Theater Incidents : థియేటర్లలో పిచ్చి వేశాలు.. అంత ఖాళీగా ఉన్నారా..?
- జంతువులను తెస్తున్న ఫ్యాన్స్
- థియేటర్లలో నానా రచ్చ
- రీ రిలీజ్ థియేటర్లలో రీల్స్ బ్యాచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Theater Incidents : ఎస్.. ఇప్పుడు ఇదే జరుగుతోంది. థియేటర్లకు వెళ్లామా.. సినిమా చూసి వచ్చామా అన్నట్టు ఉండట్లేదు. పైగా ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు అంటేనే అత్యుత్సాహం ఎక్కువ. ఇక ఆ సినిమాలోని కొన్ని సీన్లను అదే థియేటర్ లో రీ క్రియేట్ చేసే పనిలో మన తెలుగు యువత తెగ బిజీగా ఉంటున్నారు. కొన్ని పాపులర్ సీన్లను స్టేజిపైకి ఎక్కి రీ క్రియేట్ చేయడం.. లేదంటే అందరి మధ్యలో రీల్స్ రూపంలో చేసి నానా రచ్చ చేయడం కామన్ అయిపోయింది. ఒక సినిమాలో ఎప్పుడు ఏ సీన్ వస్తుందో ముందే ఊహించేసి.. అందుకే తగ్గట్టు కాస్ట్యూమ్స్ కూడా వేసుకుని వచ్చేస్తున్నారు.
Read Also : Khaleja : రీ రిలీజ్ ట్రెండ్ లో ఖలేజాతో మహేశ్ మరో రికార్డు..
Also Read
యువకులే కాదు.. యువతులది కూడా ఇదే బాట. ఏదైనా సాంగ్ వచ్చిందంటే అందరి మధ్యలోకి వెళ్లి అచ్చం అలాగే డ్యాన్స్ చేసి దాన్ని రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడం. పాపులారిటీ కోసమా.. లేదంటే ఫ్యానిజమా.. ఏదీ అర్థం కావట్లేదు. ఆ సీన్ రీ క్రియేట్ చేయడానికి ఎక్కువ మంది కావాల్సి వస్తే. పది మంది కూడా రెడీ అయి వస్తున్నారు. మరీ ఘోరం ఏంటంటే.. ఆ సీన్ లో ఏవైనా జంతువులు ఉంటే వాటిని కూడా థియేటర్ లోకి తీసుకొస్తున్నారు. మొన్న ఓ అభిమాని ఏకంగా పామును తీసుకొచ్చి అదేదో పెద్ద ఘనకార్యం అన్నట్టు థియేటర్ లో సీన్ క్రియేట్ చేశాడు.
ఇంకా దారుణం ఏంటంటే.. అంతకు ముందు ఓ జంట సినిమాలో పెళ్లి సీన్ ను రీ క్రియేట్ చేయడానికి నిజంగానే పెళ్లి చేసుకుంది. ఏ స్టార్ హీరో సినిమా రీ రిలీజ్ అవుతుందా.. అందులోని సీన్ ను రీ క్రియేట్ చేద్దామా అన్నట్టు వెయిట్ చేస్తోంది మన తెలుగు యువత. కొత్త సినిమాలలో ఇలాంటివి చాలా తక్కువ. కానీ పాత సినిమాలు ఆల్రెడీ చూసేస్తారు కాబట్టి.. అవి రీ రిలీజ్ అయితే వాళ్లకు కావాల్సిన సీన్ ను రీ క్రియేట్ చేయడం కోసమే ప్రత్యేకంగా థియేటర్లకు వెళ్తున్నారు కొందరు రీల్స్ బ్యాచ్. ఈ రోత చూడలేక థియేటర్లకు వస్తున్న వాళ్లు నానా ఇబ్బందులు పడుతున్నారు.
సినిమాను చూడాలా లేదంటే వీళ్లు చేసే నానా యాగి చూడాలా అర్థం కావట్లేదు. ఇది చూసిన వారంతా.. మరీ ఇంత ఖాళీగా ఉన్నారా.. ఎంత అభిమానం ఉన్నా సరే సినిమా చూసి వచ్చేయాలి గానీ.. మరీ సీన్లు రీ క్రియేట్ పేరుతో ఇంత రచ్చ అవసరమా.. మీ లైఫ్ లో ఇంకేం పని లేదా. ముందు మీ లైఫ్ లో సక్సెస్ అవండి. సినిమాలు చూసే సాధారణ జనాలను ఇబ్బంది పెట్టకండి అంటూ క్లాస్ పీకుతున్నారు. కానీ ఈ రీల్స్ బ్యాచ్ మాత్రం.. అవేమీ తమకు పట్టనట్టు.. ఎలాగైనా ఫేమస్ అయిపోవాలని ఇలా రీ రిలీజ్ సినిమాలకు ఎగబడుతున్నారు. ఇది ఎక్కడ ఆగుతుందో అర్థం కావట్లేదు. రాను రాను ఇలాంటి ట్రెండ్ మరీ ఎక్కువ అయిపోతోంది. ఒకవేళ సినిమాలు క్రూర మృగాల సీన్లు ఉంటే ఇంకేం చేస్తారో.
Read Also : Sree Leela : ఓరినీ.. శ్రీలీల ఎంగేజ్ మెంట్ ఫొటోల సీక్రెట్ ఇదేనా..
తాజావార్తలు
-
Trivikram Srinivas: ‘ఆయన అంటే గౌరవంతో కూడిన ఇష్టంతో వచ్చిన భయం’ వెంకీ మామపై త్రివిక్రమ్ వైరల్ కామెంట్స్!
-
LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
-
Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
-
Karthi: “డీఎంకే అయినా.. టీవీకే అయినా ఇంతేనా?” విజయ్ సర్కార్‌ను నిలదీసిన హీరో కార్తి!
-
KPHB: హైదరాబాద్‌లో చీటీల పేరిట రూ.16 కోట్ల కుచ్చుటోపీ
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?