క్రికెట్ ప్రపంచంలో పెను విషాదం నెలకొంది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, లెజెండరీ స్పిన్నర్ షేన్‌వార్న్(52) హఠాన్మరణం చెందాడు. గుండెపోటుతో మరణించినట్లు ఆస్ట్రేలియాలో మీడియా వెల్లడించింది. తొలుత తన నివాసంలో వార్న్ విగతజీవిగా పడి ఉండటాన్ని చూసిన సిబ్బంది ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. వార్న్ గుండెపోటుకు గురైనట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు.
కాగా షేన్ వార్న్ ఆస్ట్రేలియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. టెస్టుల్లో 5 వికెట్లు 37సార్లు, 10 వికెట్లు పదిసార్లు తీశాడు. ఐపీఎల్‌లో నాలుగేళ్ల పాటు రాజస్థాన్ రాయల్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 55 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 57 వికెట్లు సాధించాడు. టెస్టుల్లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ వార్న్. అటు ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ముత్తయ్య మురళీధరన్ తర్వాత రెండో స్థానంలో నిలిచాడు.
BREAKING
— Fox Cricket (@FoxCricket) March 4, 2022
Australia cricket legend, Shane Warne, dies of ‘suspected heart attack’, aged 52.
Details: https://t.co/Q83t5FWzTb pic.twitter.com/YtQkY8Ir8p