Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్నివీరులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. అగ్నిపథ్ పథకం కింద రెండేళ్ల సర్వీసు పొడిగింపును (సెకండ్ టూర్ ఆఫ్ డ్యూటీ) ఎంచుకునే అగ్నివీరులు వివాహం చేసుకోవడానికి అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే, పొడిగించిన సర్వీసులో చేరిన తర్వాత నిర్వహించే సుమారు నాలుగు వారాల ప్రత్యేక శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాతే వారు వివాహం చేసుకోవడానికి అర్హులవుతారని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి.
2022లో ప్రారంభించిన అగ్నిపథ్ పథకం నిబంధనల ప్రకారం.. అభ్యర్థులు నియామక సమయంలో అవివాహితులై ఉండాలి. అంతేకాకుండా, మొదటి నాలుగేళ్ల సర్వీసు కాలంలో వివాహం చేసుకోవడంపై పూర్తి నిషేధం ఉంది. రెండేళ్ల పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకునే సమయానికి కూడా అగ్నివీరులు అవివాహితులుగానే ఉండాలి. కానీ, స్వల్ప విరామం తర్వాత రెండో విడత సర్వీసులో చేరి, నాలుగు వారాల ప్రాథమిక శిక్షణను పూర్తి చేసుకున్న వెంటనే వివాహం చేసుకోవడానికి వారికి అనుమతి లభిస్తుంది.
Also Read
- Tamil Nadu: మహిళా కలెక్టర్‌కు టీవీకే ఎమ్మెల్యే వేధింపులు.. పోలీసుల మౌనంపై హైకోర్టు ఆగ్రహం!
- NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
- TGSRTC: టెక్నాలజీ వాడకంలో టీజీఎస్ఆర్టీసీ నయా రికార్డ్.. బస్సులో "i-ALERT" కన్ను..
- Putin Praises India: భారత్‌లో ఇన్ని భాషలా? ఈ వైవిధ్యం అద్భుతం.. పుతిన్ ప్రశంసలు!
ఇప్పటికే భారత నౌకాదళానికి చెందిన తొలి బ్యాచ్ అగ్నివీరులు తమ నాలుగేళ్ల ప్రాథమిక సర్వీసును పూర్తి చేసుకున్నారు. వీరిలో ప్రతిభ ఆధారంగా 25 శాతం మందిని శాశ్వత ప్రాతిపదికన విధుల్లోకి తీసుకోగా, మిగిలిన అర్హులైన వారికి రెండేళ్ల పొడిగింపు అవకాశాన్ని కల్పించారు. భారత సైన్యం, వైమానిక దళాలకు చెందిన తొలి బ్యాచ్‌లు కూడా వచ్చే నెలలో తమ నాలుగేళ్ల కాలపరిమితిని పూర్తి చేసుకోనున్నాయి.
శిక్షణ పొందిన సైనికులను మరికొంత కాలం సేవల్లో కొనసాగించడంతో పాటు, మిగిలిన 75 శాతం మంది అగ్నివీరులకు ఆరేళ్ల సర్వీసు తర్వాత శాశ్వత నియామకానికి మరో అవకాశం కల్పించే ఉద్దేశంతో కేంద్ర మంత్రివర్గం నవంబర్ 4న ఈ రెండేళ్ల ‘సెకండ్ టూర్ ఆఫ్ డ్యూటీ’కి ఆమోదం తెలిపింది. 17.5 నుంచి 21 ఏళ్ల వయస్సులో విధుల్లో చేరే గ్రామీణ యువత, ఐదో ఏడాదికి వచ్చేసరికి 23-24 ఏళ్లకు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో వారి వ్యక్తిగత, సామాజిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని వివాహ నిబంధనలను సడలించడం అగ్నివీరులకు ఎంతో మేలు చేయనుంది.
తాజావార్తలు
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
Sreeleela : శ్రీ లీల బ్యాడ్ టైం ఇంకా అయిపోలేదా?
-
Tamil Nadu: మహిళా కలెక్టర్‌కు టీవీకే ఎమ్మెల్యే వేధింపులు.. పోలీసుల మౌనంపై హైకోర్టు ఆగ్రహం!
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
TGSRTC: టెక్నాలజీ వాడకంలో టీజీఎస్ఆర్టీసీ నయా రికార్డ్.. బస్సులో “i-ALERT” కన్ను..
ట్రెండింగ్
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్‌లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!
-
IND vs NZ: ముగిసిన నాలుగో రోజు ఆట.. డ్రా దిశగా కివీస్ పోరాటం.. భారత్ విజయానికి మరో 8 వికెట్ల దూరంలో..!