Fauji vs Eta: ప్రభాస్ ‘ఫౌజీ’కి బిగ్ టెన్షన్.. హిందీ బెల్ట్‌లో గట్టి పోటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fauji vs Eta: ‘బాహుబలి’, ‘సాహో’, ‘సలార్’, ‘కల్కి 2898 AD’ సినిమాలతో ప్రభాస్ హిందీ మార్కెట్లో తనకంటూ భారీ మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. నార్త్ ఇండియాలో ఆయన సినిమాలకు భారీ ఓపెనింగ్స్ తీసుకురాగల స్టార్‌గా ఎదిగారు. అయితే ఇటీవల ‘ది రాజా సాబ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఇప్పుడు ప్రభాస్ నెక్స్ట్ సినిమాలపై ఆసక్తి మరింత పెరిగింది. ముఖ్యంగా ‘ఫౌజీ’ విషయంలో హిందీ మార్కెట్ పరిస్థితి ఎలా ఉండబోతోందనే విషయం ఆసక్తికరంగా మారింది. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’పై దక్షిణాదిలో బజ్ ఉన్నప్పటికీ, హిందీ బెల్ట్‌లో మాత్రం ప్రస్తుతానికి చెప్పుకోదగ్గ స్థాయిలో హైప్ కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రిలీజ్ కు ముందే ప్రమోషన్స్ ను బలంగా తీసుకెళ్తే ‘ఫౌజీ’కి కలెక్షన్ల పరంగా ఇబ్బంది ఉండకపోవచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
ఇదే సమయంలో డిసెంబర్ మొదటి వారంలో ప్రభాస్ ‘ఫౌజీ’కి పోటీగా శ్రద్ధా కపూర్ నటించిన ‘ఈత’ థియేటర్లలోకి రాబోతోంది. ముందుగా ఈ సినిమా యష్ ‘టాక్సిక్’తో పోటీ పడేలా విడుదల చేయాలని భావించినప్పటికీ, ఆ పోటీని నివారించేందుకు నిర్మాతలు రిలీజ్ డేట్ ను మార్చినట్లు సమాచారం. ఇప్పుడు ‘ఈత’ డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ రెండు సినిమాల మధ్య హిందీ మార్కెట్లో పోటీ ఎలా ఉంటుందన్నదే ఆసక్తికరంగా మారింది. ‘ఈత’పై ఇప్పటికే హిందీ ప్రేక్షకుల్లో సానుకూలమైన బజ్ ఏర్పడినట్లు తెలుస్తోంది. శ్రద్ధా కపూర్‌కు ఉన్న క్రేజ్ కూడా సినిమాకు కలిసొస్తోంది.
Also Read
- Sai Pallavi: డైరెక్టర్ ఇన్పుట్స్ కాదు.. సీతమ్మ ఆశీర్వాదమే ముఖ్యం
- Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ రేట్ల పెంపునకు ఏపీలో గ్రీన్ సిగ్నల్..
- Keerthy Suresh: షూటింగ్లో నన్ను భయపెట్టారు.. తోటి నటులపై కీర్తి సురేష్ సంచలన కామెంట్స్!
- Sai Pallavi: ఖాకీ డ్రెస్సులో సాయి పల్లవి మాస్ లుక్.. ‘ఓం’ గ్లింప్స్‌తో నెట్టింట రచ్చ!
మరోవైపు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ గత సినిమా ‘ఛావా’ భారీ బ్లాక్‌బస్టర్ కావడంతో ‘ఈత’పై అంచనాలు మరింత పెరిగాయి. ప్రముఖ తమాషా కళాకారిణి విఠాబాయి నారాయణగావ్కర్ జీవితం ఆధారంగా ఈ బయోపిక్ రూపొందుతోంది. రణదీప్ హూడా, మహ్మద్ జీషన్ అయ్యూబ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మ్యాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్, లక్ష్మణ్ ఉటేకర్, కరిష్మా శర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కథా నేపథ్యం, దర్శకుడి గత విజయం, శ్రద్ధా కపూర్ క్రేజ్ కలిపి ‘ఈత’కు విడుదలకు ముందే మంచి బజ్ తీసుకొచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే సమయంలో ‘ఫౌజీ’ టీమ్ హిందీ మార్కెట్లో మరింత బలమైన ప్రమోషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే ప్రభాస్‌కు హిందీ ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని తక్కువ అంచనా వేయలేం. ‘బాహుబలి’ నుంచి ‘కల్కి 2898 AD’ వరకు ఆయన సాధించిన బ్లాక్ బస్టర్ లే దీనికి నిదర్శనం. అయితే ప్రతి సినిమా హిట్ కొట్టాలంటే స్టార్ ఇమేజ్ ఒక్కటే సరిపోదని ఇటీవలి రిజల్ట్స్ సూచిస్తున్నాయి. ‘రాజా సాబ్’ లాంటి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరచడంతో మేకర్స్ చురుకుగా ఉంటే మంచిదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ‘ఫౌజీ’ కథ, ప్రభాస్ పాత్ర, హను రాఘవపూడి దర్శకత్వ శైలి వంటి అంశాలు హిందీ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేలా ప్రచారం చేయగలిగితే పరిస్థితి పూర్తిగా మారే అవకాశం ఉంది. మరోవైపు ‘ఈత’ చుట్టూ ఏర్పడుతున్న బజ్‌ను ఎదుర్కోవాలంటే ఫౌజీ ప్రమోషన్స్ మరింత దూకుడుగా ఉండాల్సి ఉంటుంది. డిసెంబర్లో హిందీ బెల్ట్ రెండు ఆసక్తికరమైన సినిమాల పోటీకి వేదికగా మారనుండగా, ఈ పోరులో ప్రభాస్ తన మాస్ ఇమేజ్ను మరోసారి ఎంతవరకు నిలబెట్టుకుంటారో చూడాలి.
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..