Employee Salary: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 5 రోజుల ముందుగానే అకౌంట్లోకి సెప్టెంబర్ నెల జీతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు జరగనున్న బ్యాంకు సమ్మె కారణంగా లావాదేవీలకు అంతరాయం కలగకుండా చూసేందుకు, సెప్టెంబర్ 2026 జీతాలు, పెన్షన్లను ముందుగానే అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ సెప్టెంబర్ 23న అధికారిక సర్క్యులర్‌ను విడుదల చేసింది.
సెప్టెంబర్ నెల జీతాలు, వేతనాలు, పెన్షన్ల చెల్లింపును సెప్టెంబర్ 25, 2026 శుక్రవారం నాడే డ్రా చేసి పంపిణీ చేయనున్నారు. దేశవ్యాప్త బ్యాంకు సమ్మె ముగింపు సమీపంలో ఉండటం వల్ల ఉద్యోగులు, పెన్షనర్లు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకే ఈ ముందస్తు చెల్లింపుల ఏర్పాట్లు చేసినట్లు ఆర్థిక సేవల శాఖ స్పష్టం చేసింది.
Also Read
- Afghanistan: ‘ఇన్షా అల్లాహ్.. తగిన సమాధానం ఇస్తాం’.. పాక్‌కు తాలిబన్ల హెచ్చరిక
- CJP: 48 గంటల్లో రాజీనామా చేయాలి.. జ్ఞానేశ్ కుమార్‌కు CJP అల్టిమేటం..
- Iran-US: ఇరాన్ తాజా వార్నింగ్.. మళ్లీ దాడి చేస్తే యుద్ధం హిందూ మహాసముద్రం దాకా విస్తరిస్తుందని హెచ్చరిక
- Nadendla Manohar: డీఎస్సీపై అవకతవకలు జరిగితే అసెంబ్లీ ధైర్యంగా మాట్లాడండి..
డిఫెన్స్, పోస్టల్, టెలికమ్యూనికేషన్స్, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు పారిశ్రామిక ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు అందరూ ఈ ముందస్తు పంపిణీ ద్వారా లబ్ధి పొందనున్నారు. సంబంధిత బ్యాంకులు లేదా పే అండ్ అకౌంట్స్ ఆఫీసులు సెప్టెంబర్ 25 నాటికి పెన్షన్లను జమ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ కూడా డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసులన్నీ సెప్టెంబర్ 25 నాటికి బ్యాంకులకు దరఖాస్తులను సమర్పించాలని ఆదేశించింది.
September Salary & Pension Early
Due to the proposed 3-day nationwide bank strike from 28–30 September 2026, the September 2026 salary, wages and pension of Central Government employees and pensioners will be paid early on 25 September 2026 to avoid banking disruptions.
#CentralGovtemployees— 8th pay commission (@8thpaycommision) September 23, 2026
అయితే.. ఈ ముందస్తు చెల్లింపును ఉద్యోగులు ఎలాంటి అదనపు నెల జీతంగా భావించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముందస్తు చెల్లింపుల కారణంగా తలెత్తే ఎలాంటి సర్దుబాటైనా అక్టోబర్ 2026 జీతాలు లేదా వేతనాల నుంచి మినహాయించబడుతుంది. ఈ ముందస్తు చెల్లింపు ఏర్పాట్లను సజావుగా అమలు చేసేందుకు చెల్లింపులు జరిపే బ్యాంకు శాఖలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖ కోరింది. సంబంధిత మంత్రిత్వ శాఖలు తమ పరిధిలోని కార్యాలయాలకు తక్షణ చర్యల నిమిత్తం ఈ ఆదేశాలను సర్క్యులేట్ చేయాలని సూచించారు. బ్యాంకు సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇది ఎంతో ఊరటనిచ్చే నిర్ణయంగా చెప్పవచ్చు.
తాజావార్తలు
-
Afghanistan: ‘ఇన్షా అల్లాహ్.. తగిన సమాధానం ఇస్తాం’.. పాక్‌కు తాలిబన్ల హెచ్చరిక
-
NSE Listing: బీఎస్ఈలో ఎన్ఎస్ఈ గ్రాండ్ ఎంట్రీ.. లిస్టింగ్ అయిన గంటలోనే కోటి షేర్లు ట్రేడ్!
-
Employee Salary: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 5 రోజుల ముందుగానే అకౌంట్లోకి సెప్టెంబర్ నెల జీతం..
-
DSP Bheem Reddy : భీమ్ రెడ్డి బినామీలపై ఏసీబీ ఫోకస్.. 8 ఇళ్లలో ఏకకాలంలో సోదాలు
-
CJP: 48 గంటల్లో రాజీనామా చేయాలి.. జ్ఞానేశ్ కుమార్‌కు CJP అల్టిమేటం..
ట్రెండింగ్
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!