వైసీపీ మాజీ మంత్రి, టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే... గుమ్మనూరు జయరాం, ఆయన కుటుంబ సభ్యుల వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటోంది. పార్టీలు మారినా... వాళ్ళ వివాదాస్పద తీరు మాత్రం మారదా అన్న చర్చలు నడుస్తున్నాయి రాజకీయ వర్గాల్లో. నిత్య వివాదం లేకుంటే వీళ్ళకు నిద్ర పట్టదా అని కూడా మాట్లాడుకుంటున్నారట.
రెడ్ బుక్.... ఏపీ పాలిటిక్స్‌లో ఇదో హాట్ సబ్జెక్ట్. దీనికి సంబంధించే అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య తరచూ ఆరోపణలు, సవాళ్ళ పర్వం నడుస్తూ ఉంటుంది. మంత్రి లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రెడ్‌బుక్ ఓపెన్ చేస్తే... ఇప్పుడు టీడీపీ నాయకులు కొందరు లోకల్ బుక్స్‌ని ఓపెన్ చేసేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. పైగా... లోకేష్ తన రెడ్‌బుక్‌ని క్లోజ్ చేసినా... నేను మాత్రం సంగతి తేలేదాకా మూసే ప్రసక్తే లేదని అంటున్నారట గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం.
గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో కాస్తా.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. తనపై చేసిన ఆరోపణలు నిరూపించే దమ్ముంటే వార్తలు రాయాలని సవాల్ విసిరిన జయరాం.. ఎవడో డబ్బులు ఇస్తాడని.. అమ్ముడుపోయి రాతలు రాస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు..
ఆలూ లేదు చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఉంది ఆ మాజీ మంత్రి వ్యవహారం. పార్టీ మారిన గంటల్లోనే తనకు ఫలానా అసెంబ్లీ టిక్కెట్ ఫిక్స్ అంటూ సొంతగా ప్రకటించేసుకున్నారు. ఆ ప్రకటన విన్నాక అక్కడి టీడీపీ లీడర్స్‌కు కిందా మీదా కాలిపోతోందట. ఇన్నాళ్ళు తన్నులు తిన్నది మేము, ఖర్చుపెట్టింది మేము, ఇప్పడొచ్చి ఈయనగారి హంగామా ఏంటని రగిలిపోతున్నారట. కాలు పెట్టిన రోజే కాక రేపిన ఆ నాయకుడు ఎవరు? ఏమా కథ? గుమ్మనూరు…
జయహో బీసీ సభ వేదికగా తెలుగుదేశం పార్టీలో చేరిన మంత్రి గుమ్మనూరు జయరాంపై వేటు వేసింది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. కేబినెట్ నుంచి జయరాంను బర్తరఫ్ చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..
మంత్రి పదవితో పాటు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గుమ్మనూరు జయరాం.. ఈ రోజు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ హాజరైన జయహో బీసీ సభకు హాజరైన ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు.. ఇక, టీడీపీలో చేరినందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు జయరాం.. గతంలో టీడీపీలో పని చేశాను.. మళ్లీ టీడీపీలో చేరినందుకు సంతోషంగా ఉందన్నారు..
Kurnool MP Candidate: మంత్రి గుమ్మనూరు జయరాంకు వైసీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా మేయర్ బీవై రామయ్యను ఖరారు చేసింది. ఇప్పటికే ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థిగా బుట్టా రేణుకను ఖరారు చేసింది. శనివారం ఈ రెండు స్థానాలను వైసీపీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినా.. విముఖత చూపిన కారణంగానే గుమ్మనూరు జయరాంకు వైసీపీ మంగళం పాడేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ముందుగా గుమ్మనూరు జయరాంను వైసీపీ…
YCP Minister Jairam Vs MLA Sai Prasad Reddy ఆ ఇద్దరూ అధికారపార్టీ నేతలే. ఒకరు మంత్రి.. ఇంకొకరు సీనియర్ ఎమ్మెల్యే. మినిస్టర్‌తో విభేదిస్తున్న వారికి ఎమ్మెల్యే అండగా ఉంటున్నారట. ఈ క్రమంలో జరుగుతున్న పరిణామాలు ఇద్దరి మధ్య కోల్డ్‌వార్‌ను పీక్స్‌కు తీసుకెళ్తోందట. అదెలాగో ఈ స్టోరీలో చూద్దాం. గుమ్మనూరు జయరాం. ఏపీ మంత్రి. సాయిప్రసాదరెడ్డి.. ఆదోని వైసీపీ ఎమ్మెల్యే. ఇద్దరూ ఒకే జిల్లాకు చెందిన అధికారపార్టీ నేతలు. పైకి చాలా ఆప్యాయంగా మాట్లాడుకుంటారు…