Afghanistan: ‘ఇన్షా అల్లాహ్.. తగిన సమాధానం ఇస్తాం’.. పాక్‌కు తాలిబన్ల హెచ్చరిక
- ఆఫ్ఘనిస్తాన్పై దాడులకు తెగబడ్డ పాకిస్తాన్..
- తగిన సమాధానం ఇస్తామని తాలిబాన్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ వైమానిక దాడులు చేస్తోంది. వరసగా రెండోసారి గురువారం తెల్లవారుజామున ఆఫ్ఘాన్లోని 10 ప్రాంతాల్లో పాక్ దాడి చేసింది. ఈ ప్రాంతాలను డ్రోన్లను ప్రయోగించడానికి, నిల్వ చేయడానికి ఉపయోగిస్తున్నారని ఆరోపించింది. ఈ డ్రోన్లలో కొన్నింటిని తమ దేశంపై దాడికి ఉపయోగించారని పాకిస్తాన్ ఆరోపించింది. ఈ దాడుల్లో నలుగురు మరణించినట్లు ఆఫ్ఘనిస్తాన్ వెల్లడించింది.
అయితే, పాకిస్తాన్ దాడులపై రష్యా స్పందించింది. కాబూల్‌లోని రష్యన్ ఎంబసీ, ఆఫ్ఘాన్లోని తూర్పు ప్రావిన్సులలో వైమానిక దాడుల కారణంగా పౌరులు మరణించడం, గాయపడటంపై తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఇరు పక్షాలు శాంతియుతంగా ఉండాలని, చర్చల ద్వారా విభేదాలు పరిష్కరించుకోవాలని సూచించింది.
Also Read
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
- Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
- Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి
ఈ దాడిపై ఆఫ్ఘాన్లోని తాలిబాన్ పాలకులు తీవ్రంగా స్పందించారు. ‘‘ఇన్షా అల్లా, ఈ దుస్సాహసమైన దురాక్రమణలకు, ఉల్లంఘనలకు గట్టి ప్రతిస్పందన ఇవ్వబడుతుంది’’ అని ఆఫ్ఘన్ ప్రభుత్వం ప్రతినిధి అన్నారు. తాలిబాన్ ప్రతినిధి మాట్లాడుతూ.. పాకిస్తాన్ సైనిక పాలన మరోసారి ఆఫ్ఘాన్లోని కందహార్, పక్తియా, ఖోస్ట్ ప్రావిన్సులపై వైమానిక దాడులు చేసిందని చెప్పారు. ఈ దాడుల్లో నలుగురు మరణించినట్లు వెల్లడించారు. ఈ పరికిపంద చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ ఉల్లంఘన, స్పష్టమైన దురాక్రమణ, నేర చర్యల్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. తాను పాకిస్తాన్‌పై దాడికి ఎలాంటి డ్రోన్లు పంపించలేదని ఆఫ్ఘనిస్తాన్ స్పష్టం చేసింది.
Afghanistan:
Pakistani military regime carried out airstrike around 3:30 a.m. on the Gulan camp in Gurbuz district, as well as near Khost city and in parts of Ismail Khel and Mandozai district. pic.twitter.com/qBEUGfOeNj
— TheGlobalDecoder (@TGD_06) September 24, 2026
తాజావార్తలు
-
Smriti Mandhana: 14 ఏళ్ల తర్వాత భారత జట్టుకు కొత్త సారథి.. నేడే ఫుల్ టైమ్ కెప్టెన్‌గా స్మృతి మంధాన ఎంట్రీ..
-
Windfall Tax on Petrol, Diesel Exports: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. డీజిల్‌పై తగ్గింపు.. పెట్రోల్‌పై పెంపు..!
-
South Indian Heros: బాలీవుడ్ దర్శకులకు నో.. సౌత్ మేకర్స్‌కే జై.!
-
Reliance: “కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..”.. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
-
Anupama Parameswaran: కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేయను.. నా లక్ష్యం అదే!
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!