ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా క్వీన్స్‌లాండ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 48 పరుగుల తేడాతో కంగారులను చిత్తు చేసింది. భారత్ నిర్ధేశించిన 168 రన్స్ ఛేదనలో ఆసీస్ 18.2 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (30) టాప్ స్కోరర్. మాథ్యూ షార్ట్ (25) మినహా మిగతా కంగారో బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్స్ పడగొట్టగా.. అక్షర్ పటేల్,…
క్వీన్స్‌లాండ్‌లో ఆస్ట్రేలియా జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 రన్స్ చేసింది. ఆసీస్ విజయ లక్ష్యం 168 రన్స్. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (46; 39 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్. అభిషేక్ శర్మ (28), శివమ్ దూబే (22), సూర్యకుమార్ యాదవ్ (20), అక్షర్ పటేల్ (21) పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎలిస్, ఆడమ్ జంపా తలో…
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మెల్‌బోర్న్ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఈ టీ20లో టాస్‌ను నెగ్గిన ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో భారత్ ముందుగా బ్యాటింగ్ చేస్తోంది. ఆసీస్ బౌలర్ల ధాటికి భారత్ వరుసగా వికెట్స్ కోల్పోయింది. టీమిండియాకు మూడో ఓవర్‌లోనే షాక్ తగిలింది. గత మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన శుభ్‌మన్ గిల్ 5 పరుగులకే అవుట్ అయ్యారు. జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో మిచెల్…
ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య తొలి మ్యాచ్ కాన్‌బెర్రాలో జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ముందుగా బ్యాటింగ్ చేస్తోంది. తెలుగు ప్లేయర్ నితీష్ రెడ్డికి తుది జట్టులో చోటు దక్కలేదు. భారత్ ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగింది. అక్షర్, వరుణ్, కుల్‌దీప్ స్పిన్ కోటాలో.. హర్షిత్, బుమ్రాలు పేస్ కోటాలో ఆడుతున్నారు. టాస్ గెలిస్తే ముందుగా…
ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ రాణించిన విషయం తెలిసిందే. మొదటి వన్డేలో 8 పరుగులే చేసిన రోహిత్.. రెండో వన్డేలో 73 రన్స్, మూడో వన్డేలో 121 పరుగులు చేశాడు. చివరి వన్డేలో భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన హిట్‌మ్యాన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్’ అందుకున్నాడు. సిరీస్‌లో హయ్యెస్ట్ రన్ స్కోరర్‌గా నిలిచి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ కూడా సొంతం చేసుకున్నాడు. వన్డే సిరీస్ ముగియడంతో…
ఆస్ట్రేలియాకు రావడం తనకు చాలా ఇష్టం అని, ఇక్కడ అత్యుత్తమ క్రికెట్ ఆడాను అని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ప్రేక్షకులు భారీ సంఖ్యలో వచ్చి తమకు మద్దతు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘ అనుభవం ఉన్నా.. ఆట ఎపుడూ కొత్త పరీక్ష పెడుతుందన్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన తర్వాత హాఫ్ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం సంతోషంగా ఉందని కోహ్లీ భావోద్వేగం…
అడిలైడ్ ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఓడిపోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్ల నష్టానికి 264 రన్స్ చేసింది. 265 పరుగుల టార్గెట్‌ని ఆసీస్ 46.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి చేధించింది. మొదటి రెండు వన్డేల్లో భారత్‌ను ఓడించిన ఆస్ట్రేలియా.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను గెలుచుకుంది. 17 సంవత్సరాల తర్వాత అడిలైడ్ ఓవల్‌లో భారత్ వన్డే మ్యాచ్‌ను ఓడిపోయింది. భారత్ వన్డే సిరీస్ ఓటమికి ప్రధాన కారణాలు…
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ పరాజయం పాలైంది. 265 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 45.5 ఓవర్లలో 8 వికెట్స్ కోల్పోయి ఛేదించింది. మాథ్యూ షార్ట్ (74; 78 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), కూపర్ కొన్నోలీ (57; 51 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు. మిచెల్ ఓవెన్ (36), మాట్ రెన్షా (30)లు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.…
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. టీమిండియాకు ఇది డూ ఆర్ డై మ్యాచ్. అడిలైడ్ వన్డేలో గెలిస్తేనే మూడు వన్డేల సిరీస్ 1-1తో సమం అవుతుంది. రెండో వన్డేలో అందరి కళ్లు స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పైనే ఉన్నాయి. తొలి వన్డేలో ఇద్దరూ విఫలమైన సంగతి తెలిసిందే. అడిలైడ్‌లో అయినా రో-కోలు రాణించాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. అయితే అడిలైడ్…
ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య గురువారం (అక్టోబర్ 23) అడిలైడ్ వేదికగా రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. ఉదయం 9 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ టీమిండియాకు అత్యంత కీలకం. రెండో వన్డేలో గెలిస్తేనే మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేస్తుంది. మొదటి వన్డేలో అన్ని విభాగాల్లో విఫలమైన భారత జట్టు పుంజుకుంటేనే విజయం సాధ్యమవుతుంది. గత మ్యాచ్‌లో విఫలమైన స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల పైనే అందరి…