DSP Bheem Reddy : భీమ్ రెడ్డి బినామీలపై ఏసీబీ ఫోకస్.. 8 ఇళ్లలో ఏకకాలంలో సోదాలు
- పుప్పాలగూడలో ఏసీబీ మెరుపు సోదాలు
- 8 మంది బినామీల ఇళ్లపై ఫోకస్
- ఆస్తుల పత్రాలు, బ్యాంక్ ఖాతాల పరిశీలన
- బినామీ ఆస్తుల నెట్‌వర్క్‌పై దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డీఎస్పీ భీమ్ రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. భీమ్ రెడ్డికి చెందినవిగా భావిస్తున్న అక్రమాస్తులు, బినామీ వ్యవహారాలపై దృష్టి సారించిన అధికారులు, ఆయనతో సంబంధం ఉన్న ఎనిమిది మంది అనుమానిత బినామీలను పక్కా ఆధారాలతో గుర్తించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని పుప్పాలగూడ ప్రాంతంలో ఉన్న బినామీల నివాసాలపై ఏసీబీ బృందాలు ఏకకాలంలో మెరుపు దాడులు చేపట్టాయి.
ఏసీబీ డీఎస్పీ జి. శ్రీధర్ నేతృత్వంలో సోదాలు
ఈ విస్తృత తనిఖీలు ఏసీబీ డీఎస్పీ జి. శ్రీధర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. బహుళ బృందాలుగా ఏర్పడిన అధికారులు అనుమానితుల ఇళ్లలో అంగుళం అంగుళం క్షుణ్ణంగా శోధిస్తున్నారు. ఈ సోదాల్లో భాగంగా బినామీల పేరిట ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్ పత్రాలు, బ్యాంక్ ఖాతాల వివరాలు, చెక్కులు , ఇతర ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీలక ఆధారాలపై అధికారులు సుదీర్ఘంగా ఆరా తీస్తున్నారు. ప్రధానంగా డీఎస్పీ భీమ్ రెడ్డి తన అక్రమ సంపాదనను ఈ బినామీల పేరిట పెట్టుబడులుగా మళ్లించారనే బలమైన అనుమానాల నేపథ్యంలో ఈ సోదాలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Also Read
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
- Harish Rao : రైతు బీమా ఇవ్వకుంటే సీఎం ఇల్లు ముట్టడిస్తాం..
- Bhatti Vikramarka : తెలంగాణలో పెట్టుబడులకు అండగా ఉంటాం..
- Telangana Studies: వియత్నాం విద్యా మోడల్‌పై తెలంగాణ ఫోకస్.. మనబడిలో ఏం మారబోతోంది?
కీలక పత్రాల పరిశీలన.. దర్యాప్తు ముమ్మరం
సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకుంటున్న వివిధ రకాల పత్రాలు, డైరీలు, డిజిటల్ సాక్ష్యాలను ఏసీబీ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. బినామీలుగా అనుమానిస్తున్న వ్యక్తులతో భీమ్ రెడ్డికి ఉన్న సంబంధాలు, వారి ఖాతాల ద్వారా జరిగిన నిధుల మార్పిడిపై స్పష్టమైన ఆధారాలు సేకరిస్తున్నారు. తనిఖీలు ముగిసిన అనంతరం స్వాధీనం చేసుకున్న అక్రమాస్తుల విలువ, లభించిన పత్రాల వివరాలను ఏసీబీ అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. బినామీ ఆస్తుల నెట్‌వర్క్‌ను పూర్తిస్థాయిలో బయటకు తీసేందుకు ఏసీబీ అధికారులు విచారణను మరింత తీవ్రతరం చేశారు.
తాజావార్తలు
-
Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
-
PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
-
Isha Ambani: జియో పుట్టుక వెనుక అసలు కథ.. ఈషా అంబానీ చెప్పిన సీక్రెట్ స్టోరీ!
-
EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
-
Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!