Off The Record: వాలంటీర్ వ్యవస్థను వైసీపీ లైట్ తీసుకోబోతోందా..?
- కేడర్‌ని గుర్తు పెట్టుకుంటా, ఎందాకైనా వస్తానంటున్న జగన్..
- కార్యకర్తల్ని వదిలేయడం వల్లే నష్టం జరిగిందని స్పష్టత..
- వాలంటీర్ వ్యవస్థ గట్టి దెబ్బేసిందన్న క్లారిటీ..
- జగన్ 2.oలో కేడర్‌కు ప్రాధాన్యం అంటూ అప్‌డేట్స్..
- మళ్ళీ అధికారం అంటూ భరోసా నింపే ప్రయత్నం..
- సూసైడ్ చేసుకున్న కార్యకర్త వర్ధంతితోనే 2.oని మొదలుపెడుతున్నారా?..
- రెంటపాళ్ళ మాజీ ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య..
- పోలీసుల విచారణతో నిరుడు జూన్ 4న ఆత్మహత్య..
- వచ్చేనెల 3న రెంటపాళ్ళకు జగన్, నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ..
- ఇక నేరుగా నేనే వస్తానని సంకేతాలు పంపే ప్రయత్నం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఈ మధ్య కాలంలో కార్యకర్తలతో ఏ సమావేశం నిర్వహించినా వైసీపీ అధినేత జగన్ రిపీట్ చేస్తున్న ఒకే మాట జగనన్న 2.o. ఇక నుంచి కార్యకర్తలకు అగ్రతాంబూలం ఇస్తా.. మీకోసం ఎంతదాకైనా వస్తా….. అందర్నీ గుర్తు పెట్టుకుంటానని కూడా చెప్పుకొస్తున్నారు జగన్. 2019-24 మధ్య అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తల్ని విస్మరించి కేవలం వాలంటీర్స్‌ని నెత్తిన పెట్టుకున్నారన్న విమర్శలున్నాయి. కేడర్ సంగతి మర్చిపోయి… వాళ్ళని నమ్ముకుని ఎన్నికలకు వెళ్ళడం వల్లే దారుణమైన ఫలితాలు వచ్చాయని పార్టీ పోస్ట్‌మార్టంలో తేలినట్టు చెప్పుకుంటున్నారు. వాలంటీర్ వ్యవస్థే దారుణమైన పతనావస్థకు చేర్చిందన్న అభిప్రాయాలు సైతం ఉన్నాయట వైసీపీ పెద్దల్లో. ఈ పరిస్థితుల్లో… ఈసారి కార్యకర్తలకే తొలి ప్రాధాన్యం అంటూ 2.oని పరిచయం చేశారు జగన్. అది ఎలా ఉండబోతోందో… ఒక్కో మీటింగ్‌లో ఒక్కొక్క అప్డేట్ ఇస్తూ వస్తున్నారాయన. జగన్ 2.0 భిన్నంగా ఉంటుందని చెప్పడం వెనుక.. ప్రస్తుతం ఉన్న నాయకులకు భవిష్యత్తుపై భరోసా ఇవ్వటం, తిరిగి అధికారంలోకి వస్తామన్న నమ్మకం కలిగించడమన్న ప్రధాన అజెండా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.
Read Also: JD Vance: ఎలాన్ మస్క్ శకం ముగియలేదు.. ట్రంప్‌కు సలహాలిస్తారు
Also Read
2.oకు కేడర్ నుంచి కూడా మంచి స్పందన వస్తుండటంతో… దానికి సంబంధించిన అప్‌డేట్స్‌ని కూడా పెంచుతున్నారు జగన్. కార్యకర్తలను వేధించిన అధికారులను వదిలి పెట్టబోనని, వారు రిటైరై ఖండాల అవతల ఉన్నా….. తీసుకు వచ్చి బోనులో నిలబెడతామని, మీరు పేర్లు నోట్ చేసుకోమంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ అధ్యక్షుడు. 2.oలో చెబుతున్నవన్నీ… పార్టీ అధికారంలోకి వచ్చాక చేసే పనులు. కానీ… అంతకంటే ముందు ఏం చేయాలన్న విషయంలో కూడా ఫుల్ క్లారిటీకి వచ్చేశారట జగన్. క్షేత్రస్దాయిలో కార్యకర్తలను కలిసేందుకు వస్తానని ఇప్పటికే చెప్పగా…. ప్రస్తుతం ఆ దిశగా అడుగులు పడుతున్నట్టు తెలుస్తోంది. ఆ క్రమంలోనే… వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న కార్యకర్త వర్ధంతికి హాజరై… అక్కడి నుంచే కార్యకర్తల్ని కలిసే ప్రోగ్రాం మొదలు పెట్టాలనుకుంటున్నట్టు సమాచారం. సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళకు చెందిన అప్పటి వైసీపీ ఉప సర్పంచ్ కొర్లకుంట నాగ మల్లేశ్వరరావు మీద గత ఎన్నికల తర్వాత పలు కేసులు బుక్ అయ్యాయి. ఆయన్ని స్టేషన్‌కు పిలిపించి పోలీసులు విచారించడంతో.. మనస్దాపానికి గురై నిరుడు జూన్ 4న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
Read Also: MLA Raja Singh : బక్రీద్ పండుగ ఎలా జరుపుకుంటారో మాకు అనవసరం.. కానీ..
దీంతో… వచ్చేనెల 3న రెంటపాళ్ల వెళ్ళి నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు సిద్ధమవుతున్నారట జగన్. 4న గ్రామంలో వర్ధంతి జరగబోతున్నందున అందుకు ఒకరోజు ముందుగానే గ్రామానికి వెళ్ళడంతో పాటు… నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారట. ఈ చర్య ద్వారా… ఇక నుంచి కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా… తాను డైరెక్ట్‌గా వస్తానన్న సంకేతం పంపాలనుకుంటున్నట్టు సమాచారం. అటు కమ్మ సామాజికవర్గానికి చెందిన నాగమల్లేశ్వరరావు వైసీపీ కోసం గట్టిగా నిలబడటం కూడా నోట్ చేసుకోవాల్సిన అంశమేనని అంటున్నారట వైసీపీ అధ్యక్షుడు. కూటమి సర్కార్ ఏడాది కాలంలో… పెన్షన్లు తప్ప మిగతా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేకపోయిందని, అందుకే ఇక పోరుబాట ఎంచుకోవాలని భావిస్తోందట వైసీపీ అధిష్టానం. మరోసారి పాదయాత్ర ఉంటుందని ఇప్పటికే క్లారిటీ ఇవ్వగా…. వచ్చే ఏడాది ప్లీనరీ తర్వాత ఇక జోరు పెంచాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద 2024 ఓటమి జగన్‌కు కార్యకర్తల విలువ తెలిసివచ్చేలా చేసిందని మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇదే సమయంలో ఇంకో ఆసక్తికరమైన చర్చ కూడా మొదలైంది. వాలంటీర్స్‌ని నెత్తిన పెట్టుకుని నష్టపోయామని ఇప్పటికే క్లారిటీకి రావడం, ఇక నుంచి కేడర్‌కే ప్రధమ ప్రాధాన్యం అంటున్నందున… మళ్ళీ అధికారంలోకి వచ్చినా వాలంటీర్స్‌ని పట్టించుకోరా? ఆ వ్యవస్థకు మంగళం పాడేస్తారా అంటూ క్వశ్చన్ మార్క్ పేస్‌లు పెడుతున్నారు కొందరు. భవిష్యత్ పరిణామాలు ఎలా మారతాయో చూడాలి మరి.
తాజావార్తలు
-
Rohit Sharma Retirement Rumours: లార్డ్స్ వన్డే చివరి మ్యాచ్?.. రోహిత్ శర్మ రిటైర్మెంట్పై బీసీసీఐ క్లారిటీ..!
-
Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’కి ఏ సర్టిఫికేట్.. విడుదలకు ముందే పెరిగిన హైప్
-
Astrology: జూలై 18 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?