Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
- కొబ్బరి నిల్వకు ఎయిర్‌టైట్ డబ్బా బెస్ట్
- ఫ్రిజ్‌లో 3 నుంచి 4 రోజుల్లో వాడేయాలి
- ఫ్రీజర్‌లో రెండు నెలల వరకు నిల్వ
- వాసన, రంగు మారితే అస్సలు వాడొద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణ భారత వంటకాల్లో, ముఖ్యంగా కర్ణాటక వంటల్లో కొబ్బరికి ప్రత్యేక స్థానం ఉంది. పొద్దున్నే చేసే చట్నీల నుంచి మధ్యాహ్నం సాంబార్, పాల్యా వరకు, తీపి వంటకాల దాకా కొబ్బరి లేకుండా వంట అసంపూర్తిగానే ఉంటుంది. కానీ కొబ్బరికాయ కొట్టినప్పుడల్లా ఒకే రోజులో మొత్తం వాడేయడం కష్టం. సరిగ్గా నిల్వ చేయకపోతే త్వరగా డ్రై అయిపోతుంది లేదా స్మెల్ రావడం మొదలవుతుంది. కొబ్బరి రుచి, ఫ్రెష్‌నెస్ ఎక్కువ రోజులు నిలవాలంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది.
ఎయిర్‌టైట్ డబ్బా.. ఫ్రిజ్, ఫ్రీజర్‌లో ఎలా ఉంచాలి?
కొబ్బరికాయ పగలగొట్టాక మిగిలిన ముక్కను అలానే ఫ్రిజ్‌లో పెట్టేయకూడదు. ముందుగా చిప్ప నుంచి తెల్లటి కొబ్బరిని వేరు చేసి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. వీటిని తడి లేని, శుభ్రమైన ఎయిర్‌టైట్ డబ్బాలో వేసి మూత గట్టిగా బిగించి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇలా చేస్తే కొబ్బరిలో తేమ ఆవిరి కాకుండా త్వరగా ఎండిపోకుండా ఉంటుంది. తురిమిన కొబ్బరి అయితే ఎయిర్‌టైట్ డబ్బాలో పెట్టి 3 నుంచి 4 రోజుల్లో వాడేయడం మంచిది. ఫ్రిజ్ టెంపరేచర్ 4 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. వేడి వాతావరణంలో బయట వదిలేస్తే త్వరగా పాడైపోతుంది.
Also Read
- Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్‌తో క్లీనింగ్ ఈజీ
- Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
- Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
- Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలనుకుంటే ఫ్రీజర్ బెస్ట్ ఆప్షన్. వెంటనే వాడని కొబ్బరిని తురిమి లేదా చిన్న ముక్కలుగా చేసి వంటకు సరిపడా మాత్రమే పక్కన పెట్టుకోవాలి. మిగిలిన దాన్ని చిన్న డబ్బాలు లేదా జిప్‌లాక్ బ్యాగుల్లో వేసి ఫ్రీజర్‌లో పెట్టాలి. అవసరమైనప్పుడు కొద్దికొద్దిగా తీసుకుంటే మొత్తం కొబ్బరిని పదేపదే బయటకు తీసి మళ్లీ ఫ్రీజ్ చేయాల్సిన పని ఉండదు. ఇలా ఫ్రీజర్‌లో పెడితే సుమారు రెండు నెలల వరకు కొబ్బరి తాజాగా ఉంటుంది.
నీళ్లు కలపొచ్చా? చేయాల్సిన జాగ్రత్తలివే
కొబ్బరిలో నీళ్లు కలపడం కొన్నిసార్లు చేసినా, నీటిని సరిగ్గా చూసుకోకపోతే త్వరగా పుల్లగా మారి క్వాలిటీ దెబ్బతింటుంది. అందుకే నీళ్లలో నానబెట్టడం కంటే పొడిగా ఉండే ఎయిర్‌టైట్ డబ్బాలో దాచుకోవడమే సేఫ్. నిల్వ చేసేటప్పుడు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు. పగిలిన లేదా చిట్లిన కొబ్బరిని స్ట్రాంగ్ స్మెల్ వచ్చే వస్తువుల దగ్గర ఉంచకూడదు. ఉల్లిపాయలు, వెల్లుల్లి, చేపలు, మసాలాల పక్కన పెడితే కొబ్బరి ఆ వాసనలను త్వరగా పీల్చేసుకుంటుంది. డబ్బాలో లేదా కొబ్బరిపై తడి లేకుండా చూసుకోవాలి, లేదంటే బూజు పట్టే ప్రమాదం ఉంటుంది. ఫ్రిజ్ నుంచి కొబ్బరి తీసేటప్పుడు ఎప్పుడూ క్లీన్‌గా, పొడిగా ఉండే స్పూన్ లేదా పొడి చేతులు వాడాలి. సరిపడా కొబ్బరి తీసుకున్నాక వెంటనే మూత పెట్టి ఫ్రిజ్‌లో పెట్టేయాలి.
కొబ్బరి పాడైందో లేదో ఎలా గుర్తించాలి?
ఫ్రిజ్‌లో దాచిన కొబ్బరి వాడే ముందు కలర్, స్మెల్, టెక్స్చర్ చెక్ చేసుకోవాలి. ఫ్రెష్ కొబ్బరి తెల్లగా, మంచి వాసనతో ఉంటుంది. పుల్లని లేదా కుళ్లిన వాసన వచ్చినా, ముట్టుకుంటే మెత్తగా అనిపించినా, బూజు పట్టినా లేదా రంగు మారినా అస్సలు వాడకూడదు. బూజు పట్టిన భాగాన్ని మాత్రమే కట్ చేసి పడేయడం సేఫ్ కాదు, డౌట్ ఉంటే మొత్తాన్నే పారేయడం మంచిది. సరిగ్గా ఉష్ణోగ్రతలో ఉంచకపోతే పగిలిన కొబ్బరి త్వరగా బూజు పడుతుందని 2006లో జర్నల్ ఆఫ్ ఫుడ్ ప్రొటెక్షన్‌లో వచ్చిన అధ్యయనం కూడా చెప్పింది. అందుకే జాగ్రత్తగా వాడుతూ సరిగ్గా నిల్వ చేసుకుంటే కొబ్బరి మొత్తాన్ని వంటల్లో హాయిగా వాడుకోవచ్చు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-9 Live : నేడు మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కల్యాణం.. తొమ్మిదో రోజు వేడుకలివే..!
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Hyderabad News : హైదరాబాద్ ఉగ్రదాడి బెదిరింపు మెయిల్ ఫేక్.. నిర్ధారించిన పోలీసులు
-
Ramayana : ఒక్క అడుగు దూరంలో రామాయణ
-
YS Sharmila : బెంగళూరులో హైడ్రామా.. యలహంక ఇంటికి వెళ్లేందుకు షర్మిల, విజయమ్మ ప్రయత్నం
-
January 12 Vidudala : ఆ ఫార్మాట్ మారింది.. కానీ?
ట్రెండింగ్
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్‌లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..