Sampath Nandi: శర్వానంద్‌కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ‘భోగి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు సంపత్ నంది చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. తన పాత సినిమాల తరహాలో కాకుండా ఒక కొత్త దర్శకుడిలా కష్టపడి ఈ సినిమా తీశానని చెబుతూనే, సంగీత దర్శకుడు భీమ్స్‌తో తనకు వచ్చిన గ్యాప్ వెనుక ఇతరుల ప్రమేయం ఉందంటూ ఆయన పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 27న విడుదల కానున్న ఈ సినిమా కథ, తెరవెనుక విశేషాలను సంపత్ నంది వేదికపై పంచుకున్నారు.
హీరో శర్వానంద్ నటనపై సంపత్ నంది ప్రశంసల వర్షం కురిపించారు. “ఈ కథను నేను మొదటిసారి చెప్పిన ఏకైక హీరో శర్వానంద్. 20 నిమిషాల్లోనే ఓకే చెప్పారు. ఇంటర్వెల్, క్లైమాక్స్‌లో ఆయన చేసిన నటన గత పదేళ్లలో చేయలేదు, రాబోయే పదేళ్లలో కూడా ఎవరూ చేయలేరేమో! బకెట్లతో రక్తం పోసుకోమన్నా, బురదలో దూకమన్నా ఏమాత్రం ఆలోచించకుండా చేశారు. ఈ సినిమాకు శర్వానంద్‌కు కచ్చితంగా జాతీయ అవార్డు రావాలి. సినిమా ఫస్ట్ కట్ చూశాక శర్వా రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి ‘మా అమ్మ నాకు జన్మనిస్తే, మీరు మరో జన్మనిచ్చారు’ అని చెప్పడం నాకు ఏ అవార్డుకైనా మించిన ఆనందాన్నిచ్చింది” అని భావోద్వేగానికి లోనయ్యారు.
Also Read
- Bheems: భోగి సినిమా హిట్ కాకపోతే నా పేరు మార్చుకుంటా.. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సంచలన శపథం!
- Meenakshi Chaudhary : “చివరికి ఇదంతా బిజినెస్సే!”.. ఇండస్ట్రీలో వివక్షపై మీనాక్షి చౌదరి సంచలన వ్యాఖ్యలు!
- Nasha Mukth Bharath : డ్రగ్స్ మహమ్మారిపై ‘బాహుబలి’ యుద్ధభేరి
- Ramayana : ‘రామాయణ’ సినిమాపై భగ్గుమన్న విశ్వహిందూ పరిషత్.. తక్షణమే ప్రదర్శన నిలిపివేయాలని డిమాండ్!
హీరోయిన్ డింపుల్ హయాతి గురించి మాట్లాడుతూ సంపత్ నంది ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “డింపుల్‌కు కథ చెప్పినప్పుడు.. ఎలాంటి స్కిన్ షో, వల్గర్ మూమెంట్స్ లేకుండా అద్భుతమైన పాట ఒకటి తీస్తానని మాటిచ్చాను. కానీ కొన్ని కారణాల వల్ల ఆ పాట చేయలేకపోయాం. అందుకు వేదికపైనే డింపుల్‌కు సారీ చెబుతున్నా. కచ్చితంగా నా తదుపరి సినిమాలో ఆ మాట నిలబెట్టుకుంటా” అని అన్నారు. ఇక మరో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఎలాంటి డైరెక్షన్ అవసరం లేకుండానే చీర కట్టుకుని గిన్నెలు తోముతూ ఆ పాత్రలో ఒదిగిపోయిందని మెచ్చుకున్నారు. ఇక సెకండాఫ్‌లో వచ్చే ఒక ఎమోషనల్ పాటను గీత రచయిత చంద్రబోస్ స్వయంగా రాజమండ్రికి వచ్చి వినిపించినప్పుడు తాను, శర్వానంద్, నిర్మాత రాధామోహన్ కన్నీళ్లు పెట్టుకున్నామని, థియేటర్లలో ఆ పాటకు ప్రేక్షకుల కళ్లు చెమర్చకపోతే ఇకపై ఇలా అతిగా మాట్లాడటం తగ్గించుకుంటానని సంపత్ నంది ఛాలెంజ్ చేశారు. తన పాత ఇమేజ్ను పక్కనపెట్టి, ఒక కొత్త దర్శకుడు తీసిన సినిమాగా ‘భోగి’ని ఆదరించాలని ఆయన మీడియాను, ప్రేక్షకులను కోరారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-9 Live : నేడు మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కల్యాణం.. తొమ్మిదో రోజు వేడుకలివే..!
-
Sampath Nandi: శర్వానంద్‌కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
-
TDP : ఏపీలో 7 డిప్యూటీ మేయర్లు, 59 వైస్ చైర్పర్సన్ల జాబితా విడుదల..
-
December 2026 Sun Transit: డిసెంబర్లో సూర్యుడి నక్షత్ర మార్పు.. ఏ రాశులకు డబ్బు, అదృష్టం.?
-
PM Modi: 13 ఏళ్లలో 50 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి..
-
Bheems: భోగి సినిమా హిట్ కాకపోతే నా పేరు మార్చుకుంటా.. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సంచలన శపథం!
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!