మరోసారి తెలంగాణలో ఆంధ్రా బిర్యానీని ఉడికించారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రా ప్రాంత వంటకాలను, అలవాట్లను ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎండార్స్ చేస్తూ కవిత తాజాగా వ్యాఖ్యలు చేయడం కొత్త చర్చకు దారితీసింది. ఉద్యమకారులను ఉద్దేశించి ఆనాడు కేసీఆర్ మాట్లాడుతూ... ఆంధ్రా ప్రాంతంలో వండే బిర్యానీని పేడతో పోల్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో కేసీఆర్ మాటల్ని ఆంధ్రా ప్రాంత ప్రజలు, నేతలు తీవ్రంగా నిరసించారు. సోషల్ మీడి