మెల్‌బోర్న్‌లో 2018లో జరిగిన ప్రపంచకప్‌లో కాంస్య పతకం సాధించిన తొలి భారతీయ జిమ్నాస్ట్‌గా చరిత్ర సృష్టించింది 25 ఏళ్ల హైదరాబాద్ జిమ్నాస్ట్, చెందిన బుద్ధార్ అరుణారెడ్డి. అయితే తాజాగా సోమవారం ఈజిప్ట్‌లోని కైరాలో జరిగిన హరోస్ కప్ అంతర్జాతీయ కళాత్మక టోర్నమెంట్‌లో హైదరాబాద్ జిమ్నాస్ట్ బుద్ధార్ అరుణారెడ్డి రెండు పతకాలను కైవసం చేసుకొని మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
ఫ్లోర్, వాల్ట్ ఈవెంట్‌లో అత్యున్నత గౌరవాన్ని సాధించి అరుణరెడ్డి రెండు స్వర్ణపతకాలను సాధించింది. గత సంవత్సరం అరుణ కుడి కాలుకు గాయమవడంతో నవంబర్‌లో శస్త్ర చికిత్స చేయించుకుంది. అయితే అంతర్జాతీయ పోటీలో పాల్గొనడానికి న్యూ ఢిల్లీలో కోచ్ మనోజ్ రాణాతో కలిసి తీవ్రంగా కష్టపడి అంతర్జాతీయ పోటీకి తిరిగి వచ్చింది.