తెలుగుదేశం పార్టీ కంచుకోట తిరుపతి. ఇక్కడ ఎన్నికలు ఎప్పుడు జరిగినా... ఆ పార్టీదే పైచేయి అన్నట్టుగా ఉంటుంది. కానీ... గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంతో కలిసి పనిచేసిన తమ్ముళ్లు భారీ మెజారిటీతో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను గెలిపించుకున్నారు. ఇక అప్పటినుంచి టెంపుల్ సిటీ టీడీపీ సీన్ మారిందని అంటున్నారు తమ్ముళ్లు.
Off The Record: ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో టిడిపికి ఎంతో సెంటిమెంటుతో కూడుకున్న నియోజకవర్గం. పార్టీ పెట్టిన తొలినాళ్లలో ఎన్టీఆర్.. ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు. పార్టీకి అంత బలమైన కేడర్ ఉంది. గత ఎన్నికల్లో జిల్లాలోని ప్రతి ఒక్క నియోజకవర్గంలో 40 వేల మెజారిటీతో ఓడిపోతే…తిరుపతిలో ఎనిమిది వందల ఓట్ల తేడాతో సీటు కోల్పోయింది టీడీపీజ అప్పటి నుంచి వరుసగా ఓటములను చవిచూస్తోంది. మున్సిపల్ ఎన్నికలలో కనీసం సగం డివిజన్లలో పోటీ చేయలేని స్థితిలోకి…