జోగి రమేష్... మాజీ మంత్రి. వైసీపీ హయాంలో కేబినెట్ మినిస్టర్‌గా ఉండి కూడా... కనీస హుందాతనం లేకుండా తమ నాయకుల మీద విచ్చలవిడిగా నోరు పారేసుకున్నారని, ఆయన చేతలు కూడా అలాగే ఉండేవన్నది టీడీపీ, జనసేన అభియోగం. చంద్రబాబు, లోకేష్, పవన్ మీద హద్దులు దాటి మాట్లాడటమేగాక... బాబు ఇంటి మీద దాడికి ప్రయత్నించిన ఘటనతో పార్టీ హిట్ లిస్ట్‌లో చేరారాయన.