అనుకుంటాంగానీ..., రాజకీయాల్లోనే సెంటిమెంట్లు ఎక్కువగా పండుతుంటాయి. ఒక్కసారి నెగెటివిటీ డవలప్ అయితే చాలు... ఎంత ఉన్నత పదవి అయినా... తీసుకోవడానికి భయపడుతుంటారు నాయకులు. సరిగ్గా అటువంటిదే ఇప్పుడు వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీని వెంటాడుతోందట. ఆ సీటే అత్యంత కీలకమైన విశాఖ జిల్లా అధ్యక్షపదవి. ఆరు అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో పార్టీ మీద అధ్యక్షుడిదే ఆజమాయిషీ. అధికారంలో వుంటే ఎమ్మెల్యేలతో సమానంగా... ఆ మాటకొస్తే... ఇంకాస్త ఎక్కువే గౌరవం లభిస్తుంది.
ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని సింహాచలం పుణ్యక్షేత్రంలో నేటి నుంచి సింహగిరి ప్రదక్షిణలు జరగనున్నాయి. ఈ సందర్భంగా కొండ చుట్టూ 32 కి.మీ.మేర భక్తులు ప్రదక్షిణ చేస్తారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జరిగే ఈ గిరి ప్రదక్షిణలో దాదాపు 4 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉంది. వారికి ఇబ్బంది కలగకుండా అధికారులు పలు చోట్ల మంచినీరు, మెడికల్ క్యాంపులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3…
విశాఖ జిల్లా సమీక్షా సమావేశంలో ఇంఛార్జి మంత్రి, వైద్యశాఖ మంత్రి విడదల రజినీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లా సమీక్షా సమావేశంలో 9 అంశాలపై చర్చ జరిగిందన్నారు. జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, రోడ్లు, టూరిజం, నగర అభివృద్ధి, పారిశుధ్యం, వీధి లైట్లు, ఆరోగ్యం, నాడు-నేడు పనులపై సమీక్ష జరిగిందని తెలిపారు. విశాఖ జిల్లా అంటే సీఎం జగన్‌కు ప్రత్యేకమైన అభిమానం అని మంత్రి విడదల రజినీ పేర్కొన్నారు. ఎక్కడ జరగని అభివృద్ధి పనులు విశాఖ జిల్లాలో…
విశాఖ జిల్లా పెందుర్తి మండలం సత్తివానిపాలెంలో రెవెన్యూ అధికారులపై వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. రేవళ్ల చెరువులో 10 ఎకరాల భూబి ఆక్రమణకు గురైన విషయం అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో పెందుర్తి ఆర్ఐ శివ కుమార్, గ్రామ సచివాలయ కార్యదర్శి వెంకటేష్ ఆక్రమణకు గురైన భూమిని పరిశీలించారు. వెంటనే జేసీబీలతో వెళ్లి ఆక్రమణలను తొలిగించే ప్రయత్నం చేశారు. దీనిపై ఆగ్రహించిన వైసీపీ నేతలు పెందుర్తి ఆర్ఐ శివ కుమార్, గ్రామ సచివాలయ కార్యదర్శి వెంకటేష్‌పై దాడికి…
విశాఖ జిల్లా వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు సొంత పార్టీ కార్యకర్తల నుంచే అసమ్మతి సెగ ఎదురైంది. పాయకరావుపేట మండలం రాజవరం గ్రామంలో మంచినీటి పైపులైన్ ప్రారంభించడానికి వెళ్లిన ఎమ్మెల్యే గొల్ల బాబూరావును వైసీపీ కార్యకర్తలు అడ్డుకుని గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. జగన్ ముద్దు- ఎమ్మెల్యే వద్దు అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. అనంతరం ఎమ్మెల్యే కారుకు అడ్డంగా రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఎమ్మెల్యే మద్దతుదారులు, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. Read…
విశాఖ జిల్లా అరకు వెళ్లే రైలు మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. కొత్తవలస-కిరండోల్ మార్గంలో చిమిడిపల్లి 66వ కి.మీ. వద్ద కొండ రాళ్లు జారి రైల్వే ట్రాక్‌పై పడ్డాయి. విద్యుత్ లైన్‌పైనా బండ రాళ్లు పడటంతో విద్యుత్ వైర్లు తెగిపడిపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు కొండరాళ్లను తొలగించేందుకు తక్షణ సహాయక చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కొత్తవలస-కిరండోల్ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అరకు, బొర్రా గుహలు వెళ్లేందుకు పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు…