా కోరలుచాస్తోంది. రోజురోజుకు కొవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మొన్నటి దాకా వందలో ఉన్న కేసులు తాజాగా 700 దాటాయి. భాగ్యనగరంలోని నార్కట్‌పల్లి గురుకుల కళాశాలలో కరోనా కలకలం రేపింది. నల్గొండ జిల్లాలోని విద్యార్థులపై కరోనా పంజా విసురుతోంది. కాగా.. నార్కట్‌పల్లిలోని గురుకుల కళాశాలలో 15 మంది విద్యార్థులకు పాజిటివ్ నిర్ధారణ కావడంతో.. విద్యార్థి తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మరి…
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. కరోనా నుంచి బయటపడేందుకు టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇక, విమానాల్లో ప్రయాణం చేయాలంటే తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయించుకొని నెగిటివ్ సర్టిఫికెట్ ఉండాల్సిందే. కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ లేకుండా ప్రయాణం చేసేందుకు అవకాశంలేదు. ఇక ఇదిలా ఉంటే, అమెరికాలోని చికాగో నుంచి ఐస్‌లాండ్‌కు 159 మంది ప్రయాణికులతో విమానం బయలుదేరింది. విమాన ప్రయాణానికి ముందు ప్రయాణికులకు టెస్టులు చేశారు. Read: వైరల్: టైగర్ దెబ్బకు…
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ కరోనా సెకండ్ వేవ్ విలయం కొనసాగుతూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. ఈ వైరస్ పేదవాళ్ళను కూడా వదలడం లేదు. సెకండ్ వేవ్ ముగుస్తున్న తరుణంలో థర్డ్ వేవ్ కూడా ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. థర్డ్ వేవ్ లో భారీగా…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. “నాకు కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్లీజ్ డోంట్ వర్రీ… నేను బాగానే ఉన్నాను. నా కుటుంబం, నేను వేరువేరుగా ఐసోలేషన్ లో ఉన్నాము. మేము వైద్యుల పర్యవేక్షణలో అన్ని ప్రోటోకాల్స్ ను పాటిస్తున్నాము. గత కొన్ని రోజులుగా నన్ను సంప్రదించిన వారు కోవిడ్-19 పరీక్షలు చేసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సురక్షితంగా ఉండండి”…