Off The Record: ఎమ్మెల్సీ కవిత మరోసారి బీఆర్ఎస్ని ఇరకాటంలో పడేసిందా..?
- పొలిటికల్ బిర్యానీ ఉడికించిన ఎమ్మెల్సీ కవిత..
- ఉద్యమ సమయంలో కేసీఆర్ మాటల్ని ఎండార్స్ చేసిన ఎమ్మెల్సీ..
- ఆంధ్రా బిర్యానీపై నాడు కేసీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలంటూ నిరసనలు..
- విభజన తర్వాత సోదర భావంతో రెండు రాష్ట్రాల ప్రజలు..
- ఇప్పుడు కవిత ఆంధ్రా బిర్యానీ వ్యాఖ్యలపై రచ్చ రచ్చ..
- బనకచర్ల ప్రాజెక్ట్ గురించి మాట్లాడిన కవిత..
- అందులో భాగంగానే.. కేసీఆర్ పాత వ్యాఖ్యల ప్రస్తావన..
- కవిత బిర్యానీ రివ్యూలు చేస్తున్నారా అని ప్రశ్నలు..
- ఒక ప్రాంతాన్ని అవమానించి ఏం సాధిస్తారని క్వశ్చన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: మరోసారి తెలంగాణలో ఆంధ్రా బిర్యానీని ఉడికించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రా ప్రాంత వంటకాలను, అలవాట్లను ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎండార్స్ చేస్తూ కవిత తాజాగా వ్యాఖ్యలు చేయడం కొత్త చర్చకు దారితీసింది. ఉద్యమకారులను ఉద్దేశించి ఆనాడు కేసీఆర్ మాట్లాడుతూ… ఆంధ్రా ప్రాంతంలో వండే బిర్యానీని పేడతో పోల్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో కేసీఆర్ మాటల్ని ఆంధ్రా ప్రాంత ప్రజలు, నేతలు తీవ్రంగా నిరసించారు. సోషల్ మీడియాలో ఫైరైపోయారు. అయితే… అదంతా గతం. రెండు రాష్ట్రాలు అయ్యాక… ఆ గతాన్ని మర్చిపోయి… అంతా సోదర భావంతో మెలుగుతున్నారు. రాజకీయాల కోసం తప్ప… సాధారణ ప్రజలెవరూ మీరు, మేము అని మాట్లాడుకోవడం లేదు. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య అంత సుహృద్భావ వాతావరణం పెరిగిన క్రమంలో… ఇప్పుడు… ఆంధ్రా బిర్యానీ అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు మరోసారి రచ్చరచ్చ అవుతున్నాయి.
Read Also: AP Liquor Scam Case: లిక్కర్ కేసు.. వారి విదేశీ పర్యటనపై సిట్ ఫోకస్..
Also Read
- OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
బనకచర్ల ప్రాజెక్ట్ పై మాట్లాడిన కవిత… చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి బిర్యానీ పెట్టి మరీ… క్లియరెన్స్ ఇచ్చారని అన్నారు. ఈ క్రమంలోనే… దానికి కొనసాగింపుగా మాట్లాడుతూ… ఆంధ్రా బిర్యానీ ఎలా ఉంటుందో గతంలో కేసీఆర్ చెప్పారంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారామె. ఎవరి బతుకు వారు బతుకుతూ… హాయిగా కలిసిమెలిసి ఉన్న టైంలో కవిత అలా మాట్లాడ్డం ఏంటంటూ తీవ్ర దుమారం రేగుతోంది. ఆమె వ్యాఖ్యలను ఖండించారు బిజెపి నేత విష్ణువర్దన్‌రెడ్డి. కవిత రాజకీయాలు మానేసి ఇప్పుడు బిర్యానీ రివ్యూలు చేస్తున్నారా? ఆంధ్రా తెలంగాణ పేరుతో ప్రజలను ఇంకా ఎన్నాళ్ళని అలా విడదీసి రాజకీయం చేస్తారు? ఆంధ్రా వాళ్ళంటే మీకు ఎందుకంత చులకన భావం? ఒక ప్రాంతాన్ని అవమానించి మీరు సాధించేది ఏమిటి? అంటూ ట్విట్టర్లో స్ట్రాంగ్‌గానే ప్రశ్నించారు విష్ణువర్ధన్‌రెడ్డి. దీంతో ఇప్పుడు కవిత చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆంధ్ర ప్రాంత వాసులను, అక్కడి వంటకాలను కించపరిచే విధంగా ఉన్న వ్యాఖ్యల్ని అసలు కవిత ఇప్పుడెందుకు గుర్తు చేయాల్సిన అవసరం వచ్చిందంటూ పార్టీలో చర్చించుకుంటున్నారట.
Read Also: TEJESHWAR Case: గద్వాల తేజేశ్వర్ మర్డర్ కేసు.. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి..
ప్రతిపక్షంలో ఉన్న ఈ టైంలో ఆ విషయాలను తిరగదోడటం పార్టీ మొత్తాన్ని ఇబ్బంది పెట్టే అంశం అంటున్నారు చాలామంది గులాబీ నేతలు. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని కవిత అన్న తరువాత బిఆర్ఎస్ నేతలు ఆమెతో దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో…. మళ్ళీ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేలా మాట్లాడ్డం వెనక వ్యూహం ఉందా? లేదా రొటిన్‌గానే ఆమె అలా అన్నారా? అనేది తేలాల్సి ఉంది. త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఒకవైపు, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలు మరోవైపు జరగబోతున్నాయి. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడ్డ ఓటర్లు ఎక్కువమంది హైదరాబాద్‌లో ఉంటారు. ఇంకా చెప్పాలంటే… మెజార్టీ డివిజన్స్‌లో వాళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇలాంటి సమయంలో కవిత మరోసారి కేసీఆర్ ఉద్యమ సమయంలో చేసిన వ్యాఖ్యలు గుర్తు చేయడం ద్వారా… పార్టీకి నష్టం జరుగుతుందా అని చర్చించుకుంటున్నారట బీఆర్ఎస్ నేతలు.
తాజావార్తలు
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఈ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు.. మరి ఏం చేయాలి?
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
-
Supreme Court: “సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి”.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
-
Shai Hope: 244 టార్గెట్ సరిపోదనుకున్నాను.. అక్కడే మలుపు తిరిగింది: వెస్టిండీస్ కెప్టెన్
-
Shreyas Iyer: మా వ్యూహం దెబ్బతిన్నది.. అదే కొంపముంచింది..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..