దివంగత ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన లెగ్ స్పిన్ మాయాజాలంతో మేటి బ్యాటర్‌లను కూడా ఇట్టే పెవిలియన్ చేర్చిన ఘనత అతడి సొంతం. వార్న్ లెగ్ స్పిన్ బౌలింగ్‌ను తిరిగి ప్రాచుర్యంలోకి తెచ్చాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బంతిని అద్భుతంగా తిప్పగలడు, అతడి బంతి గమనాన్ని ఊహించడం కష్టతరం అని ఎందరో పేర్కొన్నారు. 1993లో మైక్ గాటింగ్‌ను బౌల్డ్ చేసిన బంతి ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’గా…
రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) కెప్టెన్ సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్ జట్టుకు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం పంజాబ్ కింగ్స్‌పై రాజస్థాన్ 50 పరుగుల తేడాతో విజయం సాధించడంతో.. సంజూ మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా చరిత్ర పుస్తకాల్లో తన పేరును లిఖించుకున్నాడు. ఈ క్రమంలో లెజెండరీ షేన్ వార్న్ రికార్డును బ్రేక్ చేశాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా సంజూ శాంసన్ మొత్తం…
Shane Warne: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ (Shane Warne) మరణానికి సంబంధించిన ఘటనలో కొత్త మలుపు తిరిగింది. 2022 మార్చి 4న థాయ్‌లాండ్ లోని కోహ్ సమూయి ద్వీపంలోని ఓ విల్లాలో ఆయన హఠాన్మరణం చెందిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సమయంలో గుండెపోటే ప్రధాన కారణమని భావించారు. అయితే, తాజా సమాచారం ప్రకారం సంఘటనా స్థలంలో ఓ కీలకమైన ‘వస్తువు’ తొలగించబడినట్లు బ్రిటన్ మీడియా సంస్థ డైలీ మెయిల్ సంచలన కథనం ప్రచురించింది.…
Unforeseen Swing Ball leaving cricket fans: స్పిన్ దిగ్గజం ‘షేన్ వార్న్’ తన సంచలన బౌలింగ్ ప్రదర్శనతో అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. టెస్టుల్లో 708, వన్డేల్లో 293 వికెట్స్ తీసినా.. ఒకే ఒక బంతి అతడికి ఎనలేని గుర్తింపు తీసుకొచ్చింది. 1993లో యాషెస్ సిరీస్‌లో వార్న్ వేసిన నమ్మశక్యం కాని బంతి చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’గా రికార్డుల్లోకి ఎక్కింది. వార్న్ ‘లైఫ్ టైమ్ డెలివరీ’ని ఎవరూ అంత ఈజీగా…
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పెద్ద వయస్సు ఉన్న కెప్టెన్ గా ఎంఎస్ ధోని నిలిచాడు. ఐపీఎల్ 2023లో భాగంగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా బరిలోకి దిగిన ధోని ఈ అరుదైన రికార్డును సాధించాడు. ధోని 41సంవత్సరాల 267 రోజుల వయస్సులో ఈ ఘనత నమోదు చేశాడు.
ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్ షేన్‌వార్న్ ఈనెల 4న థాయ్‌లాండ్‌లోని ఓ హోటల్‌లో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆరో రోజుల తర్వాత వార్న్ డెడ్‌బాడీ ప్రత్యేక విమానం ద్వారా గురువారం నాడు థాయ్‌లాండ్ నుంచి ఆస్ట్రేలియాకు చేరుకుంది. శవపేటికలో వార్న్ భౌతికకాయాన్ని ఉంచి ఆస్ట్రేలియా జాతీయ పతాకం దానిపై కప్పారు. థాయ్‌లాండ్‌లోని డాన్ మ్యూంగ్ అనే ఎయిర్ పోర్టు నుంచి మెల్‌బోర్న్‌కు డసాల్ట్ ఫాల్కన్ 7ఎక్స్ చార్టర్డ్ విమానంలో షేన్‌వార్న్ మృతదేహాన్ని థాయ్ ప్రభుత్వం తరలించింది.…
షేన్ వార్న్‌ను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ వెల్లడించాడు. వార్న్ ప్రపంచ అత్యుత్తమ స్పిన్నర్ కాదంటూ ఈ సమయంలో తాను వ్యాఖ్యానించాల్సింది కాదని ఆయన అభిప్రాయపడ్డాడు. నిజానికి ఇలాంటి సమయంలో టీవీ ఛానల్ వారు అలాంటి ప్రశ్న అడగాల్సింది కాదు.. తాను జవాబు చెప్పాల్సింది కాదని వివరించాడు. అయితే యాంకర్ అడిగిన ప్రశ్నకు తాను నిజాయితీగా తన అభిప్రాయం చెప్పినట్లు సన్నీ తెలిపాడు. క్రికెట్‌లో గొప్ప ఆటగాళ్లలో…
సిద్దార్థ్ శుక్లా.. పునీత్ రాజ్‌కుమార్.. ఏపీ మంత్రి గౌతం రెడ్డి.. తాజాగా షేన్ వార్న్.. వీళ్లే కాదు ఇలా ఎందరో.. ఫిట్‌నెస్ కోసం శ్రమించి… ప్రాణాల మీదకు తెచ్చుకున్న వాళ్లే. అయితే.. వీళ్ల మరణాలు ఏం చెప్తున్నాయి? జిమ్ చేయడం తప్పా? అతిగా శ్రమిస్తే.. హార్ట్ ఎటాక్ తప్పదా? ఎక్సర్‌సైజ్ చేస్తే.. ఆరోగ్యానికి మంచిదంటారు. మరి వీళ్ల ప్రాణాల మీదకు ఎందుకొచ్చింది? ఫిట్‌గా ఉండేందుకు రకరకాలుగా శ్రమిస్తున్న ప్రతి ఒక్కరిని కలవరపెడుతున్న సమస్య ఇదే. గుండె పదిలంగా…
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. సెలవులను ఎంజాయ్ చేసేందుకు థాయ్‌లాండ్ వెళ్లిన షేన్ వార్న్ అక్కడి హోటల్ గదిలో విగతజీవుడై పడిఉన్న సంగతి అతడి వ్యక్తిగత సిబ్బంది ద్వారా బయటకు వచ్చింది. అయితే వార్న్ మరణంపై థాయ్‌లాండ్ పోలీసులు షాకింగ్ అంశాలను ప్రస్తావించారు. వార్న్ గదిలో రక్తపు మరకలు గుర్తించినట్లు పోలీసులు చెప్పడం సంచలనం రేపుతోంది. దీంతో వార్న్ మృతిపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. గుండెపోటుతో కింద…