Off The Record: వనపర్తి కాంగ్రెస్‌లో రగులుతున్న లొల్లి! ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన చిన్నారెడ్డి
- ఎడతెగని వనపర్తి కాంగ్రెస్ పంచాయితీ..
- ఎమ్మెల్యే మేఘారెడ్డి, చిన్నారెడ్డి వర్గాలుగా విడిపోయిన పార్టీ..
- తాజాగా చాలా పెద్ద బాంబ్ పేల్చిన చిన్నారెడ్డి ..
- తనకు దక్కాల్సిన సీటును అమ్ముకున్నారని ఆరోపణ..
- కోట్లు పెట్టి బీ ఫామ్ ఎగరేసుకునిపోయారంటూ ఎమ్మెల్యే మీద ఫైర్..
- సౌమ్యంగా ఉండే చిన్నారెడ్డి ఎందుకింత వైల్డ్‌గా రియాక్ట్ అయ్యారు?..
- క్రమశిక్షణ కమిటీకి, ఏఐసీసీకి ఫిర్యాదు చేస్తానంటున్న ఎమ్మెల్యే..
- దగ్గర పడుతున్న ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవీకాలం..
- రెన్యువల్ చేయించుకునే ఎత్తుగడలో భాగమేనా అంటూ కొత్త డౌట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి గత అసెంబ్లీ ఎన్నికల్లో మొదట చిన్నారెడ్డి పేరును ఖరారు చేసి… ఆ తర్వాత గెలుపు గుర్రంగా భావించి మేఘారెడ్డిని ఫైనల్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. తగ్గట్టే ఆయన విజయం సాధించారు కూడా. ఇక ఆ తర్వాతి నుంచి వనపర్తి కాంగ్రెస్ చిన్నారెడ్డి, మేఘారెడ్డి వర్గాలుగా చీలిపోయింది. అప్పుడు రాజుకున్న అగ్గి రగులుతూనే ఉంది. అయితే… రెండేళ్ల కిందట చిన్నారెడ్డికి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా కేబినెట్ హోదా కల్పించింది ప్రభుత్వం. దీంతో వర్గపోరుకు ప్రోటోకాల్ వివాదం తోడైంది. ఈ రచ్చకు చికిత్స చేసేందుకు అధిష్టానం పెద్దలు ప్రయత్నించినప్పటికీ ఎలాంటి ఫలితాలు లేవు. అయితే ఇటీవల వనపర్తి కాంగ్రెస్ నేతలంతా ఒక్క తాటి మీదికి వచ్చినట్టు కనిపించింది. వివాదాలకు పుల్‌స్టాప్ పడిందని అందరూ భావిస్తున్న టైంలో…. చిన్నన్న చాలా పెద్ద బాంబ్ పేల్చడంతో కాంగ్రెస్‌లో ప్రకంపనలు రేగుతున్నాయి. ఆ ప్రకంపనలు వనపర్తి కాంగ్రెస్‌తో పాటు గాంధీభవన్‌ను కూడా షేక్ చేస్తున్నాయన్నది రాజకీయవర్గాల అంచనా. తాజాగా గోపాలపేటలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు… సొంత పార్టీ వ్యవహారంతో పాటు, ఎమ్మెల్యే మేఘారెడ్డి పై విరుచుకుపడ్డాడు. వనపర్తిలో కాంగ్రెస్ పార్టీని అవినీతిమయంగా మార్చారంటూ ధ్వజమెత్తారు.
అధిష్టానం చెప్పినా ఇవ్వకుండా… తనకు దక్కాల్సిన సీటును అమ్ముకున్నారని అటు పార్టీ ముఖ్యులను, తనకు దక్కాల్సిన బీ ఫామ్‌ను కోట్లు పెట్టి ఎగరేసుకు పోయారంటూ ఇటు మేఘారెడ్డిని ఏకకాలంలో టార్గెట్ చేశారు చిన్నారెడ్డి. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా తన 48 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని ఒక్క వేటుతో పడేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను అవినీతి లేకుండా రాజకీయం చేశానని… పార్టీలో అనేక తప్పులు చేస్తున్నా భరిస్తున్నానని లేదంటే …. మరో జీవన్ రెడ్డిని కావాల్సి వస్తుందంటూ హెచ్చరించారాయన. వనపర్తి కాంగ్రెస్ నిర్మాణం కోసం సర్వం త్యాగం చేశానని అన్నారు. అభివృద్ధి పనుల మాటున అవినీతికి తెరలేపారంటూ సొంత పార్టీ ఎమ్మెల్యే మీదే విరుచుకుపడ్డారు చిన్నారెడ్డి. గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మేఘారెడ్డి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని కూడా ఆరోపించారు. ఇప్పుడిదే పాలమూరు పాలిటిక్స్‌ను షేక్ చేస్తోంది. సాధారణంగా సౌమ్యంగా ఉండే చిన్నన్న ఇలాంటి ఘాటు వ్యాఖ్యలతో రియాక్ట్ అవడం ఏంటి? గేమ్ మారుస్తున్నారా అంటూ రకరకాల కోణాల్లో ఆరా తీస్తున్నాయి రాజకీయ వర్గాలు. ఇదిలా ఉంటే చిన్నారెడ్డి కామెంట్స్‌పై ఎమ్మెల్యే మేఘా రెడ్డి & టీమ్ భగ్గుమంటోంది. ఇప్పటికి 8 సార్లు ఎమ్మెల్యేగా బీ ఫామ్ పొందిన చిన్నారెడ్డి.. అన్ని సార్లు కలిపి ఎన్నికోట్లు ఇచ్చారో తేల్చాలని డిమాండ్ చేస్తోంది.
Also Read
BRSతో అంటకాగుతూ, వారి పనులు చేసేది చిన్నరెడ్డేనని… ఆయన పార్టీ లైన్ లో లేకుండా క్రమశిక్షణ తప్పారంటూ మండి పడుతున్నారు శాసనసభ్యుడు.48 ఏళ్ళ అనుభవం ఇదేనా… నేను చేసిన అవినీతి ఏంటో నిరూపించాలని సవాల్ విసురుతున్నారు మేఘారెడ్డి. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడి మీద పార్టీ క్రమశిక్షణ కమిటీతో పాటు, పీసీసీ, సీఎం, ఏఐసీసీ పెద్దలకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. విపక్షానికి ఊతమిచ్చేలా మొదటి నుంచి చిన్నారెడ్డి వ్యవహార శైలి ఉందని… పలు ఉదాహరణలతో ఎండగడుతోంది ఎమ్మెల్యే టీమ్. అయితే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవీ కాలం దగ్గర పడటంతో దాన్ని రెన్యువల్ చేయించుకునే ఎత్తుగడలో భాగంగానే చిన్నారెడ్డి అలా మాట్లాడి ఉండవచ్చన్నది కొందరు విశ్లేషణ. మొత్తం మీద వనపర్తి కాంగ్రెస్‌లో పీక్స్‌కు చేరిన వర్గ పోరు పార్టీ పెద్దలకు తల నొప్పిగా మారుతోందంటున్నారు. కరవ మంటే కప్పకు కోపం, విడవ మంటే పాముకు కోపం అన్నట్టు మారిన ఈ పంచాయితీని పార్టీ పెద్దలు ఎలా డీల్ చేస్తారు? ఎలా డ్యామేజ్ కంట్రోల్ చేస్తారన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.
తాజావార్తలు
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
-
Supreme Court: “ఇక బండి సీజ్”.. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
-
Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?