Australia Team Got Out For 188 Againt India In First ODI: వాంఖడే స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు 188 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్ల ధాటికి ఆసీస్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. మొదట్లో నిలకడగా రాణించగలిగింది కానీ, ఆ తర్వాతే పట్టు కోల్పోయింది. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ ఒక్కడే 81 పరుగులతో అద్భుతంగా రాణించాడు. క్రీజులో ఉన్నంతవరకు పరుగుల వర్షం కురిపించాడు. కానీ, మిగతా బ్యాటర్లెవరూ సత్తా చాటలేకపోయారు. మైదానంలోకి అడుగుపెట్టినట్టే పెట్టి.. పెవిలియన్ బాట పట్టారు. ఒకరిద్దరు క్రీజులో కుదురుకున్నట్టే కనిపించారు కానీ, ఆ తర్వాత వాళ్లు కూడా చేతులెత్తేశారు. దీంతో.. 35.4 ఓవర్లలోనే 188 పరుగులకి ఆసీస్ జట్టు చాపచుట్టేసింది.
DK Aruna: బీఆర్ఎస్ పార్టీని తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయి
తొలుత టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంపిక చేసుకోగా.. బ్యాటింగ్ చేసేందుకు ఆస్ట్రేలియా రంగంలోకి దిగింది. అయితే.. ఆదిలోనే ఆసీస్ జట్టుకి గట్టి దెబ్బ తగిలింది. ఐదు పరుగులకే ట్రావిస్ హెడ్ ఔటయ్యాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్‌తో కలిసి మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ జట్టుని ముందుకు నడిపించాడు. భారీ షాట్లతో విజృంభించాడు. వీళ్లిద్దరు రెండో వికెట్‌కి 72 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. వీరి జోడి చూసి.. ఆసీస్ జట్టు భారీ స్కోర్ చేయడాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని అనుకున్నారు. కానీ.. ఇంతలోనే (77 పరుగుల వద్ద) స్టీవ్ స్మిత్ ఔట్ అయ్యాడు. అతని తర్వాత వచ్చిన మార్నస్‌తో కలిసి.. మిచెల్ మంచి పార్ట్నర్‌షిప్ జోడించాడు. మిచెల్ ఉన్నంతవరకు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ జోరుగా సాగింది. కానీ.. ఎప్పుడైతే అతడు ఔటయ్యాడో, అప్పటినుంచి ఆసీస్ జట్టు పూర్తిగా పట్టు కోల్పోయింది.
Cyber Fraud: నమ్మినందుకు నట్టేటముంచారు.. మహిళ నుంచి రూ.12 లక్షలు స్వాహా
మిచెల్ ఔటయ్యాక.. ఏ ఒక్కరూ సరిగ్గా రాణించలేకపోయారు. భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కోలేక, కాసేపు కూడా క్రీజులో నిలకడగా రాణించలేకపోయారు. ఏకంగా ఆరుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారంటే.. ఏ రేంజ్‌లో భారత బౌలర్లు ఆస్ట్రేలియాను కట్టడి చేశారో అర్థం చేసుకోవచ్చు. ఈసారి.. ఆసీస్ జట్టుపై మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ తాండవం చేశారు. ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా మెరుగైన బౌలింగ్ వేసిన వీళ్లిద్దరూ.. చెరో మూడు వికెట్లు తీశారు. జడేజా కూడా తన స్పిన మాయ చూపించి.. 2 వికెట్లు తీసుకున్నాడు. ఇక హార్దిక్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తీసుకున్నారు.