Vijayawada: దీపావళి ముందు జరుగుతున్న ప్రమాదాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. టపాసుల దుకాణాలతో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. శనివారం రాత్రి తిరుపతిలో, ఆదివారం ఉదయం విజయవాడలో క్రాకర్స్ స్టాల్స్‌లో అగ్ని ప్రమాదాలు సంభవించాయి. విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీపావళి మందులు విక్రయించే స్టాల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పక్కన ఉన్న మరో రెండు షాపులకు మంటలు వ్యాపించాయి. దీంతో మూడు షాపుల్లో దీపావళి టపాసులు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. Read…
Terrorist Attacks Plan in Hyderabad: హైదరాబాద్‌లో ఉగ్ర కుట్ర కేసులో పలు కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. సిటీలో పేలుళ్లకు కుట్ర పనిన్న కేసులో సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో అబ్దుల్ జాహిద్‌తో పాటు సమీవుద్దీన్, మాజా హాసన్ అరెస్ట్ అయ్యారు. మొత్తం ఆరుచోట్ల పేలుళ్లకు నిందితులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ నుంచి హ్యాండ్ గ్రెనేడ్లతో బాంబు దాడులకు ప్లాన్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఇప్పటికే ఆరు ప్రాంతాలను జాహిద్ గ్యాంగ్…
Fire Accident: ఇప్పటివరకు మనం ఎలక్ట్రిక్ బైకులే కాలిపోవడం విన్నాం.. కానీ తొలిసారిగా ఎలక్ట్రిక్ బైక్ షోరూంలోనే అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం రాత్రి సికింద్రాబాద్‌లోని ఓ ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రూబీ హోటల్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న బైక్ షోరూంలో ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. దీంతో రూబీ లాడ్జీపైకి మంటలు ఎగిసిపడ్డాయి. హోటల్‌లో కొందరు టూరిస్టులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని హోటల్‌లో చిక్కుకుపోయిన వారిని…
ప్రధాని మోదీ హత్యకు కొందరు దుండగులు కుట్ర పన్నారు. ఈ మేరకు ముంబైలోని ఎన్‌ఐఏ కార్యాలయానికి బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. మోదీ హత్యకు 20 మందితో స్లీపర్‌సెల్స్ రెడీగా ఉన్నట్లు ఈ-మెయిల్‌లో దుండగులు హెచ్చరించారు. 20 కేజీల ఆర్‌డీఎక్స్ కూడా సిద్ధం చేసినట్లు తెలిపారు. దీంతో వెంటనే కేంద్ర భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. బెదిరింపు ఈ-మెయిల్‌పై కేంద్ర హోంశాఖ అత్యున్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. ఈ-మెయిల్‌ను ఎవరు పంపారో కేంద్ర భద్రతా బలగాలు దర్యాప్తు చేపట్టాయి.
చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. చైనా ఈస్టర్న్ కంపెనీకి చెందిన బోయింగ్ 737 విమానం కుప్పకూలింది. ఈ విమానంలో ప్రయాణిస్తున్న 133మంది మరణించారు. ప్రమాదం ధాటికి విమానం పూర్తిగా దగ్ధమైంది. కన్ మింగ్ నుంచి వెళ్తుండగా గ్వాంగ్జీ ప్రాంతంలోని వుజౌ నగరానికి సమీపంలో విమానం క్రాష్ ల్యాండ్ అయి ప్రమాదం జరిగింది. పర్వతాలలో మంటలు చెలరేగాయని సీసీటీవీ ఫుటేజ్ తెలిపింది. ఈ విషయం తెలిసిన వెంటనే రెస్క్యూ టీమ్‌లను ఘటనా స్థలానికి పంపినట్లు అధికారులు తెలిపారు. కాగా…
క్రికెట్ ప్రపంచంలో పెను విషాదం నెలకొంది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, లెజెండరీ స్పిన్నర్ షేన్‌వార్న్(52) హఠాన్మరణం చెందాడు. గుండెపోటుతో మరణించినట్లు ఆస్ట్రేలియాలో మీడియా వెల్లడించింది. తొలుత తన నివాసంలో వార్న్ విగతజీవిగా పడి ఉండటాన్ని చూసిన సిబ్బంది ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. వార్న్ గుండెపోటుకు గురైనట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా షేన్ వార్న్ ఆస్ట్రేలియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు…
దేశవ్యాప్తంగా ప్రముఖ దిగ్గజ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ సర్వీసుల్లో అంతరాయం తలెత్తింది. ఉదయం 11:30 గంటల నుంచి బ్రాడ్‌బ్యాండ్, వైఫై, మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులు నిలిచిపోయాయి. మరోవైపు ఎయిర్‌టెల్ యాప్ కూడా పనిచేయట్లేదు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లు ట్విట్టర్‌లో ఫిర్యాదులు చేస్తున్నారు. అటు ఎయిర్‌టెల్ సేవల అంతరాయంపై కంపెనీ స్పందించింది. కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది. తమ కస్టమర్లకు క్షమాపణలు కూడా చెప్పింది. సేవలను వీలైనంత త్వరగా పునరుద్ధరిస్తామని స్పష్టం చేసింది. కాగా ఎయిర్‌టెల్…
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాను గుంటూరు నగరంపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును పరామర్శించేందుకు సీఐడీ కార్యాలయానికి వచ్చిన దేవినేని ఉమాను పోలీసులు అడ్డుకున్నారు. అశోక్‌బాబును కలిసేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులతో దేవినేని ఉమా వాగ్వాదానికి దిగారు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో దేవినేని ఉమా సహా టీడీపీ నేతలు కోవెలమూడి రవీంద్ర, బుచ్చి రాంప్రసాద్, పిల్లి మాణిక్యాలరావు,…
ఏపీలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బుదగవి వద్ద ఇన్నోవా కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. పెళ్లికి వెళ్లి కారులో బళ్లారి నుంచి అనంతపురం తిరిగి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరినట్లు సమాచారం. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. కాగా ఈ ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాలను…