Bheems Ceciroleo : మెగాస్టార్ సినిమాకు భీమ్స్ మ్యూజిక్
- టాలీవుడ్ లో దూసుకెళ్తున్న భీమ్స్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ల జాబితాలో చేరిన భీమ్స్ చిరు అనిల్ రావిపూడి సినిమాకు తనే మ్యూజిక్ డైరెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bheems Ceciroleo : తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్స్ అనగానే ప్రస్తుతం దేవీశ్రీప్రసాద్, తమన్ పేర్లు వినిపిస్తాయి. ఈ ఇద్దరితోపాటు రెండేళ్లుగా అనిరుధ్ పేరు కూడా మోత మోగుతోంది. అయితే రీసెంట్‌గా ఓ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ హవా సాగిస్తున్నాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్లకు తనేమీ తక్కువ కాదని నిరూపిస్తున్నాడు. చిన్న సినిమా అయినా పాటతో పెద్ద హిట్ చేస్తున్నాడు అతడే భీమ్స్. వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీలోని గోదారి గట్టుమీద రామచిలకే’ సాంగ్‌తో భీమ్స్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. తక్కువ టైంలో 50 మిలియన్ వ్యూవ్స్ రావడంతోపాటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాట రీల్సే.
Read Also:Venkatesh : ఏపిలో సంక్రాంతి వస్తున్నాం టికెట్ ధర పెంపు
Also Read
- Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
- AP Weather Update: ఏపీకి 4 రోజుల పాటు వర్ష సూచన!
- New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
- Kitchen Cleaning Tips: కిచెన్ సింక్‌లో నీళ్లు నిలిచిపోతున్నాయా? ఈ చిట్కాలతో సులభంగా క్లియర్ చేయండి!
వెంకటేశ్, అనిల్ రావిపూడి, దిల్‌రాజు కాంబోలో రూపొందుతున్న మూడో సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ కలయికలో వచ్చిన గత రెండు సినిమాలు ఎఫ్2. ఎఫ్3కి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చాడు. మూడో సినిమకు సంగీత దర్శకుడిగా భీమ్స్‌ను తీసుకుంటే మ్యూజికల్‌తో హైప్ తీసుకొచ్చాడు. గోదారి గట్టు మీద రామ చిలకను మర్చిపోక ముందే, వెంకటేశ్‌తో ‘బ్లాక్‌బస్టర్ సంక్రాంతి’ పాటను పాడించి సినిమాకు ఊపు తీసుకొచ్చాడు. భీమ్స్ పేరు ఈమధ్య ఎక్కువగా వినిపిస్తున్నా 12 ఏళ్ల క్రితమే 2012లో అల్లరి నరేశ్ ‘నువ్వా నేనా’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. అయితే వరుస ఫ్లాపులతో గుర్తింపు దక్కలేదు. ధమాకా క్రేజ్ తీసుకురాగా మ్యాడ్‌తో మరో హిట్ అందుకున్నాడు. దీంతో సీనియర్ హీరో వెంకటేశ్ సినిమాకు వర్క్ చేసే ఛాన్స్ కొట్టేశాడు భీమ్స్.
Read Also:Sankranthiki Vasthunnam : ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫస్ట్ హీరో వెంకటేష్ కాదట.. ఆయనేనట ?
అనిల్ రావిపూడి.. ఈ సంక్రాంత్రికి వస్తున్నాం తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. చిరంజీవితో చేయబోయే సినిమాకి కూడా భీమ్స్ సిసిరోలియోనే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకుంటాను’ అంటూ ఇటీవల అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం భీమ్స్ రవితేజ ‘మాస్ జాతర’కు అడవి శేషు ‘డెకాయిట్’కు మ్యూజిక్ ఇస్తున్నాడు.
తాజావార్తలు
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
-
AP Weather Update: ఏపీకి 4 రోజుల పాటు వర్ష సూచన!
-
New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
-
Kitchen Cleaning Tips: కిచెన్ సింక్‌లో నీళ్లు నిలిచిపోతున్నాయా? ఈ చిట్కాలతో సులభంగా క్లియర్ చేయండి!
-
New Car Launched: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 828 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. మైండ్ బ్లోయింగ్ కారు ఫీచర్స్ ఇవే..
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!