Off The Record : ఎన్నికల కోసం బీఆర్ఎస్ EXTRA కేర్ తీసుకుంటుందా?
- 2027 మార్చిలో ఖాళీ అవబోతున్న రెండు ఎమ్మెల్సీ సీట్లు
- మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఒక సీటు
- వరంగల్-ఖమ్మం-నల్గొండ రెండో ఎమ్మెల్సీ సీటు
- పేరుకు రెండు సీట్లే అయినా ఆరు ఉమ్మడి జిల్లాల పరిధి
- ఒకటి ఓసీ, మరొకటి బీసీకి ఇచ్చే దిశగా సమాలోచనలు
- నల్గొండ- ఖమ్మం- వరంగల్ సీట్లో ఓసీ ఆశావహుల పర్యటనలు
- అభ్యర్థిని ముందే ఖరారుచేస్తే ఓటర్ల నమోదు వాళ్లే చూసుకుంటారని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record : తెలంగాణలో మరో ఎన్నికల సందడి మొదలైంది. 2027 మార్చి నాటికి ఖాళీ అవబోతున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల నమోదు కోసం షెడ్యూల్ ప్రకటించింది ఈసీ. దీంతో…అన్ని రాజకీయ పార్టీలు దీనిపై దృష్టి సారించాయి. ఇక బీఆర్ఎస్ అయితే… ఈ ఎన్నికల్లో గెలిచి కేడర్‌కు బూస్ట్ ఇవ్వాలన్న ఆలోచనతో ఉందట. అందుకే గట్టిగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఒక సీటు కాగా… వరంగల్-ఖమ్మం-నల్గొండ మరొక స్థానం. ఆ రెండు సీట్లలో వచ్చే మార్చిలో జరిగే ఎన్నిక కోసం ఇప్పుడే కసరత్తు మొదలు పెట్టిందట గులాబీ అధిష్టానం. అలాగే… మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ ఆ పార్టీకి సిట్టింగ్ సీటు. అటు నల్గొండ- ఖమ్మం- వరంగల్ కూడా… మొదట్లో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం అయినప్పటికీ… తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కోల్పోయింది. అందుకే ఈసారి రెండిట్లో పాగా వేయాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. పేరుకు ఇవి రెండు ఎమ్మెల్సీ స్థానాలే అయినా…. 6 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉంటాయి.
ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం రాబోయే అసెంబ్లీ ఎన్నికల మీద కూడా ఉంటుందని లెక్కలు వేస్తోందట బీఆర్ఎస్ అధినాయకత్వం. ఇలాంటి రకరకాల కేలిక్యులేషన్స్‌తో ఈ రెండు స్థానాల్లో కచ్చితంగా గెలిచేందుకు అన్ని పార్టీల కంటే ముందుగానే కసరత్తు మొదలు పెట్టింది బీఆర్ఎస్. దానిలో భాగంగా ఇప్పటికే కేటీఆర్ హరీష్‌రావులు తెలంగాణ భవన్ వేదికగా మాజీ మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఇక ఈ రెండు స్థానాల్లో సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకోవాలన్న ఆలోచనలో గులాబీ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక సీటు ఓసీకి, మరోదాన్ని BCకి ఇచ్చే దిశగా అంతర్గత సమాలోచనలు జరుగుతున్నాయట. నల్గొండ- ఖమ్మం- వరంగల్ టిక్కెట్‌ను ఓసీకి కేటాయించాలనుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే కొందరు ఓసి ఆశావహులు ఆ పరిధిలో పర్యటనలు చేస్తున్నారు. రెండోదాన్ని బీసీకి ఇవ్వాలని దాదాపుగా డిసైనట్టు చెప్పుకుంటున్నారు. పోటీ ఎక్కువగా ఉండటంతో సామాజిక న్యాయం పాటిస్తే… కలిసి వస్తుందని అధిష్టానం ఆలోచనగా తెలుస్తోంది.
Also Read
ఓటర్ల నమోదు కోసం ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదలైంది. దీనితో అభ్యర్థులను ఫైనల్ చేసి అందరికంటే ముందే ప్రచారపర్వంలోకి దూకాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తున్నట్టుగా చెబుతున్నాయి పార్టీ వర్గాలు. ముందే… అభ్యర్థులను ఫైనల్ చేస్తే పట్టభద్రుల ఓట్ల నమోదును కూడా వారే జాగ్రత్తగా చూసుకుంటారన్న ఆలోచన ఉందట. రెండు ఎమ్మెల్సీ సీట్లలో ఒకటి ఓసీకి మరొకటి బీసీకి ఇచ్చినప్పటికీ..అభ్యర్థుల సామాజిక నేపథ్యంతో పాటు రాజకీయ బలాబలాలు, గ్రాడ్యుయేట్ ఓటర్లతో ఉన్న పరిచయాలు, పార్టీతో ఉన్న అనుబంధం లాంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోబోతున్నట్టు సమాచారం.
తాజావార్తలు
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..