OTR: టీడీపీ-జనసేనలో మేయర్ సీటు పంచాయితీ? ఏలూరులో హాట్ పాలిటిక్స్
- ఏలూరు మేయర్ సీటు కోసం టీడీపీ, జనసేన మధ్య కోల్డ్ వార్
- అనుచరగణం కోసం ఎమ్మెల్యే బడేటి ట్రయల్స్
- రెండు పార్టీల్లో ఇంటర్నల్‌గా కూడా పెరుగుతున్న పోటీ
- హంగామా.. ఎమ్మెల్యే సీటుకు పోటీని తలపిస్తోందన్న టాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ మేయర్ సీటు కూటమిలో కోల్డ్‌వార్‌ని పెంచుతోందా? ఈసారి తగ్గేదే లే అని జనసేన తొడగొడుతుంటే… పదవి ఏదైనా సరే… ప్రయారిటీ మాదేనని టీడీపీ లీడర్స్ అంటున్నారా? ఆ మేయర్ సీటుకు పోటీ అంటే… కనీసం పది కోట్ల రూపాయలు ఖర్చవుతుందన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? ఎమ్మెల్యే ఎన్నిక కంటే ఎక్కువ హంగామా జరుగుతోంది ఎక్కడ? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులు ఏంటి?
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి చుట్టూ కూటమిలో కోల్డ్‌వార్ గట్టిగా మొదలైందంటున్నారు. 2014, 2021 ఎన్నికల్లో మేయర్‌గా ఎన్నికైన షేక్ నూర్జహాన్ పెదబాబు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి దూకేయడమే పనిగా పెట్టుకున్నారన్న అభిప్రాయం ఉంది. దీంతో గత పదేళ్లుగా వలస నేతల చేతుల్లోనే ఉండిపోయిన ఆ పదవికి ఈసారి డైరెక్ట్ ఎన్నిక కావడంతో సీటు మాదంటే మాదంటూ తెలుగుదేశం, జనసేన ఆశావాహులు పోటీలు పడుతున్నారట. మేయర్ పదవి తన అనుచరగణానికి దక్కేలా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ ఇప్పటికే తనదైన శైలిలో పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. అటు జనసేన లీడర్స్ కూడా మేమేం తక్కువ తిన్నామా అంటూ ఎవరి ట్రయల్స్‌లో వారు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఏలూరు కూటమినేతల మధ్య మేయర్ కుర్చీ కోసం కుస్తీ గట్టిగానే నడుస్తోందని చెప్పుకుంటున్నారు. ఎవరికి సీటు వచ్చినా కలిసి గెలిపించుకుందామని అంటూనే… ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు ఉండటంతో… అంతిమంగా ఈ పరిణామాలు ఎుటవైపు దారి తీస్తాయోనన్న ఆందోళన సైతం కేడర్‌లో పెరుగుతోంది. ఈ ట్రయల్స్‌లో ఏలూరులో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. కూటమి సంగతి అలా ఉంటే… టీడీపీ, జనసేన రెండు పార్టీల్లోనూ ఇంటర్నల్‌గా కూడా పోటీ బాగా ఎక్కువగా ఉందట.
Also Read
- OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
రిజర్వేషన్ డిక్లేర్ అయితే… టిడిపి తరఫున పోటీ చేసేందుకు ఎమ్మెల్యే అనుచరులు కొందరు ఇప్పటికే ఆర్థిక వనరులు కూడా సమకూర్చుకుంటున్నారట. ఇదే సమయంలో జనసేన ఇన్చార్జిగా ఉన్న రెడ్డి అప్పలనాయుడుతో పాటు, ఆ పార్టీ నేత నారా శేషు సైతం సీరియస్ ట్రయల్స్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో బీసీ మహిళ, 2021 ఎన్నికల్లో జనరల్ మహిళకు సీటు కేటాయించడంతో ఈసారి ఓసీలకు దక్కుతుందా లేక బీసీలకా అంటూ… ఎవరి లెక్కల్లో వాళ్ళు మునిగిపోయి పదవి కోసం పోటీలో ఉన్నారు. ఈ పరిణామాలతో ఏలూరు మేయర్ పదవి ఎన్నిక కోసం జరుగుతున్న హంగామా…. ఎమ్మెల్యే సీటుకు పోటీ చేసినదానికంటే ఎక్కువగా కనిపిస్తోందంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. పార్టీలో పెరుగుతున్న పోటీ… ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణకు కూడా తలనొప్పిగా మారుతోందంటున్నారు. అనుచర వర్గానికి అవకాశం ఇవ్వాలా? లేక పార్టీలో సుదీర్ఘంగా పనిచేస్తున్న వారికి ఇవ్వాలా అన్న లెక్కలతో ఆయన తలమునకలవుతున్నట్టు తెలుస్తోంది.
ఇప్పుడు ఏలూరు మేయర్ పదవికి పోటీ అంటే… కనీసం 10 కోట్లు ఖర్చవుతుందన్న గుసగుసలు సైతం ఉన్నాయి. అంత ఆర్ధిక భారాన్ని భరించడం, పార్టీకి విధేయతతో ఉండటం లాంటి రెండు లక్షణాలూ ఉన్న నేత కోసం టీడీపీ చూస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. లోకల్ తెలుగుదేశంలో సీనియర్ నేతలు ఉన్నప్పటికీ…. ఆర్థికంగా అంతంత మాత్రమే కావడంతో….కొత్త వాళ్ళు ఎవరైనా ఎగరేసుకుని పోతారేమోనన్న అనుమానాలు సైతం ఉన్నాయి. అయితే….ఈ విషయంలో ఎమ్మెల్యే బడేటి ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చినట్టు చెబుతున్నారు ఆయన సన్నిహితులు. బ్రిటిష్ పాలనా కాలంలోనే…. అంటే 1866లో మున్సిపాలిటీగా ఆవిర్భవించింది ఏలూరు. అంత పాతదే అయినా…. పంచాయతీకి ఎక్కువ, మున్సిపాలిటీకి తక్కువ అన్నట్టుగా ఉంటాయి ఇక్కడి సదుపాయాలు. ఇక కార్పొరేషన్ అయ్యాక ఏలూరు మేయర్ అంటే… అధికారం ఎటువైపు ఉంటే అటువైపు దూకేసే అవకాశవాది అన్నట్టు మార్చేశారన్న విమర్శలున్నాయి. అలాంటి పోస్ట్‌కు ఇపుడు ప్రత్యక్ష ఎన్నిక జకగబోతుండటంతో… అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందుకే… మిత్ర పక్షాలైనా…. టీడీపీ, జనసేన పోటా పోటీగా పావులు కదుపుతూ పొలిటికల్ హీట్ పెంచుతున్నాయట.
తాజావార్తలు
-
Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
-
Supreme Court: “ఇస్లాం మతంలోకి మారితే రిజర్వేషన్లు వర్తించవు”.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
-
తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!