Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్‌గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటివరకు కేవలం గ్లామర్ పాత్రలు, స్పెషల్ సాంగ్స్‌కే పరిమితమైందనే ముద్ర పడిన హీరోయిన్ డింపుల్ హయాతి, తొలిసారి తన కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న ‘భోగి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆమె మాట్లాడుతూ, తనపై ఉన్న పాత ఇమేజ్ను ఈ సినిమా పూర్తిగా చెరిపేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వేదికపై డింపుల్ హయాతి మాట్లాడుతూ.. “ప్రతి నటికి తనలోని నటనను నిరూపించుకునే ఒక బలమైన పాత్ర దక్కాలని ఉంటుంది. కానీ మనకు వచ్చిన అవకాశాలు, పరిమితుల్లోనే మనం చేసుకుంటూ వెళ్తాం. ఇప్పటిదాకా మీరందరూ నన్ను కేవలం గ్లామర్ డాల్‌గా, పాటలు, డ్యాన్సులు చేసే అమ్మాయిగానే చూశారు. కానీ నా కళ్లలో ఉన్న ఇంటెన్సిటీని గుర్తించి, నా నటనపై ఫోకస్ పెట్టిన మొదటి దర్శకుడు సంపత్ నంది గారే. ఇందులో నేను చేసిన ‘మందారం’ పాత్ర నా కెరీర్‌కు ఒక కొత్త దారిని చూపిస్తుంది. ఈ సినిమాలో నాకు ఒక్క డ్యాన్స్ కూడా లేదు, కేవలం కొత్త డింపుల్ హయాతిని మాత్రమే చూస్తారు” అని చెప్పుకొచ్చారు.
తను ఈ ప్రాజెక్ట్‌లోకి ఎలా వచ్చిందో చెబుతూ డింపుల్ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. “నిజానికి నేను నిర్మాత రాధామోహన్ గారిని వేరే సినిమా కథ వినడానికి కలిశాను. అక్కడే అనుకోకుండా సంపత్ నంది గారు నన్ను చూసి.. ‘డింపుల్, నేను నీకోసమే ఎదురుచూస్తున్నాను’ అని చెప్పి ‘భోగి’ కథ వినిపించారు. ‘మందారం’ పాత్ర గురించి విన్న మరుక్షణమే ఇది నేనే చేయాలని ఫిక్స్ అయిపోయాను. సాధారణంగా ఒక సినిమా కోసం వచ్చిన హీరోయిన్ మరో సినిమా అడిగితే నిర్మాతలు ఒప్పుకోరు. కానీ రాధామోహన్ గారు మాత్రం నీకు ఏది నచ్చితే అదే చేయమని నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు” అంటూ నిర్మాత గొప్పతనాన్ని కొనియాడారు.
Also Read
ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన భాషపై స్పందిస్తూ.. “నేను తెలుగు అమ్మాయినే అయినప్పటికీ, ‘భోగి’ సినిమాలో ఉండే పాత తెలంగాణ యాసను పలకడం నాకు చాలా కష్టమైంది. అంత పెద్ద డైలాగ్స్‌ను ఆ మాడ్యులేషన్లో చెప్పడం ఒక పెద్ద సవాల్. షూటింగ్ సమయంలో సంపత్ నంది గారు అస్సలు వదిలేవారు కాదు.. ఆయనే స్వయంగా ప్రతి డైలాగ్ మాడ్యులేషన్ ఎలా ఉండాలో చెప్పి చేయించేవారు” అని వివరించారు. ఇక ఈ సినిమాలో సులోచన పాత్రలో నటించిన అనుపమ పరమేశ్వరన్తో కలిసి పనిచేయడం ఎంతో సరదాగా ఉందని, శర్వానంద్ (గంగా) ఈ సినిమా కోసం నిద్రలేని రాత్రులు గడుపుతూ ఎంతో రస్టిక్‌గా, రా గా మారిపోయారని డింపుల్ ప్రశంసించారు. దర్శకుడు చెబితే మట్టిలో కూడా దొర్లడానికి శర్వానంద్ వెనుకాడలేదని, ఈ నెల 27న థియేటర్లలో తమ కష్టానికి తగిన ఫలితం దక్కుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-9 Live : నేడు మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కల్యాణం.. తొమ్మిదో రోజు వేడుకలివే..!
-
Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్‌గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
-
Sampath Nandi: శర్వానంద్‌కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
-
TDP : ఏపీలో 7 డిప్యూటీ మేయర్లు, 59 వైస్ చైర్పర్సన్ల జాబితా విడుదల..
-
December 2026 Sun Transit: డిసెంబర్లో సూర్యుడి నక్షత్ర మార్పు.. ఏ రాశులకు డబ్బు, అదృష్టం.?
-
PM Modi: 13 ఏళ్లలో 50 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి..
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!