India’s services sector: ఈ ఏడాది ఫిబ్రవరిలో సేవల రంగం అద్భుతమైన పనితీరును కనబరిచింది. అత్యంత బలమైన స్థాయిలో విస్తరించింది. తద్వారా 12 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. అనుకూల గిరాకీ పరిస్థితులు నెలకొనటం, కొత్త వ్యాపార లాభాలు నమోదు కావటం కలిసొచ్చింది. దీంతో.. S & P గ్లోబల్ ఇండియా PMI భారీగా పెరిగింది. ఈ సూచీ విలువ జనవరిలో 57 పాయింట్ 2 వద్ద ఉండగా ఫిబ్రవరిలో 59 పాయింట్ 4కి చేరింది.
read more: Tata Motors: టాటా EV బిజినెస్‌లో వాటా ఇచ్చేందుకు రెడీ
సర్వీస్ సెక్టార్ ఈ రేంజ్‌లో రాణించటం.. అంటే.. 2 పాయింట్ 2 పెరగటం గత 12 ఏళ్లలో ఇదే తొలిసారి. వరుసగా 19వ నెలలో హెడ్‌లైన్ ఫిగర్ న్యూట్రల్ 50 థ్రెషోల్డ్‌కి పైనే ఉండటం విశేషం. పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్.. PMI పరిభాషలో చెప్పుకున్నప్పుడు ఈ విలువ 50 కన్నా ఎక్కువ ఉంటే విస్తరణకు సూచికని, తక్కువ ఉంటే సంకోచానికి సంకేతమని నిపుణులు చెప్పారు. పోయిన నెలలో సేవల రంగ సంస్థల మధ్య పోటీ వల్ల ధరలు దిగొచ్చాయని, ఫలితంగా సేల్స్ పెరిగాయని తెలిపారు.
ఇన్‌పుట్ ఖర్చులు సైతం దాదాపు రెండున్నరేళ్ల తర్వాత చాలా నిదానంగా పెరిగాయని, ఔట్‌పుట్ ఛార్జ్ ద్రవ్యోల్బణం 12 నెలల కనిష్టానికి తగ్గిందని స్పష్టం చేశారు. ఆర్డర్లు పెరిగినప్పటికీ కంపెనీలు కొత్త ఉద్యోగులను పెద్దగా తీసుకోలేదని, దీనివల్ల ఉత్పత్తి వ్యయం స్థిరంగా ఉండిపోయిందని చెప్పారు. S & P గ్లోబల్ సంస్థ ఈ PMIని 2005వ సంవత్సరం నుంచి విడుదల చేస్తోంది. సుమారు 500 సంస్థల అభిప్రాయాలతో రూపొందిస్తోంది.