క్రైస్ట్ చర్చ్ వేదికగా శ్రీలంక-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో తొలుత తడబడ్డా కివీస్ తర్వాత పుంజుకుంది. డారిల్ మిచెల్ అద్బుత సెంచరీకి తోడు లోయరార్డర్ లో హెన్రీ రెచ్చిపోవడంతో తొలి ఇన్నింగ్స్ లో లంక కంటే ఎక్కువ స్కోరు న్యూజిలాండ్ జట్టు చేసింది. డారెల్ మిచెల్(102) చేయగా హెన్రీ ( 75 బంతుల్లో 72, 10 ఫోర్లు, 3సిక్సర్లు) వన్డే తరహా ఆట ఆడారు. ఫలితంగా న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 373 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోర్ 162-5 వద్ద మూడో రోజు ఆట ఆరంభించిన కివీస్ జట్టును మిచెల్ ఆదుకున్నాడు. మైఖేల్ బ్రాస్ వెల్ (25) నిరాశపరిచాడు. కెప్టెన్ టీమ్ సౌథీ (25) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయాడు.
Aslo Read : Obesity : కొవ్వు తగ్గాలంటే కొన్నింటికి దూరంగా ఉండాల్సిందే.. వాటిలో మెయిన్ ఇవే
ఒకవైపు వికెట్లు పడుతున్నా మిచెల్ పట్టుదలతో బ్యాటింగ్ చేశాడు. హన్రీ వచ్చిన తర్వాత మిచెల్ కూడా స్వేచ్చగా బ్యాటింగ్ చేశాడు. ఈ ఇద్దరూ 9వ వికెట్ కు 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. డారెల్ మిచెల్ ఔటైయ్యే సమయానాకి న్యూజిలాండ్ 291-8గానే ఉంది కానీ హెన్రీ మెరుపులతో కివీస్ తొలి ఇన్నింగ్స్ లో లంక స్కోరు (3550ను దాటేసింది. చివర్లో వాగ్నర్ (24బంతుల్లో 27, 1 ఫోర్, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో తొలి ఇన్నింగ్స్ లో కివీస్ 373 పరుగులు చేయగలిగింది. ఫలితంగా మొదటి ఇన్సింగ్స్ లో 18 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని న్యూజిలాంట్ టీమ్ సాధించింది.
Aslo Read : Japanese Tourist: హోలీ వేడుకల్లో వేధింపులు.. దేశం వీడిన బాధితురాలు
కాగా, రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన లంక.. ఇప్పటికే మూడు వికెట్లను కోల్పోయింది. ఓపెనర్లు ఒషాడా ఫెర్నాండో(28), దిముత్ కరుణరత్నే(17)లు విఫలమయ్యారు. వన్ డౌన్ బ్యాటర్ కుశాల్ మెండిస్(14) కూడా నిరాశపరిచాడు. ప్రస్తుతం ఏంజెలో మాథ్యూస్( 20 నాటౌట్), ప్రభాత్ జయసూర్య(2నాటౌట్)లు క్రీజులో ఉన్నారు. 38ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక 3 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసి 65 పరుగుల లీడ్ సాధించింది.
Aslo Read : India’s services sector: ఫిబ్రవరిలో 12 ఏళ్ల గరిష్టానికి పీఎంఐ
కాగా, భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సిప్ ఫైనల్ చేరాలంటే లంక-కివీస్ లటెస్ట్ మ్యాచ్ ఫలితం కూడా కీలకంగా మారింది. ఒకవేళ అహ్మదాబాద్ టెస్టులో భారత్ ఓడితే.. లంకకు డబ్య్లూటీసీ ఫైనల్ చేరేందుకు అవకాశాలుంటాయి. కివీస్ ను రెండు మ్యాచ్ లలో ఓడించి సిరీస్ ను క్లీన్ స్వీస్ చేస్తే లంకేయులు ఫైనల్ కు చేరుతారు. ప్రస్తుతం ఈ టెస్టులో శ్రీలంక గెలవడం కొంచెం కష్టమే.. ఈ నేపథ్యంలో మిచెల్ కివీస్ తో పాటు భారత జట్టను ఆదుకున్నటే.. ప్రస్తుత అహ్మదాబాద్ టెస్టులో భారత్ గెలుపు సంగతి దేవుడెరుగు కానీ మ్యాచ్ ను కనీసం డ్రా చేసుకున్నా అదే పదివేలు అని క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు.