Varanasi: ‘వారణాసి’పై జక్కన్న మరో క్రేజీ ప్లాన్.. షూటింగ్ వెనుక సీక్రెట్స్ అన్నీ బయట పెడతాడట?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varanasi: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’. ఈ చిత్రంపై సాధారణ ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో భారీ స్కేల్లో రూపొందుతున్న ఈ సినిమా మేకింగ్ వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను ప్రేక్షకులకు చూపించేందుకు ప్రత్యేకంగా ఓ డాక్యుమెంటరీని రూపొందిస్తున్నట్లు సమాచారం. ‘వారణాసి’ కోసం భారీ యాక్షన్ సన్నివేశాలు, గ్రాండ్ సెట్స్‌తో పాటు అత్యాధునిక సాంకేతికతను మేకర్స్ వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రియల్ యానిమల్స్‌తో చిత్రీకరిస్తున్న క్లిష్టమైన సన్నివేశాల కోసం చిత్రబృందం చేస్తున్న కృషి కూడా ఈ మేకింగ్ డాక్యుమెంటరీలో చూపించనున్నట్లు టాక్. షూటింగ్ టైంలో చోటుచేసుకున్న ఆసక్తికర ఘటనలు, భారీ సన్నివేశాల రూపకల్పన, నటీనటులు, సాంకేతిక నిపుణుల శ్రమ వంటి అంశాలను ఈ డాక్యుమెంటరీలో పొందుపరిచే అవకాశం ఉందట.
ఈ డాక్యుమెంటరీకి ప్రముఖ డాక్యుమెంటరీ డైరెక్టర్ గోగితా చిక్వైడ్జే పనిచేస్తున్నట్లు IMDbలోని వివరాల ఆధారంగా వార్తలు వెలువడ్డాయి. అయితే దీనిపై ‘వారణాసి’ చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అంతర్జాతీయ స్థాయి నిర్మాణ ప్రక్రియను ప్రేక్షకులకు పరిచయం చేసేలా ఈ డాక్యుమెంటరీని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం సినిమా రిలీజ్ సమయంలోనే కాకుండా.. ప్రమోషనల్ కంటెంట్‌గా లేదా మూవీ రిలీజ్ తర్వాత ప్రత్యేక ఫీచర్‌గా ఈ డాక్యుమెంటరీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు టాక్. ఈ సినిమా వెనుక పనిచేస్తున్న నటీనటులు, సాంకేతిక నిపుణుల కృషిని ప్రేక్షకులకు మరింత దగ్గరగా చూపించడమే దీని ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. మహేశ్‌బాబు–జక్కన్న కాంబినేషన్లో తెరకెక్కుతున్న తొలి సినిమా కావడంతో ‘వారణాసి’పై ఇప్పటికే భారీ క్రేజ్ నెలకొంది. ఇప్పుడు ఈ సినిమా మేకింగ్‌పైనే ప్రత్యేక డాక్యుమెంటరీ రూపొందిస్తున్నారనే వార్త ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తిని మరింత పెంచుతోంది. అయితే ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.
Also Read
- Pan India Star: పాన్ ఇండియా కూడా పాతదైపోయిందా? హీరోలకు నెక్ట్స్ ట్యాగ్ ఏంటి?
- Tollywood vs Kollywood: తెలుగు గడ్డపై తమిళ హీరోల జోరు.. మరి కోలీవుడ్‌లో తెలుగు సినిమాల పరిస్థితి దారుణమా?
- Pournami Song: డార్లింగ్ ప్రభాస్ ‘పౌర్ణమి’ పాటకు గ్లోబల్ క్రేజ్.. చైనీస్ డ్యాన్సర్ కూచిపూడి పెర్ఫార్మెన్స్ వైరల్!
- Vaishnavi: మా ఎపిక్ బోల్డ్ కంటెంటే.. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు!
తాజావార్తలు
-
PMO Fake ID Case: ప్రధాని భద్రతలో కలకలం.. ఫేక్ PMO ఐడీ కేసులో ట్విస్ట్..
-
Redmi Smart Phone: 1.5K AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీ.. రెడ్ మీ నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్..
-
Pan India Star: పాన్ ఇండియా కూడా పాతదైపోయిందా? హీరోలకు నెక్ట్స్ ట్యాగ్ ఏంటి?
-
Minister Satya Kumar: కొత్త పార్టీ పెట్టుకో.. కానీ ముందు ప్రజలకు ఆ లెక్క చెప్పు..
-
KTR : రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ సంచలన కామెంట్స్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!