Off The Record: అమ్మ పుట్టిల్లు గురించి మేనమామకు ఎరుక అన్నట్టు.. ఏకంగా టీడీపీ ఇంచార్జి వ్యవహారాలన్నీ..
- టీడీపీ ఇన్ఛార్జ్ సుగుణమ్మపై తీవ్ర ఆరోపణలు..
- సొంత పార్టీ నేతలే రివర్స్ అవడంపై హాట్ హాట్ చర్చ..
- తాతయ్యగుంట గంగమ్మ ఆలయ పాలక మండలి నియామకం..
- పార్టీ పెద్దల ఎంపికలు సుగుణమ్మకు నచ్చలేదా?..
- వైసీపీ వాళ్ళకు పదవులు అంటూ సుగుణమ్మ వర్గం ప్రచారం?..
- సుగుణమ్మ, ఆమె అల్లుడి అక్రమాలంటూ కేడర్ ఫైర్..
- కార్పొరేషన్ ఎలక్షన్లో ఏడు కోట్లు తీసుకున్నారంటూ బాంబ్..
- సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్న టీడీపీ నాయకులు..
- తిరుపతి వైసీపీ నేతల అక్రమాలపై ఎందుకు మాట్లాడ్డం లేదని నిలదీత..
- పెద్దిరెడ్డి కంపెనీ నుంచి రూ.25 లక్షలు ఎలా వచ్చాయని ప్రశ్నలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలుగుదేశం పార్టీ కంచుకోట తిరుపతి. ఇక్కడ ఎన్నికలు ఎప్పుడు జరిగినా… ఆ పార్టీదే పైచేయి అన్నట్టుగా ఉంటుంది. కానీ… గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంతో కలిసి పనిచేసిన తమ్ముళ్లు భారీ మెజారిటీతో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను గెలిపించుకున్నారు. ఇక అప్పటినుంచి టెంపుల్ సిటీ టీడీపీ సీన్ మారిందని అంటున్నారు తమ్ముళ్లు. ముఖ్యంగా ఇన్చార్జ్ సుగుణమ్మకు రాష్ట్రస్థాయిలో చైర్మన్ పదవి ఇచ్చినప్పటికీ ఆమె తీరు మాత్రం మారలేదన్నది లోకల్ టీడీపీ నేతల మాట. దీంతో… ఇన్నాళ్ళు ఓపిగ్గా ఉన్న తమ్ముళ్ళు ఇప్పుడు మాత్రం ఓ రేంజ్లో ఆమె మీద రివర్స్ ఎటాక్ చేయడం కలకలం రేపుతోంది. తాజాగా తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయ పాలకమండలిని నియమించారు. ఛైర్మన్ సహా.. సభ్యులను పార్టీ పెద్దలు వడపోసి కూటమి పార్టీ నేతలకీ సమన్యాయం జరిగేలా నిర్ణయం తీసుకున్నారు. పార్టీ యువనేత మహేష్ యాదవ్ అలియాస్ మక్కి ఛైర్మన్గా 11మంది సభ్యుతో పాలకమండలి నియమించారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమం కూడా ముగిసింది.
Read Also: Affair Murder: మొగిడి ప్రాణాలు తీస్తున్న మోజు.. దారుణంగా కొంత మంది భార్యల తీరు
Also Read
- OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
- OTR: నాగర్కర్నూల్ కాంగ్రెస్లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
అయితే… ఈ ఎంపిక మాత్రం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న సుగుణమ్మకు నచ్చలేదట… ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పకపోయినా, ఏదో జరిగిపోయినట్టుగా తన అనుచరుల దగ్గర మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. అన్యాయం జరిగిందంటూ వరుసగా నిరసనలు, ప్రెస్ మీట్ లు పెట్టించి స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల పైన,పార్టీ పెద్దల మీద విమర్శలు చేయించడంతో పాటు కూటమి ప్రభుత్వంలో వైసిపి నేతలకు పదవులంటూ ఆరోపణలు చేయిస్తున్నారన్న ప్రచారం నియోజకవర్గంలో హాట్ టాపిక్ అయింది. దీంతో…ఇక లాభం లేదనుకుని ఇన్నాళ్ళు మౌనంగా ఉన్న నేతలు, కార్యకర్తలందరూ ఓ రేంజ్ లో సుగుణమ్మను బహిరంగంగాను, సోషియల్ మీడియాలోను విమర్శిస్తున్నారు. కేవలం మాటలతో సరిపెట్టకుండా… ఆధారాలతో సహా… గత పదేళ్ళుగా సుగుణమ్మ,అమె అల్లుడు సంజయ్ చేసిన అక్రమాలను బయటపెడుతున్నారట. ప్రతిపక్షంలో ఉండగా అప్పటి మున్సిపల్ ఎలక్షన్ లో జిల్లా నేతలు పెద్దిరెడ్డితో, కరుణాకర్ రెడ్డి తో డైరెక్ట్ గా ఒప్పందం కుదుర్చుకుని అభ్యర్థులను విత్ డ్రా చేయించింది నిజమా కాదా? కార్పొరేషన్ ఎలక్షన్లో వైసిపి నుంచి ఏడు కోట్లు తీసుకున్నది నిజమా కాదా? తన మనవరాలు కీర్తిని సైతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటికి తీసుకెళ్లి కాళ్లకు నమస్కారం పెట్టిచ్చి ఆశీర్వదించమని అభ్యర్థించిన విషయం జగమెరిగిన సత్యమే కదా అంటూ సోషల్ మీడియాలో తమ నాయకురాలిని ఓ రేంజ్లో ఆడేసుకుంటున్నారు టీడీరీ కార్యకర్తలు. టీడీపీలో ఉంటూ వైసీపీ కోసం పని చేసిన సుగుణమ్మ ఇప్పుడు మరో డ్రామా తెర తీశారంటూ ఓరేంజ్లో ఫైర్ అవుతున్నారు.
Read Also: The Great Pre Wedding Show : ఆసక్తికరంగా ‘ది గ్రేట్ వెడ్డింగ్ షో’ టీజర్
అసలు సుగుణమ్మకు వైసీపీ బంధం లేకుంటే… తిరుపతి టి డి ఆర్ బాండ్ల కుంభకోణం గురించి ఎందుకు మెదపడం లేదన్నది కేడర్ క్వశ్చన్. కొండమీద జరిగిన కుంభకోణంలో కరుణాకర్ రెడ్డిని సుగుణమ్మ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా ఆమె… వైసీపీకి బానిసగానే పనిచేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నారు తిరుపతి తమ్ముళ్లు. గోశాల నుండి రోజుకో వివాదాన్ని భూమన తెరపైకి తెస్తున్నా… ఏ ఒక్క రోజైనా సుగుణమ్మ మాట్లాడారా అంటూ ప్రశ్నిస్తున్నారు. అక్కడితో ఆగకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీ నుంచి సుగుణమ్మ 25 లక్షల రూపాయలు ఎందుకు తీసుకున్నారో చెప్పాలంటూ….ఆమె పాత ఎలక్షన్ అఫిడివిట్ను బయటపెట్టారు. ఇంచార్జ్ వర్సెస్ లీడర్స్ మాట అటు ఉంచితే ఆమె అంతలా వారికి పదవి రాకుండా ఉండాలని ప్రయత్నాలు చేయడానికి కారణం వేరొకటి ఉందని ప్రచారం జరుగుతోంది. గంగమ్మ గుడి చైర్మన్ పదవి ఇప్పిస్తానని స్థానిక నాయకుడి నుంచి సుగుణమ్మ 20 లక్షల రూపాయలు తీసుకున్నారన్న ప్రచారం కలకలం రేపుతోంది. ఇప్పుడా వ్యక్తికి కాకుండా వేరొకరికి పోస్ట్ దక్కడంతో… ఆమె మండిపోతూ వ్యతిరేక ప్రచారం చేయిస్తున్నారన్నది ప్రత్యర్థుల ఆరోపణ. అందుకే ఇక లాభం లేదనే ఉద్దేశంతోనే డైరెక్ట్ వార్కి దిగినట్టు చెప్పుకుంటున్నారు. ఈ వ్యవహారంపై సుగుణమ్మను మౌనంగా ఉండమని చెప్పినప్పటికీ తన అనుచరులతో ప్రెస్ మీట్ లో ధర్నాలు చేయించడంపై పార్టీ పెద్దలు ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. మొత్తానికి పదవుల పంపకం తిరుపతి తమ్ముళ్ళను రోడ్డుమీదకు వచ్చేలా చేసింది. దీని మీద పార్టీ పెద్దలు ఎలా స్పందిస్తోరో చూడాలి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..